ఈ వారం రాశిఫలాలు( 10 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ వరకు)
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశికి :- ఈ వారం సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరంటే కుటుంబంలో మరింత ప్రేమ చూపుతారు. వస్తులాభాలు. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొంత అనుకూలస్థితి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి తగాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి :- ఈ వారం దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిథునరాశి :- ఈ వారం కుటుంబ సమస్యలు తీరి కొంత ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు. కళాకారులకు ఊహించని పిలుపు అందుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు చకచకా ముందుకు సాగుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం, కొంత శ్రద్ధ అవసరం. బంధువులతో తగాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి:- ఈ వారం వ్యాపారాలు సామాన్యమైన లాభాలతో నడుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంపై శ్రద్ధ వహించండి. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి:-ఈ వారం బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాల కొంత పరిష్కారం. ఉత్సాహవంతమైన కాలం. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి, పై స్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరతాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి:- ఈ వారం వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి:- ఈ వారం ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల కొనుగోలులో సమస్యలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి:- ఈ వారం ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో అనుకూలత, అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. భూ వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. వారం మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా బాధ్యతలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి:-ఈ వారం స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలించే సమయం. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు.అనారోగ్య సూచనలు. కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. మీ సత్తా అందరిలోనూ చాటుకుంటారు. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి:- ఈ వారం రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. బంధువులతో తగాదాలు పరిష్కారం. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి:- ఈ వారం ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని మంచిచెడ్డా విచారిస్తారు. మీ ఆశయాలు నెరవేరతాయి. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారమయ్యే అవకాశం. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిళ్లు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి:- ఈ వారం ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగే సమయం. ఆలయాలు సందర్శిస్తారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. నూతన ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .