Today Horoscope: వృశ్చికరాశి వారికి ఈ రోజు ఈ విషయంలో జాగ్రత్త అవసరం
వృశ్చికరాశి వారి గురువారం రాశిఫలాలు ఇవి. మరి , ఈ రోజు వృశ్చికరాశి వారికి ఆర్థికంగా, ఉద్యోగ-వ్యాపారాల్లో, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందో చూద్దాం..

వృశ్చికరాశి ఫలాలు
నేడు వృశ్చికరాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
ఆర్థిక పరిస్థితి
వృశ్చికరాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయి. పాత అప్పుల బాధ ఎక్కువ అవుతుంది. భూమికి సంబంధించిన గొడవలు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగిస్తుంది. కొత్త వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
ఉద్యోగం, వ్యాపారం
వృశ్చికరాశి వారు వ్యాపారం విషయంలో కొత్త ఒప్పందాలకు అవరోధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాల పాలు చేస్తాయి. వ్యాపారం విస్తరించే పనులకు దూరంగా ఉండండి. ఇకపోతే ఈ రోజు ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. బాగా ఒత్తిడికి గురవుతారు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. క్రమశిక్షణతో పూర్తి చేసిన పనులకు మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. సహచరులతో జాగ్రత్తగా ఉండండి.
ఆరోగ్యం
వృశ్చికరాశి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజు ఈ రాశివారికి అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి, ధ్యానంతో ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.