Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా నిజాయితీపరులు
న్యూమరాలజీ ప్రకారం వారు పుట్టిన తేదీ ప్రకారం వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. మరి, ఏ తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

సనాతన ధర్మంలో శాస్త్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జోతిష్యం గురించి అందరికీ అవగాహన ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలోని గ్రహ స్థితులను చూసి ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం కూడా మనం పుట్టిన తేదీ, ఆ నెంబర్ ప్రకారం సదరు వ్యక్తి స్వభావం, వృత్తి, ఆర్థిక స్థితి, ఆరోగ్యం గురించి కూడా తెలుసుకోవచ్చు.
ఈరోజు, సంఖ్యాశాస్త్రం సహాయంతో, మంచి మనసు ఉన్నవారు, నిజాయితీపరులు ఎవరో తెలుసుకోవచ్చు.ఏ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ఇతరుల గురించి ఆలోంచి మంచిగా ఆలోచిస్తారు? ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది కలిగించరు? అదృష్ట జన్మదినం అంటే రాడిక్స్ సంఖ్య గల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 2, 3, 7, 8, 11, 12, 16, 18, 20, 21, 25, 27 తేదీల్లో జన్మించిన వారు హృదయపూర్వకంగా నిజాయితీపరులు. వీళ్ళు చాలా పవిత్ర హృదయం కలవారు. వీళ్ళు తమ జీవితంలో ఉన్న అందరితోనూ మనస్ఫూర్తిగా ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ఎవరినీ బాధపెట్టరు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టరు, ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 2, 4, 6, 8, 11, 13, 15, 17, 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో జన్మించిన వారు మంచి హృదయులు. వీళ్ళు తమ ఆత్మీయులను సంతోషంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడూ ప్రేమలో మోసపోతారు. దీనివల్ల, వీళ్ళు తరచుగా బాధపడుతూ, అసంతృప్తిగా ఉంటారు.