ఈ రోజు రాశిఫలాలు : ఓ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం :
తేది :17అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణ పక్షము
వారము: సోమవారం
తిథి : సప్తమి ఉ.07:38ని. వరకు తదుపరి అష్టమి.
నక్షత్రం : పునర్వసు తె.04.22ని.ల వరకు
వర్జ్యం:మ.03.05ని.ల నుండి మ.04.51ని.ల వరకు
దుర్ముహూర్తం:మ. 12.08ని. నుండి మ. 12.55ని. వరకు తిరిగి మ.02.28ని. నుండి
మ.3.15ని.వరకు
రాహుకాలం:మ 1.30ని నుండి 3.00ని వరకు
యమగండంఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:56ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:35ని.లకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంఘం నందు గౌరవం పెరుగుతుంది.ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహన యోగం
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
దైవ దర్శనాలు చేసుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
శుభవార్తలు వింటారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఇంటా, బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అనవసరమైన వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.ఉద్యోగంలో పై అధికారులు ఒత్తిడులు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. దైవ,పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ఋణయత్నం వాయిదాపడతాయి. మతిమరుపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు షాపింగ్ లోను, కొత్త వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచన లుంటాయి. పెద్దల ఆర్యోగం గురించి ఆందోళన చెందుతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కొంతమేర రుణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారుపనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులకు సంతృప్తి చేకూరుతుంది. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.