వామ్మో ఈ రాశివారితో వాదించి గెలవలేం...!
మన దగ్గర ఎంత మంచి పాయింట్ ఉన్నా... అడ్డంగా వాదించేవారు ఉంటారు. అలా వాదించేవారిపై గెలవడం అంటే చాలా కష్టమైన పనే. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారితో మాట్లాడి పోట్లాడి గెలవడం అంత సులువేమీ కాదు ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
మనం కావాలని కోరుకోకపోయినా కొందరితో ఏదో ఒక విషయంలో వాదనలు జరగుతూ ఉంటాయి. అయితే... కొందరితో మాత్రం వాదన పెట్టుకొని మనం గెలవలేం. మన దగ్గర ఎంత మంచి పాయింట్ ఉన్నా... అడ్డంగా వాదించేవారు ఉంటారు. అలా వాదించేవారిపై గెలవడం అంటే చాలా కష్టమైన పనే. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింద రాశులవారితో మాట్లాడి పోట్లాడి గెలవడం అంత సులువేమీ కాదు ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
Zodiac Sign
1.మేష రాశి...
మేష రాశివారికి కాస్త తొందర ఎక్కువ. కోపం కూడా కాస్త ఎక్కువే. ఈ రాశివారు ఎవరితోనైనా వాదన పెట్టుకుంటే... ఎదుటివారి మాట అస్సలు వినరు. ఎదుటివారిదే తప్పు అన్నట్లుగా వాదిస్తారు. వారిదే తప్పు అనే విషయాన్ని వీరు అస్సలు అంగీకరించలేరు. తామే కరెక్ట్... ఎదుటివారిది తప్పు అని వాదిస్తూ ఉంటారు.
Zodiac Sign
2.వృషభరాశి..
ఈ రాశివారికి మొండి పట్టుదల చాలా ఎక్కువ.వారు అనుకున్నట్లు ఏదైనా జరగకపోతే వీరు కోపంతో ఊగిపోతారు. ఎదుటివారితో చాలా సేపు వాదిస్తూనే ఉంటారు.ఈ రాశి వారు తమ స్వంత దృక్కోణానికి మించి చూడరు. పరిస్థితి వారికి ఏ విధంగానైనా ప్రయోజనం కలిగించకపోతే ఇతరుల అభిప్రాయాలను విసిరివేస్తారు.
Zodiac Sign
3.సింహ రాశి..
సింహ రాశి వారికి కోపం చాలా ఎక్కువ. అయితే... అందరిపై తొందరగా కోపం చూపించరు. కానీ... ఒక్కసారి కోపం వస్తే మాత్రం ఊగిపోతారు. వీరికి కోపం గా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండటమే మంచిది. వీరు ఎదుటివారితో వాదనకు దిగితే.. వారిని గెలవనివ్వరు. అసలు వారు చెప్పేదే వినరు. వారు మాత్రమే గెలవాలని అనుకుంటూ ఉంటారు.
Zodiac Sign
4.తుల రాశి..
ఈ రాశివారిలో దూకుడు చాలా ఎక్కువ. వారు ఇతరులు తమతో చెప్పిన వాటిని మరచిపోలేరు. ఎవరైనా తమను ఏదైనా ఉంటే... పగ పెంచుకుంటారు. సమయం చూసుకొని తిరిగి కొట్టాలని చూస్తుంటారు. వీరు ఏ విషయం మర్చిపోరు. కచ్చితంగా సమయం చూసుకొని గెలిచి చూపిస్తారు.
Zodiac Sign
5.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎవరితోనైనా వాదన పెట్టుకుంటే.. గట్టిగట్టిగా అరిచేస్తూ..కేకలు పెడుతూ అరుస్తారు. వీరితో వాదన పెట్టుకుంటే గెలవడం ఎవరి తరమూ కాదు. ఎదుటివారు చెప్పేది వీరు అస్సలు వినరు. వీరితో వాగ్వాదానికి దిగి... గెలవడం ఎవరితరమూ కాదు.
Zodiac Sign
మిథునం, కర్కాటకం, కన్యారాశి, వృశ్చికం, మకరం, కుంభం, మీనం రాశులు వాగ్వివాదం సమయంలో ఎదుటివారి మాటను ప్రశాంతంగా వింటారు. తమ వంతు కథ చెప్పేందుకు ఓపికగా వేచి చూస్తారు.