MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • ఈ వారం ఓ రాశివారు లక్ష్యాన్ని సాధిస్తారు...!

ఈ వారం ఓ రాశివారు లక్ష్యాన్ని సాధిస్తారు...!

టారో రీడింగ్ ప్రకారం ఓ రాశివారికి  మీరు గతంలో తీసుకున్న నిర్ణయానికి ఫలితం ఇప్పుడు లభిస్తుంది.  మీరు ఇప్పటికీ గణనీయమైన మార్పును చూడలేకపోవచ్చు, కానీ మీరు ఆశించిన మార్పు వైపు పయనిస్తున్నారని గుర్తుంచుకోండి.

4 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2022, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఈ టారో రీడింగ్ ని మనకు ప్రముఖ జోతిష్యులు చిరాగ్ దారువాలా అందించారు. ఈ టారో రీడింగ్ లో ఆయనకు దాదాపు 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం: 
పెద్ద ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం ఈ రాశివారికి ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.  ఆర్థిక ప్రవాహాన్ని పెంచడానికి ప్రయత్నించండి. తీసుకున్న పాత రుణాల వల్ల ఆందోళన ఉంటుంది. ఏదైనా పనికి సంబంధించిన అవకాశాలు వస్తే.. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.  సంబంధానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మీరు నిర్ణయం తీసుకుంటారు. గొంతు నొప్పి, దగ్గు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
శుభ వర్ణం:- ఎరుపు
శుభ సంఖ్య:- 3

313


వృషభం: 
మీరు గతంలో తీసుకున్న నిర్ణయానికి ఫలితం ఇప్పుడు లభిస్తుంది.  మీరు ఇప్పటికీ గణనీయమైన మార్పును చూడలేకపోవచ్చు, కానీ మీరు ఆశించిన మార్పు వైపు పయనిస్తున్నారని గుర్తుంచుకోండి. పనికి సంబంధించిన శిక్షణ కారణంగా యువత తమ రంగంలో ప్రావీణ్యం సంపాదించే అవకాశాన్ని పొందుతారు. మీ భాగస్వామి చూపే ప్రేమ మీ గురించి సానుకూల అనుభూతిని కలిగిస్తుంది. జలుబు, అలర్జీతో బాధపడే అవకాశం ఉంది.
శుభ వర్ణం:- పసుపు
శుభ సంఖ్య:- 2
 

413

మిథునం: 

రెండు పడవల్లో కాలు వేసి.. ఆ తర్వాత అందులో ఇరుక్కోని ఇబ్బంది పడతారు. అయితే... మీ పని ఒత్తిడి తగ్గించుకొనే అవకాశం వస్తుంది.  మీరు మీ అంచనాలు , కోరికలను నెరవేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. కెరీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితంలో బిజీగా మారతారు. మీరు తీసుకున్న నిర్ణయం కష్టంగా ఉంటుంది, కానీ అది మీకు సరైనది, కాబట్టి నిర్ణయాన్ని అస్సలు మార్చవద్దు. శరీర నొప్పులతో బాధపడే అవకాశం ఉంటుంది.
శుభ వర్ణం:- తెలుపు
శుభ సంఖ్య:- 1

513

కర్కాటకం: 
మీరు కోరుకున్న మార్పును చూస్తారు. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది.  ఈరోజు మీరు ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఆధ్యాత్మికత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్చుకుంటారు, దీని కారణంగా మానసిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. పాత పనులకు సంబంధించి నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు ప్రయత్నించండి. త్వరలో విదేశీ సంబంధిత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రేమ జీవితానికి సంబంధించి ఉంచిన సంయమనం జీవితంలో సరైన భాగస్వామిని తెస్తుంది. తలనొప్పి సమస్య కావచ్చు.
శుభ వర్ణం:- ఆకుపచ్చ
శుభ సంఖ్య:- 4

613

సింహం: 
కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో మీరు దోహదపడతారు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు వల్ల మీతో అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. కార్యాలయంలో జరుగుతున్న రాజకీయ పనుల వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మనసుకు విరుద్ధంగా వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. మధుమేహ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఆహారంలో నియంత్రణ పాటించాలి.
శుభ వర్ణం:- నీలం
శుభ సంఖ్య:- 6

713


కన్య: 
పాత ఆలోచనలను విడనాడడం ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీని కారణంగా గత ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీరు మీ లక్ష్యం వైపు కదులుతున్నట్లు అనిపించవచ్చు, కానీ పూర్తి పురోగతి సాధించే వరకు మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. పనికి సంబంధించిన లక్ష్యాలను సాధించడం వల్ల మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. ఇది మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి తగినదని రుజువు చేస్తుంది. సంబంధాలకు సంబంధించిన పాత సమస్యలను మరచిపోయి కొత్తగా ప్రారంభించాలనేది మీ ప్రయత్నం. దంత సమస్య రావచ్చు.
శుభ వర్ణం:- పసుపు
శుభ సంఖ్య:- 5.

813

తుల: 
మీ సామర్థ్యాలను నిరంతరం ప్రశ్నించడం మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లుతుందని గణేశ చెప్పారు. ఇతర వ్యక్తులు మాట్లాడే మాటలు మిమ్మల్ని ప్రభావితం చేయవద్దు. మీరు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను పూర్తి చేయగలరు. ఇతరుల ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిసారీ నిర్ణయాలను మార్చుకోవడం మీ ఆందోళనను పెంచుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంభాషించడం వల్ల కుటుంబంలో అసంతృప్తి వాతావరణం ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
శుభ వర్ణం:- ఊదా
శుభ సంఖ్య:- 8

913

వృశ్చికం: 
ఏదైనా పని చేసేటప్పుడు మీ ఏకాగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. పదే పదే టెంప్టేషన్స్ కారణంగా, మీరు మీ మార్గం నుండి తప్పుకోకుండా జాగ్రత్తపడాలి. ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు, కాబట్టి రోజు చివరిలోగా పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. యువతలో అత్యాశ పెరగడం వల్ల చట్టానికి అతీతంగా పని చేసేందుకు ప్రయత్నించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మాట్లాడే ప్రతికూల పదాలు మీ మనస్సును ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యం విషయంలో తలెత్తే ఆందోళనను అధిగమించేందుకు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.
శుభ వర్ణం:- గులాబీ
శుభ సంఖ్య:- 7
 

1013

ధనుస్సు: 
ప్రతి విషయంలోనూ కోపంగా ఉండటం వల్ల మీ ఆలోచనలు, వ్యక్తిత్వం ప్రతికూలంగా మారుతుంది. జీవితంలో మిస్సయిన వాటిని వదిలేసి కొత్త అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కలవని వ్యక్తులతో కొంత దూరం ఉంచండి. మీ అంచనాలను పరిమితం చేయండి. ప్రయత్నించినప్పటికీ, ఆశించిన విజయం లేకపోవడంతో మీరు లక్ష్యాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి మాట్లాడే మాటలు చేదుగా ఉండవచ్చు కానీ మీకు సరైన దిశను చూపుతాయి. శరీర నొప్పులు ఇబ్బందిపెట్టవచ్చు.
శుభ వర్ణం:- కుంకుమ
శుభ సంఖ్య:- 9
 

1113

మకరం: 
పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఇతరులు ఏమి ఆలోచిస్తారు, ఏమి చేస్తారు అనేదాని కంటే మీ నుండి ఏమి ఆశిస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ స్వంత జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఇతర విషయాలు కూడా మారుతాయి. ఎవరైనా ఉద్యోగంలో ఉన్నవారు సలహాలు ఇచ్చే ముందు వారి పనిని సరిగ్గా చేయాలి. మీ భాగస్వామి చెప్పే ప్రతిదాన్ని అస్సలు నమ్మవద్దు. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
శుభ వర్ణం:- ఎరుపు
శుభ సంఖ్య:- 5
 

1213

కుంభం: 
మానసిక రిజల్యూషన్ తెచ్చే విషయాలను తెలుసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి. మిమ్మల్ని డిప్రెషన్‌కు గురిచేసిన వారితో సరైన సంభాషణ ప్రతికూలతను తొలగిస్తుంది. మరికొద్ది రోజుల్లో పెద్ద అవకాశం వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం కూడా చాలా మారుతుంది. వ్యాపారస్తులకు తమ పని లక్ష్యాలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. సంబంధంలో భావించే ప్రతికూలత దానంతట అదే అదృశ్యమవుతుంది. షుగర్ సమస్య, శారీరక బలహీనత ఎక్కువగా కనిపిస్తాయి.
శుభ వర్ణం:- తెలుపు
శుభ సంఖ్య:- 1

1313


మీనం: 
ప్రతి విషయంలోనూ ఇతరుల అంచనాలను అనుసరించి జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తే  ఇబ్బందిపడతారు. అదే సమయంలో, ఈ ఆలోచన వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో కూడా అవరోధంగా మారుతుంది. తెలిసో తెలియకో మనసులో తలెత్తే కోపం వల్ల సన్నిహితులను బాధపెట్టవచ్చు. ఏదైనా పనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు, ఖచ్చితంగా అనుభవజ్ఞులతో చర్చించండి. సంబంధం నుండి అంచనాలు నెరవేరకపోయినా, మీరు ఈ సంబంధానికి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పొట్ట సంబంధిత సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
శుభ వర్ణం:- నీలం
శుభ సంఖ్య:- 2

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారుతాయి!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved