- Home
- Astrology
- Birth Month: ఈ నెలలో పుట్టినవారి జీవితంలో విడాకులయ్యే ఛాన్స్ ఎక్కువ, బంధాలను కాపాడుకోవాలి
Birth Month: ఈ నెలలో పుట్టినవారి జీవితంలో విడాకులయ్యే ఛాన్స్ ఎక్కువ, బంధాలను కాపాడుకోవాలి
Birth Month: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నెలను బట్టి కూడా జీవితం ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రత్యేక నెలల్లో పుట్టిన వారి వివాహ జీవితం విడాకులతో ముగిసే అవకాశం ఉంది. ఏ నెలలో పుట్టిన వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

ఈ నెలల్లో పుట్టిన వారికి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, రాశి, నెలను బట్టి వారి వ్యక్తిత్వం, జీవితం ఆధారపడి ఉంటుంది. కొన్ని నెలల్లో పుట్టినవారు వైవాహిక జీవితం ఇబ్బందులు పాలవ్వచ్చు. ఎక్కువ కష్టాలు రావచ్చు. వీరి వైవాహిక జీవితంలో గొడవలు త్వరగా వస్తాయి. వీరు విడాకులు తీసుకునే అవాకాశం ఉంది. వారికి పెళ్లి, ప్రేమ జీవితంలో సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఏ నెలలో పుట్టినవారికి విడాకులు అవకాశం ఎక్కువో తెలుసుకోండి.
మార్చి
జ్యోతిష్యం ప్రకారం మార్చిలో పుట్టినవారు చాలా ఉత్సాహంగా ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఇది వారి వైవాహిక బంధం అంత సవ్యంగా ఉండదు. జీవితభాగస్వామితో వీరికి భావోద్వేగపరమైన గొడవలు వస్తాయి. ఈ నెలలో పుట్టినవారు తమ పెళ్లి జీవితంలో భావోద్వేగ స్థిరత్వం లేక గొడవలు పడతారు. అవి విడాకుల వరకు దారితీస్తాయి.
మే నెల
జ్యోతిష్యం ప్రకారం మే నెలలో పుట్టినవారు ప్రేమను అర్థం చేసుకోరు. ఎప్పుడూ ఏదో ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటారు. భావోద్వేగాల కన్నా లాజిక్‌గా ఆలోచించేందుకు ఎక్కువ విలువిస్తారు. తమ జీవిత భాగస్వామిపై శ్రద్ధ ఉన్నప్పటికీ దాన్ని బయటికి చూపించలేరు. దీని వల్ల వారి వివాహ బంధంలో పెద్ద సమస్యలు వస్తాయి. వీరి వివాహ బంధం విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
జూన్ నెల
జ్యోతిష్యం ప్రకారం జూన్‌లో పుట్టినవారు బహుమతులు, ప్రశంసలను ఇష్టపడతారు. వాటినే అధికంగా కోరుకుంటారు. వీరు తమ భాగస్వామి అంటే ఇష్టం, నమ్మకం ఉన్నా వారి నుంచి ఎక్కువ ప్రశంసలు కోరుకుంటారు. కొద్దిగా అగౌరవపరచినా సహించలేరు. దీనివల్ల తీవ్రంగా గొడవలు పడతారు. పరస్పర గౌరవం, వినయం లేకపోవడం వల్ల వీరు తమ బంధాన్ని విడిచిపెడతారు.