MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు తేదీ 26 నవంబర్ శుక్రవారం నుండి 2 డిసెంబర్ గురువారం 2021

వారఫలితాలు తేదీ 26 నవంబర్ శుక్రవారం నుండి 2 డిసెంబర్ గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బం«ధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. 

5 Min read
Author : ramya Sridhar
Published : Nov 26 2021, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆలయాలు  సందర్శిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఉత్సవాలు,  శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విధి నిర్వహణలో ప్రోత్సాహం. రాజకీయవర్గాలకు ఆదరణ. వారం మధ్యలో విందులు, వినోదాలు. భూలాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

213

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బం«ధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సుదీర్ఘకాల వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.  పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. సోదరులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

313

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం మొదట్లో కొన్నిæ వివాదాలు నెలకొన్నా  క్రమేపీ తొలగుతాయి. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. రాబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మరింత పుంజుకుంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్య పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రత్యర్థులను యుక్తిగా ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు  కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఎదురుచూడని అవకాశాలు. ఉద్యోగాలలో ప్రతిభ నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో  అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

513

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం అనుకున్నంత రాబడి సమకూరుతుంది. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థికంగా మరింత బలపడతారు. సన్నిహితులు, సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

713

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం నిరుద్యోగులకు  ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సన్నిహితులు, సోదరులతో కష్టసుఖాలు విచారిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. అనుకున్న కొన్ని పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం అప్రయత్న కార్యసిద్ధి. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవిధుల్లో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో  మిత్రులతో తగాదాలు. శ్రమ తప్పదు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

913

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.  ఆస్తి వివాదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపట్టే వీలుంది. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వారం చివరిలో భూవివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1013

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా కొంత నిదానంగా పూర్తి కాగలవు.  శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఊహించని ధనలాభాలు. గృహం, వాహనాలు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగ  విధులు ప్రశాంతంగా, సాఫీగా సాగుతాయి. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మానసిక ఆందోళన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1113


కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ముఖ్య వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే  మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల ద్వారా æ ఆస్తిలాభ సూచనలు ఉన్నాయి.  నూతన వ్యక్తులు పరిచయం కాగలదు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1213


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సోదరుల నుంచి ఉపయుక్తమైన  సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని ప్రధాన సమస్యల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో కళకళలాడతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాల దీర్ఘకాలిక కోరిక నెరవేరుతుంది. వారం మధ్యలో ఇంటాబయటా ఒత్తిళ్లు. కుటుంబసమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1313
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant Vastu Benefits: ఇంట్లో తులసి మొక్కపెడితే నిజంగా అదృష్టం వస్తుందా? వాస్తు చెప్పే అసలు నిజం
Recommended image2
Moon Transit: కుంభ రాశిలో మహా లక్ష్మీ రాజయోగం... ఈ మూడు రాశుల జీవితంలో కనక వర్షం..!
Recommended image3
Saturn Effect on Relationship: దాంపత్య జీవితంపై శని ప్రభావం ఉంటుందా? కలిసిపోతారా? విడిపోతారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved