Horoscope: జాతకంలో రాహు దోషం ఉంటే ఏం చేయాలి..?
జాతకంలో రాహు దోషం ఉంటే.. చాలా ప్రతికూల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అస్సలు అదృష్టం వారి దరిదాపుల్లో కూడా ఉండదు. ప్రతి పనిలోనూ చాలా కష్టపడాల్సి ఉంటుంది.

రాహు గ్రహ ప్రభావం...
వేద జోతిష్య శాస్త్రంలో రాహువు ఒక కీలక గ్రహం. ఈ రాహువుని నీడ గ్రహంగా పరిగణిస్తారు. రాహు ప్రభావం అన్ని రాశులపై ఏదో ఒక సమయంలో ఉంటూనే ఉంటుంది. మంచి స్థితలో ఉంటే బాగానే ఉంటుంది. కానీ దోష ప్రభావం ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. మరి, ఒకరి జాతకంలో రాహు దోషం ఉంటే... దాని ప్రభావం తగ్గడానికి ఏం చేయాలి? అనే విషయం ఇప్పుడు చూద్దాం...
జాతకంలో రాహు దోషం ఉంటే.. చాలా ప్రతికూల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అస్సలు అదృష్టం వారి దరిదాపుల్లో కూడా ఉండదు. ప్రతి పనిలోనూ చాలా కష్టపడాల్సి ఉంటుంది. వీరికి జీవితంలో ప్రశాంతత అనేదే ఉండదు. కోపం, భయం పెరిగిపోతూ ఉంటాయి. ఆర్థిక సంక్షోభం, జీవితంలో స్థిరమైన స్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే.. రాహును శాంతి పరచాలి. అప్పుడే ఆ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.
రాహు మంత్రం...
రాహు దోషం పోవాలన్నా, ప్రతికూల ప్రభావం తగ్గాలన్నా.. రాహువు మంత్రాన్ని కచ్చితంగా జపించాలి. “ఓం రాహువే నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు ఉదయం లేదా సాయంత్రం వేళలో శాంతియుత ప్రదేశంలో కూర్చొని జపించాలి.
దానం చేయవలసిన పదార్థాలు
రాహువు ప్రభావం తగ్గడానికి తగిన వస్తువులను దానం చేయవలసి ఉంటుంది. నలుపు రంగు దుస్తులు, కొబ్బరి, నీల రంగు వస్తువులను దానం చేయవచ్చు. ఈ వస్తువులను శనివారం లేదా అమావాస్య రోజున పేదలకు దానముగా అందించాలి. దానం చేసే సమయంలో రాహువును మనస్ఫూర్తిగా తలుచుకోవాలి.
పరిహారాలు..
రాహువు చెడు ప్రభావం నుంచి బయటపడేందుకు... కుంభకోణం సమయంలోని తిరునాగేశ్వరంలో రాహు భగవంతునికి ప్రత్యేక పూజలు చేయాలి.
లేదా.. ఆంధ్రాలో ఉన్న శ్రీ కాళహస్తిలో రాహు, కేతు పూజలు కూడా చేయించుకోవచ్చు. ప్రభావం తగ్గుతుంది. అది కూడా ఈ దేవాలయాలలో రాహు కాలంలో ఉదయం 7:30 గంటల నుండి 9:00 గంటల వరకు లేదా సాయంత్రం 4:30 గంటల నుండి 6:00 గంటల వరకు పూజ చేయడం వల్ల అనేక ఫలాలు లభిస్తాయి.
గోమేదకం ధరించాలి..
రాహువు ప్రభావం తగ్గడానికి.. ఆహారంలో మార్పులు చేసుకోవడం, రత్నాలు ధరించడం కూడా చేయవచ్చు. శనివారాల్లో ఉప్పు లేకుండా ఆహారం తినడం,మద్యం, స్మోకింగ్ చేయడం , మత్తుపదార్థాలు అలవాట్లను నివారించడం వంటివి చేయవచ్చు. ఇవి రాహు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. రాహువు చెడు ప్రభావాన్ని తగ్గించడానికి నీలం , నలుపు రంగు వస్త్రాలు ధరించాలి.గోమేదకం రత్నాన్ని ధరించాలి.
జోతిష్యుల సలహా అవసరం..
రాహువు ఎప్పుడూ చెడు ఫలితాలను మాత్రమే ఇవ్వడు. మంచి స్థితిలో ఉన్నప్పుడు సంపద, కీర్తి పెరుగుతుంది. కాబట్టి.. ప్రతికూలంగా ఉన్న రాహువుని అనుకూలంగా కూడా మార్చుకోవచ్చు. పరిహారాలతో అది సాధ్యమౌతుంది. అప్పుడు జీవితంలో మంచి స్థాయికి వెళతారు. ప్రశాంతత, సంపద కూడా పెరుగుతాయి. కాబట్టి, జోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది.