Zodiacsigns: పాపం ఈ రాశులవారు చాలా అమాయకులు..!
వీరిని ఎదుటివారు ఎప్పటికప్పుడు మోసం చేయాలని చూస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అందరూ మంచివారే అని నమ్ముతూ ఉంటారు. అందుకే మోసపోతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులవారు చాలా అమాయకులట.

అమాయకత్వం అంటే... తెలివి తక్కువ తనం కాదు. అమాయకత్వం అంటే.. నిస్వార్థంగా, నిజాయితీగా ఉండటం. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడటానికీ, ఆలోచించడానికి కూడా వీరు భయపడిపోతారు. ఎవరైనా తమను బెదిరిస్తే వణికిపోతారు. ఈ క్రమంలో పాపం.. కాస్త ఎక్కువగానే ఒత్తిడికి గురౌతూ ఉంటారు. వీరిని ఎదుటివారు ఎప్పటికప్పుడు మోసం చేయాలని చూస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అందరూ మంచివారే అని నమ్ముతూ ఉంటారు. అందుకే మోసపోతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశులవారు చాలా అమాయకులట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
మేష రాశివారు చాలా విషయాల్లో మొండిగా ఉంటారు. చాలా ఉద్రేకంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి వీరు చాలా అమాయకులట. చాలా విషయాల్లో వీరు ఇంత అమాయకులా అనే సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారు కోరుకున్నది మాత్రమే చేస్తారు. కానీ.. ఇతరులతో పోల్చినప్పుడు.. వీరి అమాయకత్వం బయటపడుతుంది.
2.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉండటంతో పాటు... చాలా అమాయకులు. వీరు జీవితంలో అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమ, భావాలకు విలువ ఇస్తూ ఉంటారు. వీరు అందరి పట్ల స్వచ్ఛమైన భావాలు కలిగి ఉంటారు. అందుకే.. వీరు ఎవరికీ హాని, ద్రోహం లాంటివి చేయాలని అనుకోరు. ఈ రాశివారు ఎక్కువగా మంచి గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందరూ మంచివారే అని కూడా అనుకొని గుడ్డిగా బతికేస్తూ ఉంటారు. ఈ క్రమంలో.. ప్రపంచంలోని అతి కఠినమైన విషయాలను వీరు పట్టించుకోరు. అందుకే... వీరు అమాయకులుగా కనపడతారు.
ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి జీవితం పట్ల అవగాహన ఎక్కువ. వీరు జీవితాన్ని చాలా సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు. వీరికి జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరు కలలో కూడా చెడు విషయాల గురించి ఆలోచించరు. దానికి బదులుగా.. ఎదుటివారికి ఏ విధంగా సహాయం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీరు చాలా అమాయకులు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ముఖంపై చిరునవ్వును వదిలిపెట్టరు. ప్రతి ఒక్కరి పట్ల పాజిటివ్ గా మాత్రమే ఆలోచిస్తారు.
.కన్య రాశి..
ఈ రాశివారు కూడా చాలా అమాయకులు. కనీసం.. తమ కారణంగా ఒక్క ఈగ కూడా బాధపడకూడదని అనుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచిస్తారు. అందరి పట్ల చాలా సౌమ్యంగా ఉంటారు. చాలా దయగలవారు. అంతేకాకుండా చాలా అమాయకులు. తమను ఎదుటివారు ఇబ్బంది పెడుతున్నా కూడా.. వీరు ఎదురుతిరగరు. తమకంటూ కొన్ని నియమాలను పెట్టుకొని ఆ విధంగానే నడుచుకుంటారు. తమ నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించరు.
5.మకర రాశి..
మకర రాశివారు కూడా అమాయకుల కేటగిరిలోకే వస్తారు. ఈ రాశివారు చాలా నిజాయితీతో ఉంటారు. వీరు ఉత్తమ ప్రమాణాలతో జీవిస్తారు. తమపై ఎదుటివారు కుట్ర చేయాలని చూసే సమయంలో మాత్రం వీరు చాలా అమాయకులు. అందరూ మంచివారే అని వీరు నమ్ముతుంటారు. వీరు చెడు మార్గంలో ఎలాంటి పద్దతులను ఆశ్రయించరు. తమ దృఢమైన వైఖరితో వీరు ముందుకు సాగుతుంటారు. తమను కష్టపెట్టుకుంటారే గానీ... ఎదుటివారిని ఇబ్బందిపెట్టరు.