ఈ రోజు రాశిఫలాలు: ఓ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్ధికపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సంతాన విషయంలో శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో మాట పట్టింపులు
Daily Horoscope 2022 New 02
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Daily Horoscope 2022 New 01
పంచాంగం :
తేది :18 అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము
వారము: మంగళవారం
తిథి : అష్టమి ఉ.08.45ని. వరకు తదుపరి నవమి.
నక్షత్రం : పుష్యమి పూర్తి
వర్జ్యం:మ.01.13ని.ల నుండి మ.03.00ని. వరకు
దుర్ముహూర్తం:ఉ.08.15ని. నుండి ఉ.09.02ని. వరకు తిరిగి రా.10.30ని.నుండి రా.11.20ని. వరకు
రాహుకాలం:మ. 3.00ని.నుండి సా.4.30ని. వరకు
యమగండం:ఉ. 9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 05:56ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:34ని.లకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాలు అనుకూలించవు. కుటుంబసభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్ధికపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సంతాన విషయంలో శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో మాట పట్టింపులు. ఆకస్మిక ప్రయాణం సూచనలు.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దైవ,పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. శ్రమ అధికం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందుల వలన కొంతమేర రుణాలు చేయవలసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వాహన సౌఖ్యము.దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహిత సహకారంతో అనుకున్న పనులు విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు తీసుకుంటారు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. - కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసరమైన కలహాలు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాసం ఉంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారుపనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులకు సంతృప్తి చేకూరుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
తలపెట్టిన పనులలో ఆటంకాలు. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పై అధికారుల వలన చికాకులు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనవసరమైన కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఉద్యోగాలలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పనుల్లో జాప్యం తప్పదు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.విలువైన వస్తు ఆభరణాలు కొనుగొలు చేస్తారు. సన్నిహితులతో కలిసి అందంగా గడుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన.