ఈ వారం (13 మార్చి నుంచి 19 మార్చి వరకు) రాశిఫలాలు

First Published 13, Mar 2020, 8:47 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలుస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

మేషరాశికి :- ఈ వారం ఉత్సాహం, పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. గృహం, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగుతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో అడుగువేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలుస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహన, గృహయోగాలు. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లకు అవకాశం. విధి నిర్వహణలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాల వారు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఆరోగ్యభంగం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ చూపుతారు. విద్యార్థులు ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయం. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. అయితే పనిభారం పెరుగుతుంది. రాజకీయ, పారిశ్రామివర్గాల అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయవర్గాలు, కళాకారులకు అందిన అవకాశాలు నిరాశ పరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:-ఈ వారం అనుకోని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు పొందుతారు. కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో మరింత అనుకూల సమయం. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు ఉన్నాయి. కళాకారులకు రెండుమూడు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వారం చివరిలో మిత్రులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుని కుటుంబ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:-ఈ వారం చేపట్టిన పనులు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకువస్తాయి. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు దక్కుతాయి. విస్తరణ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాలలో సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు సాగిస్తారు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం కొత్త పనులు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం కొత్త వ్యక్తుల పరిచయం. పనులు చకచకా సాగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని విధంగా సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా బదిలీలు ఉంటాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఫలప్రదమవుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

loader