Sun and Mars: జనవరిలో ఈ రాశులకు బీభత్సంగా కలిసొచ్చేస్తుంది అంతా సూర్య కుజుల చలవే
Sun and Mars: కొత్త ఏడాది జనవరి 2026 నుంచి మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. జనవరిలో మకరరాశిలో సూర్యుడు, కుజుడి అద్భుత కలయిక మూడు రాశుల వారికి అదృష్టాన్నిస్తుంది. ఏ రాశుల వారికి ఇది కలిసి వస్తుందో తెలుసుకోండి.

మకర రాశిలో అద్భుత యోగం
జనవరిలో 2026లో అద్భుత కలయిక జరగబోతోంది. మకర రాశిలో సూర్యుడు, కుజుడు కలవబోతున్నారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. నిజానికి సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు జనవరి 14, 2026న మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక కుజుడిని ధైర్యం, శక్తికి కారకుడిగా చెబుతారు. మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. కుజుడు మకరరాశిలో ఉచ్ఛస్థితిలో, కర్కాటకంలో నీచస్థితిలో ఉంటాడు. కుజుడు జనవరి 16, 2026న మకరరాశిలోకి ప్రవేశించి అక్కడే ఫిబ్రవరి 23 వరకు ఉంటాడు. ఈ కాలం కొంతమందికి విపరీతంగా కలిసి వస్తుంది.
మకర రాశి
మకర రాశిలోనే అద్భుతమైన యోగం ఏర్పడబోతోంది. కుజ, సూర్యుల సంచారం వల్ల మకర రాశిలోనే మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది మకరరాశి వారికి ఎంతో అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. అలాగే వారి జీవితంలో సంతోషం వస్తుంది. వీరికి భౌతిక సుఖాలు దక్కుతాయి. మీ ఆరోగ్య సమస్యలు తగ్గి అంతా బాగుంటుంది.
మీన రాశి
సూర్య కుజుల కలయిక వల్ల ఏర్పడే ఈ రాజయోగం మీనరాశి వారికి ఎంతో అదృష్టాన్ని తెస్తుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేరే చోటుకి బదిలీ కూడా కావచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు ఎంతో లాభాన్ని తెచ్చి పెడతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
తులా రాశి
సూర్యుడు కుజుడు కలిపి తులా రాశికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కుజ, సూర్యుల సంచారం వీరికి ఎంతో శుభప్రదం. వీరికి భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఈ రాశి వారు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరిలో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆస్తి, వైద్య రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది.

