MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు 10 సెప్టెంబర్ శుక్రవారం నుండి 16 గురువారం 2021

వారఫలితాలు 10 సెప్టెంబర్ శుక్రవారం నుండి 16 గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు కొన్ని తీరతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు సహనంతో  పరిష్కరించుకుంటారు. 

6 Min read
Author : ramya Sridhar
Published : Sep 10 2021, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థికంగా  బలపడతారు. ముఖ్యమైన పనులు కొన్ని జాప్యమైనా పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి  నిర్మాణయత్నాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనూకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
214

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు కొన్ని తీరతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు సహనంతో  పరిష్కరించుకుంటారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి చక్కబడుతుంది. రాజకీయవర్గాలు అనుకున్నది సాధిస్తారు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం చేపట్టిన పనులు కొన్ని నెమ్మదిగా సాగుతాయి.  బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.  ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. స్నేహితుల నుంచి ఒత్తిడులు తప్పవు.  వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణ  ఇబ్బందికరంగా మారవచ్చు.  కళారంగం వారికి అవకాశాలు చేజారవచ్చు. వారం మధ్యలో  ధన,వస్తులాభాలు. నూతన పరిచయాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆప్తులు, బంధువుల సహకారంతో ముందుకు సాగుతారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.  గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు పెట్టుబడులు అందుకుని విస్తరణ చర్యలు చేపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే ఛాన్స్‌. వారం చివరిలో కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  

514

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికంగా గతం కంటే అనుకూలిస్తుంది. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సూచనలతో  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

614

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ఉద్యోగావకాశాలతో నిరుద్యోగుల్లో ఉత్సాహం. వ్యాపారాలలో  ఊహించని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో క్లిష్టమైన బాధ్యతల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో  ధనవ్యయం. ఆప్తులతో విభేదాలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబసభ్యులతో తగాదాలు పరిష్కారం. పట్టుదల, ధైర్యంతో ముందడుగు వేసి  విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి  పూర్తి చేస్తారు. విద్య, ఉద్యోగయత్నాలలో శుభవార్తలు. పడిన శ్రమకు  ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో  కొత్త హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. వారం చివరిలో  ఇంటాబయటా ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

814

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం సమాజంలో విశేష గౌరవం, ఆదరణ లభిస్తాయి. నిరుద్యోలకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభ సూచనలు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారమైన లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగయత్నాలలో  పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త సంస్థలు ప్రారంభించే వీలుంది. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం.  విద్యార్థులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందే సూచనలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయవర్గాలకు  విశేష ఆదరణ లభిస్తుంది. వారం ప్రారంభంలో  అనారోగ్యం. మానసిక అశాంతి.  గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. అవసరాలకు ఏమాత్రం లోటు రాదు. ఆస్తులు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మీ కష్టం ఫలించే సమయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలలో నూతనోత్సాహం. వారం మధ్యలో  ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

1114

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులు కూడా మీపై ప్రేమ చూపుతారు. వ్యాపారాలలో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం అందుతుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

1214


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులనైనా మీకు అనుకూలంగా మలచుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో వ్యూహాలు ఫలించి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు  అనుకూలమైన కాలం.  వారం ప్రారంభంలో రుణయత్నాలు,  ఆరోగ్యభంగం.  గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

<p>డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.&nbsp;సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151</p>

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1414

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Recommended image2
Shani Amavasya: అరుదైన శని అమావాస్య.. ఈ రాశులకు ఊహించని కష్టాలు, చిన్న పరిహారం చేస్తే చాలు
Recommended image3
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved