MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • NUMEROLOGY:వీరిపై పరువు నష్టం లేదా తప్పుడు ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది

NUMEROLOGY:వీరిపై పరువు నష్టం లేదా తప్పుడు ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది

NUMEROLOGY: న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు ఈ రోజు.. చాలా పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. అలాగే రోజువారీ సందడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోతే అది ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 22 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఒత్తిడితో కూడిన దినచర్య నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ఈ రోజు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మతపరమైన, ఆధ్యాత్మిక పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలతో ప్రజలను కలవడం మీకు సహాయకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని పొరపాట్లు జరగొచ్చు. కొన్ని సలహాలు తీసుకుంటే మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఇంటి పెద్దలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకండి. ఇది ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. మీరు వ్యాపారంలో కొన్ని విజయాలు పొందుతారు. ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం పొందేందుకు ధ్యానం చేయండి. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంత సమయం గడపండి.
 

29

సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

సమయం సంతృప్తికరంగా ఉంటుంది. హడావిడి కాకుండా ప్రశాంతంగా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితులతో సమావేశం మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రత్యేక సమస్యపై కొంత చర్చ ఉంటుంది. పైగా ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయకండి. మీ పనులను వెంటనే అమలు చేయడానికి ప్రయత్నించండి. మితిమీరిన నమ్మకాన్ని పెట్టుకోకండి. కొంతమందికి కోపం తెప్పించొచ్చు. వ్యాపారంలో  రుణ పరిస్థితి ఉన్నట్టైతే మీ సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోకుండా ఉండండి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఎలాంటి శారీరక సమస్యల పట్ల అజాగ్రత్తగా ఉండకండి.

39

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

గ్రహాల స్థానం సానుకూలంగా ఉంటుంది. ఒక ప్రత్యేక వ్యక్తి సహాయంతో మీ పనును పూర్తిచేసుకుంటారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా పరిష్కరించబడతాయి. యువత కొన్ని పనులలో విజయం సాధిస్తారు, సృజనాత్మక పని పట్ల వారి ఆసక్తి కూడా పెరుగుతుంది. ఏదైనా పనిలో వైఫల్యం కారణంగా మీ మనోబలం దెబ్బతినకుండా చూసుకోండి. సన్నిహితుల మద్దతు కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది. పితృ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే, దానిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. త్వరలోనే సమస్యలన్నింటిని పరిష్కరిస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కష్టాల్లో మీ దృఢత్వాన్ని కాపాడుకోండి

49

సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీరు ఇంటి పునరుద్ధరణ పనుల్లో బిజీగా ఉంటారు. వ్యక్తిగత పనులలో విజయం సాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ దృఢ సంకల్పంతో కష్టతరమైన పనులను పూర్తి చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది.  కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు మీరు మీ విశ్వాసాన్ని కోల్పోతారు. ఈ రోజు కూడా గ్రహాల స్థానం అలాగే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. విద్యార్థులు పనికిరాని పనులకు బదులు చదువుపై దృష్టి పెట్టాలి. వ్యాపారంలో ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు లాభదాయకమైన ఆర్డర్‌ను పొందుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధంలో మాధుర్యం ఉంటుంది. 
 

59

సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీడియా ద్వారా లేదా మీకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా కూడా కొంత కొత్త సమాచారం, వార్తలను అందుకుంటారు.  పెండింగ్‌లో ఉన్న లేదా రుణంగా తీసుకున్న డబ్బును వాపసు చేయడం సాధ్యమవుతుంది. మీ పనులను పూర్తి చేసుకుంటారు. చట్టవిరుద్ధమైన పనులపై ఆసక్తి చూపకండి. లేకుంటే మీరు కొన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చొచ్చు. డబ్బులు వచ్చే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. సన్నిహిత మిత్రుడితో మీ సంబంధాన్ని చెడగొట్టొద్దు. వ్యాపార భాగస్వామితో వివాద పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవడం అవసరం. వ్యక్తిగత సమస్యల కారణంగా మీరు కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు. స్త్రీలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 

69


సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈరోజు చాలా పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. అలాగే రోజువారీ సందడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోతే అది ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన ఏదైనా పనిని చేయబోతున్నట్టైతే ఈరోజు వాయిదా వేయండి. ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంది. మీ వ్యాపార కార్యకలాపాలను గోప్యంగా ఉంచండి. ఎవరితోనూ భాగస్వామ్యం చేయొద్దు. మీ బిజీ సమయాన్ని కుటుంబం,  భాగస్వామితో గడపండి. బలహీనత కారణంగా కాలు నొప్పి, అలసట సమస్య ఉంటుంది.
 

79

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంది.  కుటుంబంలో ఒక ముఖ్యమైన అంశంపై మీ సలహాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. స్త్రీలు తమ పనులను పూర్తి ఆత్మవిశ్వాసంతో, అంకితభావంతో పూర్తి చేయగలుగుతారు. మీ సామర్థ్యానికి మించి పని చేయడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు పనితో పాటు విశ్రాంతి తీసుకోవాలి. పక్కవాడితో సన్నిహిత సంబంధం లాంటి వాతావరణం ఏర్పడుతోంది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి శాఖాపరమైన విచారణ జరిగితే ఫలితం మీకు అనుకూలంగానే రావొచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది. ఒకరి మాటలకు, సలహాలకు మరొకరు విలువ ఇస్తారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయొద్దు.

89

సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

గత కొంత కాలంగా ఉన్న సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. సామాజిక, రాజకీయ వలయం కూడా పెరుగుతుంది. మీ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మంచి సమయం. బంధువులు ఇంటికి చేరుకుంటారు. పిల్లల కార్యకలాపాలు, సంస్థను పర్యవేక్షించడం అవసరం. వారితో కొంత సమయం గడపండి. మీ ప్రణాళికలు, కార్యకలాపాల గురించి ఎవరితోనూ చర్చించకండి. ఈరోజు ప్రయాణాన్ని వాయిదా వేయండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీ ప్రతి పనిలో జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులను సంప్రదించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. జలుబు కారణంగా మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది.

99

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పనుల్లో మంచి సమయాన్ని గడుపుతారు. దీంతో ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ ప్రణాళికలను అమలు చేయడానికి మీరు ఒక ప్రత్యేక స్నేహితుడి మద్దతును పొందుతారు. అలాగే అన్ని కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభమవుతాయి. అపరిచితులతో  వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన పరువు నష్టం లేదా తప్పుడు ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది. కోపం, కఠినమైన పదాలను ఉపయోగించడం మానుకోండి. ఇది పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. కుటుంబ బిజీ కారణంగా మీరు వ్యాపారంపై దృష్టి పెట్టలేరు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్య రావొచ్చు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదు..!
Recommended image2
Venus Transit: భరణి నక్షత్రంలోకి శుక్రుడు... ఈ రాశుల ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే
Recommended image3
Dream Astrology: కలలో ఎవరో వెంబడిస్తున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved