MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • NUMEROLOGY:ఈ రోజు మీ కల నెరవేరబోతోంది

NUMEROLOGY:ఈ రోజు మీ కల నెరవేరబోతోంది

NUMEROLOGY: న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారు ఈ రోజు.. మధ్యాహ్నం గ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూలత, సమతుల్య ఆలోచనతో పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు.  

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 13 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Daily Numerology

Daily Numerology


సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించండి.  అలాగే కుటుంబంలో జరుగుతున్న గందరగోళాన్ని తొలగించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలను రూపొందించండి. ప్రణాళికతో పాటు దానిని ప్రారంభించడంపై శ్రద్ధ వహించండి. మధ్యాహ్నానికి పరిస్థితి కాస్త అనుకూలంగా మారుతుంది. ఖర్చు చేసేటప్పుడు బడ్జెట్‌ను విస్మరించవద్దు. లేకపోతే మీరు బాధపడొచ్చు. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగానే ఉంటాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Daily Numerology

Daily Numerology

సంఖ్య 2 (ఏదైనా నెలలో 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితి, ఇంటి ఏర్పాటును మంచి స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. మీరు మతం, సామాజిక సేవపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. సన్నిహిత మిత్రుడు లేదా బంధువు మీ కష్టాలకు కారణం కావొచ్చు. వినోదంతో పాటు వ్యక్తిగత పనులపై కూడా శ్రద్ధ పెట్టాలి. వృత్తిపరమైన పని విధానంలో కొంత మార్పు ఉండొచ్చు.
 

39
Daily Numerology

Daily Numerology

సంఖ్య 3 (ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

చాలా కాలంగా నిలిచిపోయిన పనిని ఒకరి సహాయంతో ఈరోజు పూర్తి చేస్తారు. అది మీకు ఓదార్పు, ఉపశమనాన్ని కలిగిస్తుంది. పిల్లలు, గృహ సమస్యలను పరిష్కరించడానికి, సహాయం చేయడానికి కొంత సమయం కేటాయించండి. ప్రజా సంబంధాలలో మీ అభిప్రాయాన్ని బలంగా ఉంచుకోవడం అవసరం. పొరుగువారు లేదా బయటి వ్యక్తులతో ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండండి. మీరు సమీపంలోని ప్రయాణానికి కూడా దూరంగా ఉంటే మంచిది. కార్యాలయంలోని సిబ్బంది, ఉద్యోగుల మద్దతుతో నిలిచిపోయిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించొచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

49
Daily Numerology

Daily Numerology


సంఖ్య 4 (ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి. మీ సానుకూలత, సమతుల్య ఆలోచన ద్వారా కార్యకలాపాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతాయి. మీ అహాన్ని నియంత్రించుకోండి. ప్రస్తుత సమయాన్ని ప్రశాంతంగా, ఓపికగా గడపాలి. పరస్పర సహకారాన్ని కొనసాగించండి. ఏదైనా విజయం చాలా చర్చ వల్ల  జారిపోతుంది. వృత్తిపరమైన కార్యకలాపాలు సాధారణంగా ఉండొచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండొచ్చు. అధిక శారీరక శ్రమ కారణంగా, కండరాలలో నొప్పి ఉండొచ్చు.
 

59
Daily Numerology

Daily Numerology


సంఖ్య 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ ప్రత్యేక పని సమాజంలో, కుటుంబంలో ప్రశంసించబడుతుంది. అన్ని కార్యక్రమాలను క్రమపద్ధతిలో చేయడం, సామరస్యం పాటించడం ద్వారా విజయం సాధిస్తారు. జాగ్రత్తగా ఉండండి ఎక్కువ భావోద్వేగం కూడా హానికరం. మీ హృదయంతో కాకుండా మీ మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో నిర్మాణానికి సంబంధించిన ఏదైనా పని జరుగుతుంటే, దానిలో ఆటంకాలు ఏర్పడొచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు కూడా నిలిచిపోవచ్చు. మీడియా లేదా ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.
 

69
Daily Numerology

Daily Numerology

సంఖ్య 6 (ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఫైనాన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. బంధువు ఆరోగ్యం మెరుగుపడుతుందనే శుభవార్తలు అందుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శకత్వంపై నడుచుకోండి. మీ శక్తిని సానుకూలంగా ఉపయోగించండి. తప్పుడు విషయాలపై మీ సమయాన్ని వృథా చేయకండి. ఈ సమయంలో ప్రస్తుత వాతావరణం కారణంగా ప్రతికూలతను మీ నుండి మెరుగనివ్వవద్దు. మీ ప్రణాళికలు, పని వ్యవస్థను రహస్యంగా ఉంచండి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి.
 

79
Daily Numerology

Daily Numerology

సంఖ్య 7 (ఏదైనా నెలలో 7, 16 , 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ప్రతికూలతల నుంచి మీరు ఈ రోజు కొంత ఉపశమనం పొందుతారు. మీరు వదులుకున్న పనికి సంబంధించినది ఈరోజు జరగొచ్చు. యువత భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలి. డబ్బు లెక్కలపై కొన్ని సందేహాలు ఉండొచ్చు. స్నేహితుడికి సంబంధించి పాత వివాదం మళ్లీ తెరపైకి రావొచ్చు. కోపం తెచ్చుకునే బదులు ప్రశాంతంగా పరిష్కరించుకోండి. వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి.
 

89
Daily Numerology

Daily Numerology


సంఖ్య 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు బిజీగా ఉంటారు. మీ దగ్గరి బంధువుల స్థితిని తెలుసుకోవడానికి మీరు ఫోన్ ద్వారా వారితో సన్నిహితంగా ఉండొచ్చు. ఒకరితో ఒకరు ఆలోచనలు పంచుకోవడం వల్ల అందరూ సుఖంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. మీరు అవసరమైన స్నేహితుడికి సహాయం చేయవలసి రావొచ్చు. మీ భద్రతను కూడా జాగ్రత్తగా చూసుకోండి.వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మరోసారి ఆలోచించడం అవసరం. బిజీగా ఉండటమే కాకుండా కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది.
 

99
Daily Numerology

Daily Numerology

సంఖ్య 9 (ఏదైనా నెలలో 9, 18,  27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ఈ రోజు మీ నెరవేరని కల నెరవేరొచ్చు. మధ్యాహ్నం గ్రహ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూలత, సమతుల్య ఆలోచనతో పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సన్నిహిత వ్యక్తి మీ సమస్యకు కారణం కావొచ్చు. సెంటిమెంట్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఉండాల్సిన సమయం ఇది. యంత్రం లేదా ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యాపారంలో లాభదాయకమైన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved