Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో పదే పదే మోసపోతుంటారు!
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ, టైం ని బట్టి చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన వారిని అదృష్టం వరిస్తే, మరికొన్ని తేదీల్లో పుట్టిన వారిని దురదృష్టం వెంటాడుతుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ చుట్టు ఉన్న వారి చేతిలో మోసపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రేమలో. మరి ఏ తేదీలో పుట్టిన వారు ప్రేమలో ఎక్కువగా మోసపోతారో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, టైం భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు కూడా. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా ఎమోషనల్ గా ఉంటారట. మరీ ముఖ్యంగా అమ్మాయిలైతే చాలా దయగా ఉంటారట. వారు రిలేషన్ షిప్ కి కట్టుబడని వ్యక్తులకు దగ్గరై.. ప్రేమలో మోసపోతుంటారట. మరి ఏ తేదీలో పుట్టిన వారికి ఇలా జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.
ఈ తేదీలో పుట్టిన వారు మోసపోయే ఛాన్స్ ఎక్కువ
న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ విషయంలో రిస్క్ ఎక్కువట. ఆ తేదీలో పుట్టిన వాళ్లు ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉందట. నిపుణుల ప్రకారం ఏ నెలలో అయినా 2, 5, 7, 11, 12, 14, 17, 20, 24, 25, 27, 29 తేదీల్లో పుట్టిన వాళ్లు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎందుకు మోసపోతారు?
ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. దానికి తోడు చాలా దయగా, కేరింగ్ , లాయల్‌గా ఉంటారు. ఎవరినైనా చాలా త్వరగా నమ్మేస్తుంటారు.
తప్పుడు మనుషులపై ఇష్టం:
ఈ తేదీల్లో పుట్టిన ఆడవాళ్లు ఎక్కువగా తప్పుడు వ్యక్తులను ఇష్టపడతారు. మోసం చేసే, రిలేషన్‌షిప్‌కి కట్టుబడి ఉండని మగవాళ్లకి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ప్రేమలో మోసపోతుంటారు.
మార్పు వస్తుందని ఆశ:
వాళ్ల పార్టనర్ జీవితంలో మార్పు తీసుకురాగలమని, సమస్యలు తీర్చగలమని ఈ తేదీల్లో పుట్టినవారు బాగా నమ్ముతారు.
గ్యాస్‌లైటింగ్ బారిన పడటం:
ఈ మహిళలు గ్యాస్‌లైటింగ్ బారిన పడతారు. మానసికంగా బలహీనపడి, తమని తాము నిందించుకుంటారు. చాలామంది మగాళ్లు రకరకాల వేషాలతో అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికి చూస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అలాంటి మగవాళ్లకి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు.
మోసం వల్ల వచ్చే నష్టం:
ఈ రిలేషన్‌షిప్స్ వల్ల అమ్మాయిలు డిప్రెషన్‌కి గురవుతారు. బాధ, ఆందోళన, నమ్మకం లేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు.
ఇవి గుర్తించుకోండి
న్యూమరాలజీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ దాన్ని నమ్మడం, నమ్మకపోవడం మనచేతిలో ఉంటుంది. ఏదేమైనా రిలేషన్‌షిప్‌లో జాగ్రత్తగా ఉండటం, సరైన పార్టనర్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.