- Home
- Astrology
- Sun Transit: శని రాశిలోకి అడుగుపెడుతున్న సూర్యుడు, ఈ రాశుల వారికి ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల
Sun Transit: శని రాశిలోకి అడుగుపెడుతున్న సూర్యుడు, ఈ రాశుల వారికి ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల
Sun Transit: సూర్యుడు నక్షత్రాని మార్చుకుంటూ ఉంటాడు. అలా అతి త్వరలో శనికి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

నక్షత్రం మారుతున్న సూర్యుడు
గ్రహాల రాజు అయిన సూర్యుడు నక్షత్రాన్ని అతి త్వరలో మార్చుకోబోతున్నాడు. నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. డిసెంబర్ 2 వరకు ఆ స్థానంలోనే ఉంటాడు. అనురాధ నక్షత్రానికి అధిపతి శని దేవుడు. శనికి చెందిన నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది.
సూర్య సంచారం
సూర్యుడు ధైర్యం, ఆత్మవిశ్వాసానికి కారకంగా భావిస్తారు. సూర్యుడు వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో విపరీతంగా మార్పులు వస్తాయి. అవన్నీ కూడా సాలుకూలమైనవే. కొందరు వ్యక్తులకు అదృష్టాన్ని అందిస్తుంది. ఆర్థికంగా వృత్తిపరమైన పురోగతిని అందిస్తుంది. సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారి ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.
మిథున రాశి
సూర్యుడు నక్షత్రం మార్పు వల్ల మిధున రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులను కూడా వీరు పూర్తి చేస్తారు. వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన అభివృద్ధి కనిపిస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం కూడా దక్కుతుంది. వీరికున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. అదృష్టం మిధున రాశి వారి వైపే ఉంటుంది.
సింహ రాశి
సూర్య సంచారం సింహ రాశి వారికి ఎంతో ప్రయోజనకరం. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి, ఆదాయం పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు కూడా బలపడతాయి. సింహ రాశి వారి సంపద, ఆస్తికి సంబంధించిన విషయాలు, వివాదాలు పరిష్కారాన్ని అవుతాయి. వీరు సమాజంలో ప్రభావంతమైన వ్యక్తులను కలుస్తారు. కోర్టు కేసుల్లో కూడా వీరికి విజయం దక్కి అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
సూర్యసంచారం వీరికి ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో వీరు కోరుకున్నది జరుగుతుంది. మీరు భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఉన్న కలలు నెరవేరుతాయి. వీరికి జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.