Birth Date:ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలతో పెట్టుకుంటే మీ పని అయిపోయినట్లే
ఇలాంటి అమ్మాయి ని కనుక మీరు పెట్టుకున్నారో.. మీ పని అయిపోయినట్లే.మిమ్మల్ని ఓడించకుండా, ఈ అమ్మాయిలు వదలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..

Woman
జోతిష్యం ప్రకారం.. మనిషి భవిష్యత్తు, జాతకం గురించి ఎలా తెలుసుకోవచ్చో.. న్యూమరాలజీ ప్రకారం కూడా మనిషి పుట్టిన తేదీ ఆధారంగా వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిల గురించి తెలుసుకుందాం. ఇలాంటి అమ్మాయిలు అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటారు.అన్యాయాన్ని ఎదురించడంలో ముందుంటారు.అన్యాయాన్ని ఎదురిస్తారు. సహజంగా న్యాయకత్వ లక్షణాలుతో ఉంటారు. ఇలాంటి అమ్మాయి ని కనుక మీరు పెట్టుకున్నారో.. మీ పని అయిపోయినట్లే.మిమ్మల్ని ఓడించకుండా, ఈ అమ్మాయిలు వదలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..

1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు...
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకోగల శక్తి వీరిలో ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఇతరుల మీద ఆధారపడటానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఉంటారు. ఎలాంటి చెడుతో అయినా పోరాడటానికి ముందుంటారు. నిజం వైపే నిలపడతారు. చాలా నిజాయితీగా ఉంటారు. తమ ప్రవర్తనతో ఇతరులను కూడా ప్రేరేపిస్తారు.
3, 12, 21, 30 తేదీలలో జన్మించిన అమ్మాయిలు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ఇతరులతో చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. అందరితో చాలా బాగా కలిసిపోతారు. వీరి మాటతీరు అందరికీ నచ్చుతుంది. ఎంతమందిలో ఉన్నా వీరు మాత్రం స్పెషల్ గానే కనపడతారు. వీరు చాలా నమ్మకస్తులు. న్యాయం వైపు పోరాడతారు. చూడటానికి ఆకర్షణీయంగా కూడా ఉంటారు.ఏ రూపంలో వచ్చినా చెడును ఎదుర్కొనే సామర్థ్యం వీరిలో ఉంటుంది.
5, 14, 23 తేదీలలో జన్మించిన అమ్మాయిలు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా ఉంటారు. వారి ఆలోచనలో విశాల దృక్పథం , ప్రగతిశీలతను కలిగి ఉంటారు. వారి గురించి అత్యుత్తమమైన విషయం ఏమిటంటే వారి మేధో శక్తి , ఏ పరిస్థితికైనా అనుగుణంగా మారే సామర్థ్యం. వారు ఎల్లప్పుడూ సత్యాన్ని వెతుకుతూ ఉంటారు. అధికారాన్ని లేదా సామాజిక నిబంధనలను ప్రశ్నించడానికి భయపడరు. ఈ సహజమైన ఉత్సుకత , పదునైన తెలివితేటలు వారిని చెడు, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధులను చేస్తాయి.