MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..!

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండును. నూతన వ్యాపారాల గూర్చి పెద్దవారితోటి చర్చిస్తారు. నూతన పరిచయాలు కలిసి వచ్చును. 

6 Min read
Author : ramya Sridhar
Published : Apr 15 2023, 05:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Daily Horoscope

Daily Horoscope

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
    
పంచాంగం    
 
తేది :    15   ఏప్రిల్     2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :  కృష్ణపక్షము                                                                                          
వారము: శనివారం
తిథి :- దశమి రాత్రి 7. 29 ని. వరకు
నక్షత్రం :- శ్రవణం ఉ.6.25ని.వరకు ధనిష్ట తె.4.53వరకు
యోగం:- శుభం రాత్రి 2.35 ని.వరకు
కరణం:- వణిజి ఉ॥8.43 భద్ర(విష్టి) రాత్రి 7.29 ని.వరకు
అమృత ఘడియలు:- రాత్రి 7.08 ని.ల8.38 ని. వరకు
వర్జ్యం:- ఉదయం 10.10 ని ల 11.39ని. వరకు
దుర్ముహూర్తం: ఉ.05. 48 ని నుండి ఉ.7. 27ని వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనవసరమైన ఖర్చులు చేస్తారు. కుటుంబమునందు సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకొనవలెను. సంతానము నుండి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉండును. బంధువర్గముతోటి మనస్పర్ధలు రావచ్చు. మనసునందు అనవసరమైన భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల యందు ఆశించిన ధనలాభం కలగదు. అన్నదమ్ములతోటి సఖ్యతగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓంగం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం లభించును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోద విలాసాలకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులలో బంధువుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండును. నూతన వ్యాపారాల గూర్చి పెద్దవారితోటి చర్చిస్తారు. నూతన పరిచయాలు కలిసి వచ్చును. మానసికంగా చిక్కులు గాని చికాకులు గాని లేకుండా ప్రశాంతంగా ఉండును. ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):


విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభించును. విందు  వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామి తోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల యొక్క ఆదరణ పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును.వాహనం నడుపునపుడు జాగ్రత్త చాలా అవసరం.  ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. ఈరోజు ఏ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

513
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. చేయ పని వారితోనే ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావచ్చును. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
చెడు వార్తలు వినబడు. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలలో వ్యతిరేకదులు ఏర్పడి నష్టపోదురు.  సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో టి సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నూతన కార్యాలకు ఆలోచనలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగును. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు వసూలు అగును. సంతానమునందు అధికశ్రద్ధ చూపించాలి. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అసత్యాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

చికాకులు అధికంగా ఉండును. ఆశించిన మేర వృత్తి వ్యాపారాల్లో లబ్ధి చేకూరదు. నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండను. కొన్ని విషయాల్లో తప్పు దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆదాయాన్ని పెంచే ఆలోచనలు చేస్తారు. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయ పనులు ఫలిస్తాయి. సమాజము నందు అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. మనసునందు భయంగా ఉండును.శత్రువులచే ఇబ్బందులు లకు గురి అవుతారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
అధికారులతోటి పేచీలు రావచ్చును. ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడను. మనసునందు అనేక ఆలోచనలు ఎక్కువగా నుండును. కష్టపడిన వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. చేయు పనుల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. సమాజము నందు మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు  కీలకమైన సమస్యలు గూర్చి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
సమాజం నందు ఉన్నత శ్రేణి వ్యక్తులచే పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడను. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కీలకమైన సమస్యలు కలవరము పెట్టును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి యైనమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.  ప్రయాణాలు అనుకూలించును. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనవసరమైన విషయాలతోటి సమయం వృధా చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఉద్యోగం నందు వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. కోపం అదుపులో ఉంచుకొని వ్యవహారాన్ని చక్కబెట్టుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చేయు పనులయందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. సంఘము నందు మీ మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగమనందు అధికారుల ఒత్తుడులు ఎక్కువగా నుండును. ఎదుటివారిపై  దౌర్జన్యంగా వ్యవహరించడం వలన కొత్త సమస్య ఏర్పడగలవు. మిత్రత్వం దూరం చేసుకోవద్దు. కీలకమైన సమస్యలను తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు తగ్గును. తొందరపాటు పనుల వలన చేయ పనులు ఆటంకాలు ఏర్పడతాయి. క్రయవిక్రయములు సామాన్యంగాను.  ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved