Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి సినీ, ఫొటోగ్రఫీ, రంగాల వారికి అనుకూలం

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి సినీ, ఫొటోగ్రఫీ, రంగాల వారికి అనుకూలం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ramya Sridhar | Updated : Jun 10 2023, 04:43 AM
10 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
113
Asianet Image

10   జూన్   2023 శని వారం  మీ రాశి ఫలాలు 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:                                                                                                                                                                       
 
 తేది :   10 జాన్   2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసము
ఋతువు : గ్రీష్మ ఋతువు
పక్షం :  కృష్ణపక్షం
వారము:శనివారం
తిథి  సప్తమి సా॥5.36 ని.వరకు
నక్షత్రం :-  శతభిషం రాత్రి 7.42 ని.వరకు
యోగం:- విష్కంభము సా॥5.02 ని.వరకు
కరణం:- భద్ర(విష్టి) ఉ॥7.09 బవ సా॥5.36 బాలవ తె.4.47 ని.వరకు
అమృత ఘడియలు:- మధ్యాహ్నం 12.59 ని.ల 2.28 ని.వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 05:28 ని.ల 7:12 ని వరకు
వర్జ్యం:- రాత్రి 1.42 ని.ల 3.12 ని.వరకు
రాహుకాలం: ఉ.9:00ని. నుండి ఉ.10:30ని. వరకు
యమగండం: మ.01:30ని నుండి మ.3:00ని. వరకు
సూర్యోదయం :        5.28 ని॥లకు
సూర్యాస్తమయం:    6.29ని॥లకు

ఉన్న నక్షత్రానికి తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వ్యవహ
              
              శుభ ఫలితాలు పొందండి.

              సర్వేజనాః సుఖినోభవంతు

213
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దిన ఫలం:-సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. శారీరక మానసిక  సుఖసంతోషాలు కలుగును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. రావలసిన బాకీలు వసూలు అగును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

భరణి నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):  వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. కళా, ఫొటోగ్రఫీ, రంగాల వారికి అనుకూలం సమయం. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దిన ఫలం:-చికాకులు అధికంగా ఉండును. ఆశించిన మేర వృత్తి వ్యాపారాల్లో లబ్ధి చేకూరదు. నూతన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండను. కొన్ని విషయాల్లో తప్పు దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆదాయాన్ని పెంచే ఆలోచనలు చేస్తారు. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. పట్టుదలతో చేయ పనులు ఫలిస్తాయి. సమాజము నందు అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు. మనసునందు భయంగా ఉండును.శత్రువులచే ఇబ్బందులు లకు గురి అవుతారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దిన ఫలం:-విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభించును. విందు  వినోదాలలో పాల్గొంటారు. వ్యాపార భాగస్వామి తోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. వివాదాలకు దూరంగా ఉండండి. పెద్దల యొక్క ఆదరణ పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. ఈరోజు ఏ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)


దిన ఫలం:-సమాజం నందు ఉన్నత శ్రేణి వ్యక్తులచే పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడను. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. కీలకమైన సమస్యలు కలవరము పెట్టును . జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి యైనమః అనే జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):-  వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

613
telugu astrology

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)


దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు చేస్తారు. కుటుంబమునందు సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకొనవలెను. సంతానము నుండి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉండును. బంధువర్గముతోటి మనస్పర్ధలు రావచ్చు. మనసునందు అనవసరమైన భయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల యందు ఆశించిన ధనలాభం కలగదు. అన్నదమ్ములతోటి సఖ్యతగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓంగం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- కుటుంబ సౌఖ్యం లభించును. పనులు సకాలంలో పూర్తి అగును. (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదము)

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దిన ఫలం:-కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం లభించును. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విందు వినోద విలాసాలకు ధనం ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులలో బంధువుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉండును. నూతన వ్యాపారాల గూర్చి పెద్దవారితోటి చర్చిస్తారు. నూతన పరిచయాలు కలిసి వచ్చును. మానసికంగా చిక్కులు గాని చికాకులు గాని లేకుండా ప్రశాంతంగా ఉండును. ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

హస్త నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

813
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దిన ఫలం:-కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.  ప్రయాణాలు అనుకూలించును. విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కారం అగును. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

దిన ఫలం:-అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనవసరమైన విషయాలతోటి సమయం వృధా చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఉద్యోగం నందు వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. కోపం అదుపులో ఉంచుకొని వ్యవహారాన్ని చక్కబెట్టుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ఈరోజు తారాబలం:-
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)
 

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దిన ఫలం:-నూతన కార్యాలకు ఆలోచనలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారాలు యందు ధన లాభం కలుగును. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. రావలసిన బాకీలు వసూలు అగును. సంతానమునందు అధికశ్రద్ధ చూపించాలి. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అసత్యాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- అవమానాలు కలుగును. అధికారులతోటి విరోధాలు. వృధా ఖర్చులు. చోర భయం( చిన్న విషయము నందు జాగ్రత్త వహించాలి)

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దిన ఫలం:-చేయు పనులయందు సమయస్ఫూర్తి తోటి వ్యవహరించాలి. సంఘము నందు మీ మాట నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగమనందు అధికారుల ఒత్తుడులు ఎక్కువగా నుండును. ఎదుటివారిపై  దౌర్జన్యంగా వ్యవహరించడం వలన కొత్త సమస్య ఏర్పడగలవు. మిత్రత్వం దూరం చేసుకోవద్దు. కీలకమైన సమస్యలను తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు తగ్గును. తొందరపాటు పనుల వలన చేయ పనులు ఆటంకాలు ఏర్పడతాయి. క్రయవిక్రయములు సామాన్యంగాను.  ఈరోజు ఈ రాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (క్షేమతార): వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. రాజ గౌరవం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):- మానసిక శారీరక బలహీనంగా ఉండును. (ఈరోజు అనుకూలం కాదు ప్రతి చిన్న విషయం నందు జాగ్రత్త వహించడం మంచిది)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)
 

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దిన ఫలం:-అధికారులతోటి పేచీలు రావచ్చును. ఎదుటివారిపై ఆవేశం తగ్గించుకొని మాట్లాడవలెను. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడను. మనసునందు అనేక ఆలోచనలు ఎక్కువగా నుండును. కష్టపడిన వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగును. చేయు పనుల యందు ఆచితూచి అడుగులు వేయవలెను. సమాజము నందు మాట విలువ తగ్గుతుంది.అధైర్యం అశాంతి ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు  కీలకమైన సమస్యలు గూర్చి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- శుభవార్తలు వింటారు. వ్యాపార యందు ధన లాభము.   (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు ఈరోజు శుభప్రదము)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- పనులయందు ఆటంకములు ఏర్పడగలవు. అధికారులతోటి సమస్యలు. శారీరక శ్రమ పెరుగును. (ఈరోజు సామాన్యంగా నుండును)

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

దిన ఫలం:-శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. చేయ పని వారితోనే ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావచ్చును. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
చెడు వార్తలు వినబడు. అధిక శ్రమ ఏర్పడుతుంది. కీలకమైన విషయాలలో వ్యతిరేకదులు ఏర్పడి నష్టపోదురు.  సమాజము నందు గౌరవ మర్యాదలు తగ్గును. మిత్రులతో టి సఖ్యతగా మెలగవలెను.  వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము.ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వ్యవహారము నందు అధిక కోపం మరియు ఆటంకములు.  (అనుకూలమైన రోజు కాదు ప్రతి విషయము నందు జాగ్రత్త అవసరము)

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారములో ధన లాభం (నూతన మరియు శుభ కార్యక్రమాలు చేయుటకు శుభప్రదం)

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (నైదనతార):- పనుల యందు ఆటంకములు. బలహీనంగా ఉండుట. (వాహన ప్రయాణాల యందు మరియచేయు పనిముట్ల యందు జాగ్రత్త అవసరము)

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories