MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • NUMEROLOGY: మీ కలలను నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం

NUMEROLOGY: మీ కలలను నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం

NUMEROLOGY: న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు ఈ రోజు.. దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు సామాజిక పనికి బదులుగా మీ వ్యక్తిగత పనిపై దృష్టి పెట్టండి.  

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 08 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఏ పని చేసినా కష్టపడి చేయండి. ఫోన్ ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మార్కెటింగ్, మీడియా సంబంధిత పనులపై దృష్టి పెట్టండి. ఎలాంటి భవిష్యత్తు ప్రణాళిక వేసుకున్నా ఇతరుల నిర్ణయాల కంటే మీ స్వంత నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కార్యాలయంలో మీ నైపుణ్యాలను అందరూ మెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈరోజు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొంత సమయం గడుపుతారు. వారసత్వంగా ఏదైనా వివాదం ఉంటే దాన్ని ఈ రోజే పరిష్కరించండి. విద్య,  వృత్తికి సంబంధించిన సమస్యలను విద్యార్థులు పరిష్కరించుకుంటారు. మీ సోదరులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీ బాధ్యత. వృత్తి స్థితి అలాగే ఉండొచ్చు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. 
 

39

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు సామాజిక పనికి బదులుగా మీ వ్యక్తిగత పనిపై దృష్టి పెట్టండి. మీ ప్రవృత్తిని కాపాడుకోండి. కోపం పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. పిల్లలకు మీ సహాయం కావాలి. కాబట్టి వారికోసం కూడా కొంత సమయం కేటాయించండి. ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

49

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

రోజు విజయవంతంగా గడిచిపోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనైనా విజయం సాధిస్తారు. ఏదైనా పని చేసే ముందు దాని గురించి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోండి. భూమికి సంబంధించిన పనులలో ఎక్కువ ప్రయోజనాలను ఆశించొద్దు. ఎక్కువ పొందాలనే కోరిక దెబ్బతింటుంది. చదువుతున్న విద్యార్థులు సోమరితనం వల్ల తమను తాము నష్టపరుస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది.
 

59

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

కొత్త ప్లాన్లు వేయడానికి బదులుగా ఉన్నవాటిని కంప్లీట్ చేయండి. ఈ రోజు సంతోషకరంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. సమయం విలువను గుర్తించండి. సోమరితనం మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వకండి. పాత ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తొచ్చు. దగ్గరి బంధువుల్లో కూడా స్వార్థం కనిపిస్తుంది. ప్రయోజనం కోసం చేసుకున్న ఒప్పందం ముందుకు సాగుతుంది. 
 

69

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఆర్థిక వ్యవహారాలను బలోపేతం చేయడానికి ఈ రోజు మంచి రోజు. మతపరమైన సంస్థలతో కూడిన కార్యకలాపాలలో కూడా సమయం గడిచిపోతుంది. మీ ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు, ఆప్యాయతలు కుటుంబంపై నిలిచి ఉంటాయి. ఒక స్నేహితుడు స్వార్థపూరితమైన ఆలోచనతో సంబంధాన్ని నాశనం చేయగలడు. ఫీల్డ్‌లో మీ కార్యకలాపాలు, ప్రణాళికలను బహిర్గతం చేయొద్దు. కుటుంబంతో కలిసి ఒక రోజు వినోదాలలో గడుపుతారు. 
 

79

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈరోజు ప్రయోజనకరమైన రోజుఅవుతుంది.మీ కలలు,  కల్పనలను నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ సామర్థ్యాన్ని నమ్మితే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఒత్తిడి మీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పెద్దల సలహాలు, సహకారం తీసుకోండి. ఆస్తి సంబంధిత వ్యాపారంలో సానుకూల ఫలితాలు పొందొచ్చు. సరైన ఇంటి వాతావరణాన్ని నిర్వహించడంలో జీవిత భాగస్వామి ముఖ్యమైన సహకారిగా ఉంటారు.

89

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17 , 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

సౌకర్యవంతమైన వస్తువుల షాపింగ్‌లో కుటుంబంతో ఆనందం గడుపుతారు. మతపరమైన పండుగకు వెళ్లే కార్యక్రమం కూడా ఉంటుంది. ఎక్కడో కూరుకుపోయిన డబ్బు దొరకడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల ఏదైనా ప్రతికూల కార్యకలాపాల కారణంగా ఆందోళన ఉంటుంది. మీరు పనిలో మరింత నిమగ్నమై ఉంటారు. కుటుంబ వాతావరణాన్ని చక్కగా నిర్వహించగలుగుతారు. మహిళలు తమ ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగి ఉంటారు.

99

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

సామాజిక కార్యక్రమాలలో మీ సహకారం మీకు గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. మీ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రజలకు తెలియజేస్తారు. గృహ పునరుద్ధరణ ప్రణాళికలను కూడా తయారు చేయొచ్చు. పెట్టుబడి సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండండి. లేదంటే నష్టపోయే పరిస్థితివస్తుంది. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. భార్యాభర్తల మధ్య బంధంలో మధురమైన వివాదాలు ఏర్పడొచ్చు. గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు ఉంటాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved