MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • NUMEROLOGY: పుకార్లను పట్టించుకుంటే ముందుకు సాగలేరు.

NUMEROLOGY: పుకార్లను పట్టించుకుంటే ముందుకు సాగలేరు.

NUMEROLOGY: న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు ఈ రోజు.. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించడంలో మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ పనులను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. 

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 09 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈరోజు మీకు ఎక్కువ పని ఉంటుంది. అయినప్పటికీ.. మీ కుటుంబం,  వ్యాపార కార్యకలాపాలలో సమతుల్యతను కాపాడుకుంటేనే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. యువకులు తమ సొంత మెరిట్‌ల ద్వారా  విజయాన్ని సాధిస్తారు. పాత గొడవల వల్ల సంబంధాలు చెడిపోతాయి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే స్వీయ పరిశీలన చేస్తూ కొంత సమయం గడపండి. ఇది మీలో సానుకూల శక్తిని కలిగిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు మునుపటిలాగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించడంలో మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ పనులను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఎలాంటి సమస్యనైనా కమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో ఎవరితోనూ వాదించకండి. ఇలా చేయడం వల్ల సమయం, శక్తి వృధా అవుతుంది. వ్యక్తిగత, వ్యాపార కార్యకలాపాలలో మంచి సమన్వయం అవసరం. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. తలనొప్పి, మైగ్రేన్‌ల నుంచి ఉపశమనం పొందుతారు. 
 

39

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ సమయంలో ఇతరుల నుంచి ఏమీ ఆశించొద్దు. అలాగే మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మీ పనులు త్వరగా పూర్తవ్వడానికి సహాయపడుతుంది. మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాల్సి ఉంటుంది. యువతరం బద్ధకం, ఉల్లాసాల్లో సమయాన్ని వృథా చేసుకుంటారు. మహిళలు ఎక్కువ బాధ్యత తీసుకోకుండా వ్యక్తిగత పనుల్లో కొంత సమయాన్ని గడుపుతారు. మీ వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాల గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామంపై ఎక్కువ శ్రద్ధ వహించండి.
 

49

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీరు ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో గడుపుతారు. మీలో అద్భుతమైన శాంతిని అనుభవిస్తారు.  పరిచయాలను బలోపేతం చేసుకోండి. పెద్దల మార్గదర్శకత్వం, సలహా మీకు ఎంతో మేలుచేస్తాయి.  పుకార్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో మీరు చేసే విధానాలపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో శ్రమ కారణంగా,సరైన ఫలితం సాధిస్తారు. సంతోషకరమైన ఇంటి వాతావరణాన్ని నిర్వహించడానికి మీ సహకారం అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
 

59

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

సొంత అవగాహనతో తీసుకున్న నిర్ణయానికి తగిన ఫలితం దక్కుతుంది. విద్యార్థులు ఇంటర్వ్యూలు లేదా కెరీర్ పోటీలలో విజయం సాధించే అవకాశం ఉంది. జీవితంపై మీ సానుకూల దృక్పథం మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఒక ప్రత్యేక వ్యక్తి గురించి ఏదైనా చెడు వార్త విన్నప్పుడు మనస్సు కలత చెందుతుంది. ఇంటి సభ్యుని వివాహంలో కొన్ని గొడవలు జరగొచ్చు. సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కార్యాలయంలో మీ ప్రభావాన్ని కొనసాగించండి. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

69

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

కుటుంబం, ఆర్థిక సంబంధమైన పనుల నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు. గత కొంత కాలంగా కొనసాగుతున్న ఒడిదుడుకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనుభవజ్ఞుడైన, మతపరమైన వ్యక్తితో కొంత సమయం గడపడం వల్ల సానుకూల ఆలోచనలు కలుగుతాయి. పొరుగువారితో విభేదాలు రావొచ్చు. మీరు సహనం, సంయమనంతో పరిస్థితిని కాపాడుకోగలుగుతారు. ఇంట్లోకి ఎలక్ట్రానిక్ వస్తువును కొంటారు. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంటి సమస్యలపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం తలెత్తొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
 

79

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ పని నైపుణ్యాలు ఊహించిన దానికంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి. కేవలం భావుకతకు బదులుగా మీ తెలివితేటలు, చాతుర్యాన్ని ఉపయోగించండి. కుటుంబం, బంధువులకు తగిన సమయం కూడా వెచ్చిస్తారు. ఏకాంతంగా ఉంటే మనశ్శాంతి కలుగుతుంది.  ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉండొచ్చు. వ్యాపార ప్రణాళికలను కొంతకాలం పాటు నివారించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు పరస్పర సహకారం, అంకితభావంతో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

89

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఏదైనా ముఖ్యమైన వార్త అందుకుంటారు. మానసికంగా మీరు బలంగా, శక్తివంతంగా అనుభూతి చెందుతారు. ఏదైనా భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి తాజా విధి విధానాలను అనుసరించడం మంచిది. అంతా సవ్యంగానే ఉన్నా జీవితంలో కొంత నిరాశ తప్పదు. కోపం మీరు నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. విశ్రాంతి కోసం మతపరమైన కార్యక్రమాలలో కొంత సమయం గడపడం మంచిది. వ్యాపారంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం సానుకూలంగా ఉంటుంది. మీ సమస్య గురించి కుటుంబ సభ్యులకు చెప్పండి. సరైన పరిష్కారం దొరుకుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచండి.
 

99

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఎక్కడి నుంచో ఒర శుభవార్త అందుతుంది.దగ్గరి బంధువు సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తాడు. అతి నమ్మకం, అహం మీ పనులను చెడగొడతాయి. మీ ఆలోచనను మార్చుకోండి. ఇతరుల సలహాలపై ఎక్కువగా ఆధారపడొద్దు. వ్యాపార సంబంధిత కార్యకలాపాలను వీలైనంత వరకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇంటి ఏర్పాటు విషయంలో భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు తలెత్తొచ్చు. శరీర నొప్పులు, జ్వరం సమస్యలు ఉంటాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved