Maha RajaYoga: ఆగస్టులో రెండు మహాయోగాలు.. దెబ్బకు మూడు రాశుల కష్టాలు తీరినట్లే..!
ఈ రాజయోగ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి సంపద, కీర్తి, గౌరవం లభిస్తాయి. దీని ప్రభావం కలిగిన వ్యక్తుల జీవితం రాజులా మారుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఊహించని విధంగా కలుగుతాయి.

RajaYoga
ఆగస్టు నెలలో గ్రహాల గమనంలో చాలా పెద్ద పెద్ద మార్పులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఒకదాని తర్వాత ఒకటిగా రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ ఆగస్టు నెలలోనే గజలక్ష్మీ రాజయోగాలు, లక్ష్మీ నారాయణ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రడు, బృహస్పతి శుభ కలయిక కారణంగా, ఆగస్టు 20 వ తేదీ వరకు మిథున రాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పుడుతుంది. ఈ రాజయోగ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి సంపద, కీర్తి, గౌరవం లభిస్తాయి. దీని ప్రభావం కలిగిన వ్యక్తుల జీవితం రాజులా మారుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఊహించని విధంగా కలుగుతాయి.సమాజంలో ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. ఇక.. ఆగస్టు21 వ తేదీ నుంచి కర్కాటక రాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. మరి.. ఈ రెండు యోగాలు ఆగస్టు నెలలో మూడు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలిగించనున్నాయి. మరి, ఆ అదృష్ట మూడు రాశులేంటో చూద్దాం..
1.కర్కాటక రాశి...
ఈ రెండు రాజయోగాల కారణంగా కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. గతంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బులన్నీ తిరిగి మళ్లీ మీ చేతికి అందుతాయి. కష్టపడి పని చేయడం ద్వారా.. వ్యాపారంలో విజయం సాధిస్తారు. సంపద సమృద్ధిగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడితే.. అంత డబ్బు సంపాదించగలరు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ అదృష్టం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు ఏ కాలంలో ఏ పని చేసినా విజయం సాధించగలరు.
2.వృషభ రాశి...
ఆగస్టు నెల వృషభరాశి వారికి చాలా అనుకూలంగా , ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగ ప్రభావం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. చట్టపరమైన విషయాలలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో కొత్త ఎత్తులకు చేరుకుంటారు.
3.మిథున రాశి..
మీ ప్రేమ జీవితంలో మీరు విశ్వాసం, స్థిరత్వం , సానుకూల ప్రభావాన్ని పొందుతారు. పాత పెట్టుబడుల నుండి మీరు మంచి రాబడిని పొందుతారు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. గతంలో ఎప్పుడూ చూడని డబ్బును ఈ సమయంలో చూస్తారు.