MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మకర రాశిలోని చీకటి కోణం ఇదే..!

మకర రాశిలోని చీకటి కోణం ఇదే..!

నెమ్మదిగా ఉండేవారు, సోమరితనం, అసమర్థ వ్యక్తులు వీరికి నచ్చరు. అలాంటి వారిని వీరు కొంచెం కూడా క్షమించరు. అందరూ ఒకే స్థాయిలో పనిచేయలేరు. కానీ అది మకరరాశికి అర్థం కాదు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 04 2023, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
capricorn

capricorn

ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడూ రెండూ ఉంటాయి. పరిస్థితులు మనలోని మంచి, చెడులను బయటకు తీస్తాయి. మంచిని అందరూ అందరి ముందు ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటారు. కానీ, చెడు మాత్రం ఎవరూ ప్రదర్శించాలని అనుకోరు. జోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి లో ఉన్న చీకటి కోణం ఏంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మకర రాశి భూమికి సంకేతం. ఈ రాశివారిని శని పాలిస్తూ ఉంటుంది. మకర రాశివారు  విపరీతమైన భౌతికవాదం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతిష్టాత్మకంగా ఉంటారు, ఎంతగా అంటే, వారు డబ్బు సంపాదించడం, విజయం సాధించడంపై ఎక్కువ దృష్టి పెడతారు, పని పట్ల వారి అంకితభావం ఎక్కువ. తమలాగే పని పట్ల అందరూ ప్రవర్తించకుంటే వీరికి నచ్చదు. నిర్దాక్షిణ్యంగా తమ టీమ్ ని తొలగించడానికి ఏ మాత్రం వెనకాడరు. వీరికి  సానుభూతి తక్కువ. నెమ్మదిగా ఉండేవారు, సోమరితనం, అసమర్థ వ్యక్తులు వీరికి నచ్చరు. అలాంటి వారిని వీరు కొంచెం కూడా క్షమించరు. అందరూ ఒకే స్థాయిలో పనిచేయలేరు. కానీ అది మకరరాశికి అర్థం కాదు.
 

35


నిరాశావాదం అనేది ఈ రాశిచక్రంతో సులభంగా అనుబంధించబడే లక్షణం. వారు ఎందులో అయినా విజయం సాధించలేకపోతే వెంటనే నిరాశకు గురౌతారు. ఇది వారిని విరక్తిగా లేదా నిస్పృహకు గురిచేస్తుంది. ఒకసారి భ్రమకు గురైన తర్వాత, ఇతరులు వారిని ప్రేరేపించడం లేదా వారిని మళ్లీ ఆశావాదులుగా చేయడం చాలా కష్టమైన పని.
 

45

వారు తమను తాము మానసికంగా వ్యక్తీకరించడం కష్టంగా ఉంటారు. తమ చుట్టూ వారికి వారే గోడ కట్టుకుంటారు. ఆ గోడను పగలకొట్టడం ఎవరితరం కాదు. వారు మానసికంగా అందుబాటులో ఉండరు. దుర్బలత్వం నుండి వెయ్యి మైళ్ల దూరం పరిగెత్తారు. మకర రాశివారికి వివాహం అనే బంధంలో ఉండటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. కానీ, ఈ రాశివారు నిస్వార్థంగా ప్రేమించలేరు. వారిలో స్వార్థం కోణం ఎక్కువగా ఉంటుంది. వారు ఎవరినైనా ప్రేమిస్తున్నామని చెప్పినా, అందులో వారికి ఏదో ఒక లాభం ఉండేలా చూసుకుంటారు.

55

మీరు వారిని బాధపెట్టినట్లయితే వారు మిమ్మల్ని క్షమించరు. పైకి బాగానే ఉన్నట్లు నటిస్తారు. కానీ వారి మనసులో మాత్రం కోపం చాలా ఎక్కువగా ఉంటుంది.  వారు తమ జీవితాంతం మిమ్మల్ని క్షమించరు. వీరితో ఒక్కసారి అనుబంధం చెడిపోతే, మళ్లీ కలవలేరు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు జీవిత భాగస్వామి ద్వారా ధన లాభం పొందుతారు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశుల అబ్బాయిలు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువ! మీది ఏ రాశి?
Recommended image3
Bird Nest: మీ ఇంట్లో పక్షి గూడు కట్టిందా? శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved