సింహ రాశివారు ప్రేమలో పడితే ఇలానే చేస్తారు...!
ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే... వారిపై ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. తాము ప్రేమించిన వారిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారిని చాలా స్పెషల్ గా చూసుకుంటారు.

సింహ రాశివారు సహజంగానే చాలా దూకుడుగా ఉంటారు. చాలా సూటిగా ఉంటారు. మరి అలాంటి సింహ రాశివారు.. ప్రేమలో ఉంటే.. ఎలా రియాక్ట్ అవుతారు. వారు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే అది వారికి రుజువు చేయడానికి ఏం చేస్తారో ఓసారి చూద్దాం...
Leo Zodiac
సింహ రాశి వారు రొమాంటిక్ గా ఉంటారు. ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే... వారిపై ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. తాము ప్రేమించిన వారిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారిని చాలా స్పెషల్ గా చూసుకుంటారు.
సింహ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే.. వారు ఎవరితోనైనా చనువుగా మాట్లాడినా వీరు తట్టుకోలేరు. చాలా జెలస్ ఫీలౌతారు. అవసరమైతే ఆ విషయంలో గొడవ కూడా పడతారు. అస్సలు భరించలేరు.
Leo Zodiac
ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే.. తన ప్రేమను బహిరంగంగా ప్రదర్శిస్తాడు. చుట్టూ ఎవరు ఉన్నారు అని కూడా పట్టించుకోరు. అందరి ముందు ముద్దుపెట్టుకుంటారు. ఎలాంటి భయం లేకుండా కౌగిలించుకోగలరు, చేతులు పట్టుకొని నడవగలరు. వీరు ఆ సమయంలో ఇరతుల గురించి ఆలోచించరు.
Leo
సింహరాశి పురుషులు సెక్స్ విషయంలోనూ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. వారికి మూడ్ వస్తే.. ఎక్కడ ఉన్నామనేది కూడా పెద్దగా పట్టించుకోరు. ఎక్కడ ఉన్నా సరే చేయాల్సిందేనని అంటూ ఉంటారు. దాని వల్ల అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు అమితంగా ప్రేమిస్తే.. శారీరకంగానే తెలియజేయడానికి ఇష్టపడతారు.
Leo
మీరు మీ జీవితంలో సింహరాశి వ్యక్తిని కలిగి ఉంటే.. అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, అతను మిమ్మల్ని అనేక విధాలుగా ప్రత్యేకంగా భావిస్తాడు. మీకు చాలా విశ్వాసంగా ఉంటారు. మోసం చేయాలని అనుకోరు. చాలా నిజాయితీగా ుంటారు.