MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి నూతన పరిచయాలు

ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశివారికి నూతన పరిచయాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోదయోగలు సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి

7 Min read
Author : ramya Sridhar
Published : Feb 12 2023, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

పంచాంగం                                                                                                                                                                                                                                             
 తేది : 12ఫ్రిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘం
ఋతువు : శిశిరం
పక్షం : కృష్ణపక్షం                                                                                       
వారము: ఆదివారం
తిథి :   సప్తమి తెల్లవారుజామున 5 11ని వరకు
నక్షత్రం : స్వాతి రాత్రి10. 35ని  వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4.08ని నుండి 5: 42ని       వరకు
దుర్ముహూర్తం:సా.04.24ని. నుండి సా.05.10ని. వరకు                               
రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                  '
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉ.06.33ని.లకు
సూర్యాస్తమయం: సా.05.56.లకు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలలో తెలుసుకుందాం.

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశివారు తాము తలపెట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. మనసులో అనేక ఆలోచనలతో చికాకుగా ఉంటుంది.  పనివారితో అకారణ కలహాలు ఏర్పడను. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.  వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్లుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. బందు వర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.  కుటుంబమునందు ప్రతికూల వాతావరణ ఏర్పడుతుంది. దురాలోచనలు వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.ఊహించని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించి ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఈ రాశివారు చేయాల్సిన పనులను సమయస్ఫూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. వీరు సమాజము నందు పెద్దవారి యొక్క ఆధర అభిమానాలు పొందగలరు. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చేయు పనులను నూతన ఉత్సాహంతోటి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. సమాజం నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని  జపించండం ద్వారా శుభ ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు కలసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజం నందు ప్రతిభ తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రజాభిమానం  పొందగలరు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

614
Zodiac Sign

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడను.  ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగం నందు అధికారులతోటి విభేదాలు ఏర్పడును. అకారణ కోపం, తొందరపాటుతో పనుల్లో ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. భూ  గృహ క్రయవిక్రయాలు యందు ధనలాభం కలుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం వాటిల్లును. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. మిత్రుల వలన అపకారం జరగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం కుమారాయ నమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

714
Zodiac Sign

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
మనసులో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మిత్రులతోటి అభివృద్ధి కార్యక్రమాల గూర్చి చర్చిస్తారు. ఇతరులకు నీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలు అగును. ఉద్యోగం నందు పని ఒత్తిడి తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.  తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని  జపించండి... శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తలు తీసుకొనవలెను.  మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి.  జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. పట్టుదలతో చేయు పనులలో విజయం సాధిస్తారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని కొన్ని సంఘటనలు కలవర పెడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. వృత్తి వ్యాపారాల యందు కొద్దిపాటి సమస్యలు ఏర్పడుతాయి. సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. తలపెట్టిన పనులలో బుద్ధి కుశలత లేకపోవడం వలన ఆటంకాలు ఏర్పడును. పెద్దవారు యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటి వ్యక్తులను చులకనగా చూడటం వల్ల మీకు అపకారం చేయాలని చూస్తారు. కుటుంబంనందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులలో జాప్యం జరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు ఓం రవయే నమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

1014
Zodiac Sign

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానాలు పొందగలరు. సమాజమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.  బంధువుల యొక్క కలయిక. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.
 

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
వృత్తి వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన అధిక ఖర్చుల వలన బాధ కలుగును. సంఘమునందు కొద్దిపాటి అవమానాలు జరుగవచ్చు. బంధువర్గం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. కొత్త సమస్యలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు తీసుకొవాలి. ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరుగును. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండవలెను. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1214
Zodiac Sign

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
గృహము నందు శుభకార్యా చరణ. కుటుంబము నందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగమునందు అనుకోని మార్పులు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీకంటే పెద్దవారి  స్నేహములు కలిసి వచ్చును. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి . సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నవదుర్గయై నమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

1314
Zodiac Sign

Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
అనాలోచిత పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు వలన మానసిక బాధ ఏర్పడును. బందు వర్గం తోటి మనస్పర్ధలు రావచ్చును. మిత్రులతోటి సఖ్యతగా మెలగవలెను. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అధికార ఒత్తులు పెరుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయైనమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కేసులు వివాదములు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనులలో బంధువుల యొక్క సలహాలు సూచనలు తీసుకొనవలెను. పనులలో అడ్డంకులు ఏర్పడినా క్రమేణా పూర్తి చేస్తారు. ఉద్యోగం నందు అధికారుల సహాయ సహకారాలు  సమకూరి ప్రశాంతత లభించును. వివాహ జీవితం ఆనందంగా గడుపుతారు. భూ గృహ నిర్మాణాలు అనుకూలించును. వృత్తి వ్యాపారం నందు అనుకోని ధన లాభం కలుగును. సంఘములో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః అని జపించండి... శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved