Date of Birth:ఈ తేదీల్లో పుట్టిన వారితో డేటింగ్ నరకమే..!
కొన్ని తేదీల్లో పుట్టిన వారు అందరితో సౌమ్యంగా ఉంటే, మరి కొందరు క్రూరంగానూ ఉంటారు. మరి, ఎలాంటి తేదీల్లో పుట్టినవారితో డేటింగ్ చేస్తే.. మీ జీవితం నరకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

toxic relationship
న్యూమరాలజీ ప్రకారం మనిషి పుట్టిన తేదీని బట్టి వారి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చు. వారి పుట్టిన తేదీ వారి మనస్తత్వాన్ని, ప్రర్తనను, ఇతరులతో మెలిగే విధానాన్ని కూడా తెలియజేస్తుంది. దీని ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన వారు అందరితో సౌమ్యంగా ఉంటే, మరి కొందరు క్రూరంగానూ ఉంటారు. మరి, ఎలాంటి తేదీల్లో పుట్టినవారితో డేటింగ్ చేస్తే.. మీ జీవితం నరకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

జనవరి 14, మార్చి 27, మే 9, జులై 30, సెప్టెంబర్ 18, నవంబర్ 6 తేదీల్లో పుట్టిన వారిని కనుక మీరు ప్రేమించినా, లేక పెళ్లి చేసుకున్నా, లేదంటే వారితో డేటింగ్ చేసినా మీకు వారు నరకం చూపించడం ఖాయం. మరి, వీరి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం

Image: Getty
1.జనవరి 14...మాస్టర్ మానిప్యులేటర్. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరినైనా మానిప్యులేట్ చేయగలరు. ఎదుటివారు చెప్పిన దానిని పూర్తిగా మార్చేసి.. వారు చెప్పిందే నిజం అని నిరూపించేయగలరు. వారు చేసిన తప్పును అస్సలు ఒప్పుకోరు. ఇతరులు తప్పులు చేయకపోయినా వారిని బ్లేమ్ చేస్తూనే ఉంటారు. అందుకే.. ఇలాంటి వారితో డేటింగ్ అంటే దిన దిన గండంగానే ఉంటుంది. ఎప్పుడు ఏం అంటారా అని భయపడుతూ ఉండాలి.

Image: Getty
2.మార్చి 27 - కాంట్రాడిక్షన్
ఈ తేదీల్లో పుట్టిన వారితో కూడా రోజుకో గండంలా ఉంటుంది. ఎదుటివారి మాటలను కాంట్రడిక్ట్ చేయడంలో ముందుంటారు. ప్రేమగా ఉన్నట్లే ఉంటారు.. అంతలోనే కోపం ప్రదర్శిస్తారు. బయటకు వెళదాం అని ప్లాన్ చేస్తారు.. అంతలోనే వారే ప్లాన్ క్యాన్సిల్ చేసేస్తారు. ఒక నిమిషం వీరంత ప్రేమ చూపించేవారే లేరు అని అనిపిస్తుంది. మరుక్షణంలోనే వారి ప్రేమ మోసం అనిపించేలా ప్రవర్తిస్తారు.

3.మే 9 ఇక ఈ తేదీలో పుట్టిన వారిని భరిచండం కూడా చాలా కష్టమే. మీరు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా పెద్దగా పట్టించుకోరు. వారు సమాధానం ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు. వారు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీతో మంచిగా ఉంటారు.మీరు ఎంత ప్రేమ చూపించినా వారు మాత్రం తిరిగి శ్రద్ధ మాత్రం చూపించరు.
జూలై 30 - ది ఎమోషనల్ టైమ్ బాంబ్
ఈ తేదీల్లో పుట్టినవాితో డేటింగ్ నరకంలా ఉంటుంది. ప్రతి దానికీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. తమ మనసులో ఏమున్నదో చెప్పరు.. కానీ ఎదుటివాళ్లు అది అర్థం చేసుకోవాలని అనుకుంటారు. అర్థం చేసుకుంటే పర్లేదు. కానీ, అర్థం చేసుకోలేదో.. ఇంక అంతే నరకం చూపిస్తారు.

Image: Getty
సెప్టెంబర్ 18 – ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటారు. ప్రతిదానినీ అవసరమైన దానికంటే 100 రెట్లు కష్టతరం చేయగలరు.
ప్రతి టెక్స్ట్, ప్రతి ఇంటరాక్షన్, ప్రతి శ్వాసను అతిగా ఆలోచిస్తారు. ఇతరులను ఎమోషనల్ గా ఇబ్బంది పెడుతూనే ఉంటారు.
నవంబర్ 6.. ఈ తేదీల్లో పుట్టిన వారిని నమ్మడం అంత ఈజీ కాదు. ప్రతి విషయంలోనూ బేధాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. వీరి దగ్గర చాలా రహస్యాలు ఉంటాయి. ఏ విషయాన్ని మనస్ఫూర్తిగా పంచుకోలేరు. మీ గురించి కూడా అర్థం చేసుకోలేరు. పేరుకే రిలేషన్ లో ఉంటారు కానీ.. ఎన్ని రహస్యాలు అయినా వారిలోనే దాచేసుకుంటారు.

