Date of Birth: ఈ తేదీల్లో పుట్టినవారు అవి మాత్రం కొనకూడదు..!
ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే.. ఏవి పడితే అవి కొంటే వారి జీవితాన్ని తారుమారు చేసేయగలవట. మరి, ఏ తేదీలో పుట్టిన వారు ఎలాంటి వస్తువులు కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
- FB
- TW
- Linkdin
Follow Us
)
జోతిష్యం మాదిరిగానే న్యూమరాలజీ కూడా హిందూ శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా.. ఈ న్యూమరాలజీ ప్రకారం మనిషి పుట్టిన తేదీ ప్రకారం వారి జీవితానికి సంబంధించిన మంచి, చెడుల గురించి వివరిస్తారు. కాగా.. దాని కోసం.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు.. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే.. ఏవి పడితే అవి కొంటే వారి జీవితాన్ని తారుమారు చేసేయగలవట. మరి, ఏ తేదీలో పుట్టిన వారు ఎలాంటి వస్తువులు కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
నెంబర్ 3( 3, 12, 21, 30)
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సాధారణంగా చాలా సృజనాత్మకంగా, ఉత్సాహంగా, సామాజికంగా ఉంటారు. వీరు ఏదైనా వస్తువులు కొనుక్కోవచ్చు. కానీ... ఏదైనా కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు దాదాపు అందరితోనూ కలిసిపోయి ఉంటారు. అలాంటివారు ఏదైనా వస్తువులు ఒంటరి భావన కలిగించేది ఉంటే అవి మాత్రం అస్సలు కొనకూడదు. అంతేకాదు.. వీడియో గేమ్స్, గ్యాడ్జెట్స్ లాంటివి కొనకూడదు.
నెంబర్ 5(5, 14, 23)
5వ సంఖ్య గల వ్యక్తులు సడెన్ గా షాపింగ్ చేస్తూ ఉంటారు. కానీ... వారు ఆలోచించకుండా షాపింగ్ చేయడం మానుకోవాలి. 5వ సంఖ్య గల వ్యక్తులకు ఎరుపు రంగు అశుభంగా పరిగణిస్తారు. 5వ సంఖ్య గల వ్యక్తులు భారీ ఫర్నిచర్ కొనడం మానుకోవాలి. 5వ సంఖ్య గల వ్యక్తులు పాత వస్తువులను కొనడం మానుకోవాలి.
నెంబర్ 6( 6, 15, 24)
సంఖ్యాశాస్త్రం ప్రకారం, 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడతారు. ఖరీదైన వస్తువులను కొనడానికి ఇష్టపడతారు. అయితే, వారు నివారించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు ఖరీదైన కార్లు, నగలు , ఎలక్ట్రానిక్ పరికరాలను కొనకుండా ఉండాలి. ఈ విషయాలు వారికి ఆర్థిక సమస్యలను సృష్టించగలవు. అలాగే, 6వ సంఖ్య ఉన్న వ్యక్తులు నల్ల వస్తువులను నివారించాలి, ఎందుకంటే నలుపు రంగు శుక్ర గ్రహం ప్రభావాన్ని తగ్గిస్తుంది.
నెంబర్ 9( 9, 18, 27)
9వ సంఖ్య ఉన్న వ్యక్తులు రాగి వస్తువులను కొనకుండా ఉండాలి. రాగి కూడా అంగారక గ్రహానికి సంబంధించినది, ఇది 9వ సంఖ్య ఉన్న వ్యక్తులకు హానికరం. అందువల్ల, వారు రాగి పాత్రలు, నగలు లేదా ఇతర వస్తువులను కొనకుండా ఉండాలి.