weekly astrology: ఈ వారం(07 ఫిబ్రవరి నుంచి 14 వరకు) రాశిఫలాలు
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. సంప్రదింపులుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఒత్తిడులున్నా గౌరవం పెంచుకుంటారు. సామాజిక బాధ్యతలుంటాయి. క్రమంగా ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. సౌఖ్యలోపం ఏర్పడుతుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత పెరుగుతుంది. ప్రయోజనాలుంటాయి. సంతానవర్గంపై ప్రత్యేక దృష్టి పెరుగుతుంది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆహార విహారాలు, సౌకర్యాలు, ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. సౌఖ్యంగా గడుపుతారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. వ్యాపారాల్లో ప్రయోజనాలు వస్తాయి. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. సంతానంతో కలిసి విందులు, విహారాలుంటాయి. అభీష్టాలు నెరవేరుతాయి. విశ్రాంతి లభిస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంప్రదింపులుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. వృత్తిపరమైన ఒత్తిడులున్నా గౌరవం పెంచుకుంటారు. సామాజిక బాధ్యతలుంటాయి. క్రమంగా ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. సౌఖ్యలోపం ఏర్పడుతుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత పెరుగుతుంది. ప్రయోజనాలుంటాయి. సంతానవర్గంపై ప్రత్యేక దృష్టి పెరుగుతుంది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సుదూర లక్ష్యాలను సాధిస్తారు. క్రమంగా సంప్రదింపులకు అనుకూలమైన సమయం. సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలు వస్తాయి. వృత్తిపరమైన అనుకూలత పెరుగుతుంది. సామాజిక గౌరవం లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నిర్ణయాదుల్లో ఆచి, తూచి వ్యవహరించాలి. వ్యాపారాదుల్లో ఇబ్బందులకు అవకాశం. అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు. ఆత్మవిశ్వాస లోపాలుఉంటాయి. క్రమంగా కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి ఏర్పడుతుంది. వ్యతిరేకతలుంటాయి. పోటీలలో జాగ్రత్తగా మెలగాలి. రుణ రోగాదుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణ భావన పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఖర్చలు పెట్టుబడులు అధికం అవుతాయి. విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారానుబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాలకు అవకాశం కలుగుతుంది. క్రమంగా ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. బాధ్యతలు నిర్వర్తించాల్సిన వస్తుంది. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఏదో కోల్పోతున్న భావన. సంతానంతో చికాకులు, కాంట్రాక్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వ్యాపారాదుల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. నిర్ణయాదుల్లో ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. అధికారిక వ్యవహారాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. సంతానవర్గంతో ఒత్తిడులుంటాయి. ఆలోచనల్లో శ్రమ అధికం. సృజనాత్మక లోపాలుంటాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుటాయి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. క్రమంగా లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోను ప్రయోజనాలుంటాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆడవారితో పోటీలు పనికిరావు. కాంట్రాక్టు వ్యవహారాల్లో శ్రమ ఉంటుంది. సహకారలోపాలుండవచ్చు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సమున్నత కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగం వారికి అనుకూలమైన సమయం. ప్రయాణావకాశాలుంటాయి. క్రమంగా వృత్తి ఉద్యోగాదులపై దృష్టి సారిస్తారు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ ఆర్థికాంశాలు కొంత శ్రమకు గురిచేస్తాయి. మాటల్లో నైరాశ్యం కూడదు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు పెరుగుతాయి. కొత్త పనులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారాదులకు దూరంగా ఉండడం మంచిది. కమ్యూనికేషన్స్ తో సమస్యలు వచ్చే సూచనలు. సహకార లోపాలుంటాయి. క్రమంగా ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వణ దక్షత పెరుగుతుంది. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలు పెంచుకుంటారు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : భాగస్వామ్య అనుబంధాల్లో శుభ పరిణామాలు. కుటుంబ ఆర్థికాంశాలు సంతోషాన్నిస్తాయి. మాటల్లో అనుకూలత పెరుగుతుంది. చమత్కారంగా ప్రవర్తిస్తారు. వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. క్రమంగా అన్ని పనుల్లోనూ జాగ్రత్త మెలగాలి. వ్యర్థంగా కోల్పోయే అవకాశం ఉ:టుంది. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల అనుకూలత పెరుగుతుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. వార్తల వల్ల ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యతిరేక ప్రభావాలపై విజయం సాధిస్తారు. ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యాలు సాధిస్తారు. క్రమంగా భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు పెరుగుతాయి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. కుటుంబం ఆర్థికాంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మాటల్లో చమత్కారం పెరుగుతుంది. భాగస్వామితో సంతృప్తి లభిస్తుంది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. క్రియేటివిటీ పెంచుకుంటారు. వ్యాపారాదుల కోసం కాలం, ధనం వెచ్చిస్తారు. ప్రయాణావకాశాలుంటాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. క్రమంగా వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. పోటీరంగంలో గుర్తింపు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రమాధిక్యం ఉంటుంది. నిర్ణయాదుల్లో సంతోషం ఏర్పడుతుంది. కొత్త పనుల పై దృష్టి సారిసాతరు. బాధ్యతలు విస్తరిస్తాయి.