Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి చుట్టూ దైవం రక్షణ కవచంలా ఉంటుంది
న్యూమరాలజీ ప్రకారం.. ఏ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకంగా దైవం అండ ఉంటుందో తెలుసుకుందాం....

Spiritual
జోతిష్యం ఎలా మన భవిష్యత్తు గురించి చెబుతుందో... న్యూమరాలజీ కూడా అంతే.. మనం పుట్టిన తేదీ ఆధారంగా మనం ఎలా ఉంటాం.. ఎలా ప్రవర్తిస్తామో, మనకు ఉండే ప్రత్యేకతలను కూడా చెబుతుంది. కాగా.. ఈ న్యూమరాలజీ ప్రకారం.. ఏ తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకంగా దైవం అండ ఉంటుందో తెలుసుకుందాం....

ఏ నెలలో అయినా 7, 11, 22, 29 తేదీల్లో పుట్టిన వారికి దేవుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే... వారు ఏది కోరుకున్నా ఆ దేవుడు తీర్చుతాడు. అంతేనా....వారు చుట్టూ ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా ఉంటాడు. వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతూ ఉంటాడట. వారికి తెలీకుండానే వారికి ఒక ఆధ్యాత్మిక శక్తి వారిలో ఉంటుంది. దీని కారణంగా వారి జీవితం ఎప్పుడూ ఆనందంగా, ప్రకాశవంతంగా ఉంటుందట. వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా వారు తట్టుకొని నిలపడగలుగుతారు.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు వీరు సహజమైన బలాన్ని పొందుతారు. వారు లోతైన ఆలోచన చేసే స్వభావం కలిగివుంటారు. అందరితోనూ చాలా నమ్మకంగా ఉంటారు, ఎక్కువగా ప్రశాంతంగా ఉంటారు.. ఇతరుల నుంచి కూడా అలాంటి ప్రశాంతతే కోరుకుంటారు. ఒత్తిడిలో కూడా వారు శాంతంగా వ్యవహరించగలరు. ఏకాగ్రతతో పని చేస్తారు. ఇతరులకు సహాయపడే గుణం కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ ప్రత్యేకమైన సంఖ్యలతో జన్మించినవారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. 7వ తేదీ వారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. 11వ తేదీ వారు శక్తివంతమైన ఆత్మవిశ్వాసం కలిగివుంటారు. 22వ తేదీ వారు సమతుల్యంగా ఆలోచించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. 29వ తేదీ వారు సహజంగా సహాయసహకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ తేదీల్లో జన్మించినవారిని కొన్ని ప్రత్యేక శక్తులు రక్షిస్తాయని నమ్ముతారు. వారు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. వారి నిర్ణయాలు తరచుగా సరైనదిగా ఉంటాయి. వారు సానుకూలంగా ఆలోచించేలా, మంచి మార్గంలో నడిచేలా ఉన్నతమైన శక్తులు మార్గనిర్దేశం చేస్తాయని విశ్వసిస్తారు.
జీవితంలో ఎంతటి అడ్డంకులైనా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. శాంతిని కోరుకునే వారు, ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరించగలరు. వారికున్న సహజమైన ఆధ్యాత్మిక బలం వారిని సక్రమంగా ముందుకు నడిపిస్తుంది. వారి ప్రవర్తన సౌమ్యంగా ఉండటం వల్ల సమాజంలో ఆదరణ పొందుతారు. ఈ ప్రత్యేకమైన తేదీలలో జన్మించిన వ్యక్తులను అదృష్టవంతులు అని చెప్పొచ్చు.

