MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  బంధు మిత్రులతో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి.

5 Min read
Author : ramya Sridhar
Published : Nov 21 2022, 04:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Daily Horoscope 2022 New 02

Daily Horoscope 2022 New 02

పంచాంగం                       
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                          
వారము: సోమవారం
తిథి : ద్వాదశి ఉ.07.28ని. వరకు
నక్షత్రం :చిత్త రా.10.56ని.వరకు
వర్జ్యం: ఉ.06.44ని. నుండి ఉ.08.21ని. వరకు తిరిగి తె.04.30ని. నుండి ఉ.06.05ని. వరకు
దుర్ముహూర్తం:మ.12.08ని. నుండి మ.12.52ని. వరకు తిరిగి మ.02.21ని. నుండి మ.03.06ని. వరకు
రాహుకాలం:మ 1.30ని నుండి 3.00ని వరకు
యమగండంఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.12ని.లకు
సూర్యాస్తమయం : సా.05.20ని.లకు  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాలకు అనుకూలం.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  బంధు మిత్రులతో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన శుభప్రదం.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు.  మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది . వ్యాపారంలో లాభాలు ఉంటాయి . ఒక శుభవార్త వింటారు. శత్రువులు దూరం అవుతారు.కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనలాభం. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.
 

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది . వ్యాపారంలో లాభాలు ఉంటాయి .  ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శివపార్వతులను పూజించడం మంచిది.

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి.  రుణాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు.సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.ధన లాభం పొందుతారు.  రవి ధ్యానం మేలు చేస్తుంది.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.  నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎదురైనా ఆటంకాలు తొలగుతాయి. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.  విష్ణు ఆరాధన శుభప్రదం.

914
Zodiac Sign

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ, అత్యాశలను త్యజించాలి. ఖర్చులను తగ్గించాలి.  మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు.దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు.సన్నిహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. శివపార్వతులను పూజించడం మంచిది.
 

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.క్రయ విక్రయాలకు అనుకూలం.  సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనవసరమైన ఆలోచనలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకుగా చికాకులు ఏర్పడవచ్చు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారు అపార్ధం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమ. చేయి  పని వారితోటి కొద్దిపాటి ఇబ్బందులు. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడను.  కోర్టు వ్యవహారాయందు నిరాశ. మానసికంగా బలహీనంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధవహించవలెను. సూర్య ఆరాధన శుభప్రదం.

1214
Zodiac Sign

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. చేయు పనుల యందు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. బంధుమిత్రులతో తత్సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనులకు ప్రయత్నాలు శ్రీకారం చేస్తారు. మీ మాటలతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు లోక్యంగా వసూలు చేసుకోవాలి. ఉద్యోగమనందు సహోద్యోగులు యొక్క సహాయ సహకారం లభించును. ప్రయాణాలు కలిసి వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు.పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.  సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.
 

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలకమైన సమస్యలను బుద్ధి బలంతోటి పరిష్కరిస్తారు.చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు.  మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 
2nd TEST • SA vs AUS
Stumps
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 4
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
1st T20 • NZ vs IND 2026
NZNZ
Thu, 22 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Recommended image2
15 రోజుల్లో ఈ 4 రాశులకు శుభవార్త.. సూర్యుడి నక్షత్ర మార్పుతో ఆర్థికంగా కలిసొచ్చే కాలం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved