Monthly Horoscope January 2024 : ఓ రాశివారు నూతన వస్తు వాహనాది కొనుగోలు,ఆర్దిక లాభం
జనవరి నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల ఆర్థిక లాభం కలుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశి వారికి అష్టమ అర్ధాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని 11 సార్లు లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రం గాని పారాయణ చేయడం మంచిది.)
శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥
![article_image2](https://static-ai.asianetnews.com/images/01h9fkph9vb6axy4xdnkwn2c9j/Mesh-3-1693814834491_300x533xt.jpg)
Aries daily horoscope
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
రవి భాగ్య స్థానంలో సంచారం వలన సంతానంతో అకారణంగా కలహాలు రాగలవు. ప్రమాదాలు జరిగే అవకాశం 17-1-24 నుంచి రాజ్య స్థానం లోకి ప్రవేశం జరుగును.ఈ సంచారం వలన అనుకూలమైన శుభ ఫలితాలు పొందగలరు.
కుజుడు భాగ్య స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలమైనది కాదు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
బుధుడు అష్టమ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు. 11-1-24 నుండి భాగ్య స్థానంలో సంచారం. ఈ సంచారము అనుకూలం కాదు. ఇతరులకు దుష్కా కార్యాలు చేసే ఆలోచనలు కలుగుతాయి .
శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పై అధికారులతో ఆదరణ పొందగలరు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. బుధుడు శుక్ర సంచారం వలన ఈ మాసం అనుకూలంగా ఉంటుంది.మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలించి లభించును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. రైతులకు మంచి పంట లభిస్తుంది. వ్యాపారాలు మంచి లాభ సాటిగా జరుగును. ఆర్థికంగా లాభపడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలిస్తాయి.
అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు లో సఖ్యతగా మెలగాలి. భూ సంబంధిత వ్యవహారాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
భరణి నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.
కృత్తిక నక్షత్రం వారికి మాసాధిపతి గురువు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా గలవు. ఉద్యోగాలు లో ఉన్నతమైన అధికారం లభించను.
(ఈ రాశి వారు ఈ మాసం ఆదిత్య హృదయం పారాయణం మరియు మంగళవారం సుబ్రహ్మణ్యం దేవాలయ సందర్శన చేయుట మంచిది.)
Vrishbha Dainik Rashifal
వృషభం(కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర
రవి సంచారం అనుకూలంగా లేదు. భూ గృహ క్రయ విక్రయాల ఈ మాసం వాయిదా వేయడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుజుడు అష్టమ స్థానంలో సంచారం అనుకూలమైనది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యంత్ర పనిముట్లు తో తగు జాగ్రత్తలతో పని చేయాలి.
బుధుడు 11-1-24 నుంచి బుధ గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. సంతాన అభివృద్ధి. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు. ఉద్యోగాలు లో అధికార వృద్ధి కలుగును.
శుక్రుడు 22-1-24 నుంచి శుక్ర సంచారం బాగుంది. బంధుమిత్రుల సమాగమం. అధికారుల ఆదరణ పొందగలరు. అన్ని విధాల అభివృద్ధి కలుగును. ఈ మాసం
చేసే పని యందు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చు ఏర్పడగలవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క వ్యవహారాలలో హామీలకు దూరంగా ఉండవలెను. రావలసిన బాకీలు వసూలు గాక మానసిక ఒత్తిడి పెరుగును. కోపావేశము నియంత్రించుకోవాలి. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేట మంచిది. రుణాలు చేసే విషయంలో జాగ్రత్త అవసరం.
రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు బంధు వర్గం తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.
మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన స్త్రీలు పరిచయాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర బంధువర్గంతో శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
(అష్టమ కుజ సంచారం వలన జాగ్రత్త అవసరం. నాలుగు మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆరాధన లేక దర్శనం చేసుకోవడం ఉత్తమం)
(ఈ మాసం మహాలక్ష్మి అష్టోత్తరం మరియు ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది)
Gemini daily horoscope
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారాలు॥ ఋధ -శుక్ర
రవి ఈ మాసం సంచారం అనుకూలం కాదు. జీవిత భాగస్వామి తో అకారణంగా మనస్పర్థలు. వృధా ప్రయాణాలు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
కుజుడు సంచారం కూడా అనుకూలమైనది కాదు. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు. వ్యవహారాలలో ఆతురత. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
బుధుడు 11-1-24 వరకు బుధ గ్రహ సంచారం బాగుంది తర్వాత అంత అనుకూలమైనది కాదు. అనారోగ్య సమస్యలు రాగలవు. అధికారులు తో మనస్పర్థలు.
శుక్రుడు శుక్ర సంచారం అంత అనుకూలమైనది కాదు. అకారణంగా సంతానం తోటి కలహాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఇంటా బయట ప్రతికూలత వాతావరణ ఏర్పడును. ఆదాయానికి మించి ఖర్చు ఏర్పడగలవు. ఎంతోకొంత రుణం చేయవలసి వస్తుంది. ఉద్యోగం నందు అధికారులు తో సమస్యలు ఏర్పడగలవు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారంలో పెట్టుబడి ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.ఏది ఏమైనా ఈ మాసం ఈ రాశి వారు తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి.11-1-24 తర్వాత బుధ గ్రహ సంచారం వలన పరిస్థితి బాగుంటాయి.
ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఎదురవగలవు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.
పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును.
(ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం ఆదిత్య హృదయం మహాలక్ష్మి అష్టోత్రం పారాయణం చేయుట మంచిది రవి కుజ శుక్ర గ్రహ సంచారము అనుకూలమైనవి కావు.)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
రవి 17-1-24 వరకు సంచారం బాగుంది. ఆర్థికంగా అన్ని విధాలా యోగించును. శారీరక సౌఖ్యం పొందగలరు. తర్వాత రవి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఆ కారణంగా భార్య తోటి కలహాలు రాగలవు.
కుజుడు కుజ గ్రహ సంచారం ఈ మాసం అంతా అనుకూలమే. వ్యవహార విజయం .సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలు లో అధికార వృద్ధి.
బుధుడు 11-1-24 నుంచి అనుకూలమైన సంచారము. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. వ్యవహారాల్లో బుద్ధి కుశలత పెరుగుతుంది.
శుక్రుడు 22-1-24 వరకు అనుకూలమైన సంచారం. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. సంతానానికి ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు లభించును. 22-1-24 తర్వాత అనుకూలమైన సంచారము కాదు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.వచ్చిన అవకాశాన్ని చేజారుస్తారు. చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాలు ప్రతికూలత వాతావరణం. సంతానం తోటి విరోధాలు. అకారణ కోపం. విలాసవంతమైన వస్తువులు వినోదాలకు ఖర్చు ఎక్కువ చేస్తారు. సమాజము నందు ప్రజాభిమానం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. దుష్ట కార్యాలకు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.
ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి శని వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చిరాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
(శని అష్టోత్తరం మరియు మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయడం మంచిది.)
Leo daily rashifal
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ
రవి 17-1-24 సంచారం అనుకూలమైనది కాదు. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు. ఉద్యోగం వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు.
కుజుడు ఈ మాసం అంతా కుజ సంచారం అనుకూలం కాదు. సంతానం వలన ఇబ్బందులు. అనారోగ్య సమస్యలు రాగలవు.
బుధుడు 11-1-24 వరకు అనుకూలమైన సంచారం. తర్వాత అనుకూలమైనది కాదు. అనారోగ్య సమస్యలు రాగలవు. వ్యాపారంలో పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం.
శుక్రుడు ఈ మాసం అంతా శుక్ర సంచారం అనుకూలం.
అనవసరమైన ప్రయాణాలు ఇబ్బందులకు గురవుతారు. ఋణ బాధలు పెరుగుతాయి . గృహమునందు అనేక సమస్యలతో చికాకుగా నుండును. అనేక ఆలోచనలతో మనస్సు నందు ఉద్రేకంగా ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నమ్మినవారు వలన మోసం జరగవచ్చు. భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు.
మఘ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు లో సఖ్యతగా మెలగాలి. భూ సంబంధిత వ్యవహారాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి గురువు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా గలవు. ఉద్యోగాలు లో ఉన్నతమైన అధికారం లభించను.
(ఈ మాసం విష్ణు సహస్రనామం మరియు కుజ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.)
Virgo and Capricorn
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారాలు॥ బుధ- శుక్రవారం
రవి సంచారం ఈ మాసం అనుకూలం కాదు. కుటుంబ సభ్యులతో చికాకులు. బంధుజనుల తో కలహములు.
కుజుడు సంచారం ఈ మాసం అనుకూలం కాదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఉదర సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు.
బుధుడు 11-1-24 నుంచి సంచారము అనుకూలం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.
శుక్రుడు 22-1-24 నుంచి సంచారం అనుకూలం. అభివృద్ధి గూర్చి బంధుమిత్రులతో చర్చిస్తారు. స్థిరాస్తి విషయంలో లో చికాకులు తొలుగును.
కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆభరణాలు కొనుగోలు కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తగును.
హస్త నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు బంధు వర్గం తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.
చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన స్త్రీలు పరిచయాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర బంధువర్గంతో శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
(ఈ మాసం సుబ్రహ్మణ్య ఆరాధన ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది)
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ -గురు- శుక్ర
రవి సంచారం 17-1-24 వరకు అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ఉద్యోగాల్లో అభివృద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆ తర్వాత నుంచి సంచారం అనుకూలంగా లేదు.
కుజుడు ఈ మాసమంతా అనుకూలంగా ఉంటుంది. అప్రయత్నముగా ధనలాభము పొందగలరు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించును.
బుధుడు 11-1-24 వరకు సంచారం అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తి విషయంలో చిక్కులు తొలగును. తర్వాత నుంచి ప్రభుత్వ అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. సంచారం అనుకూలంగా లేదు.
శుక్రుడు 22-1-24 వరకు సంచారం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఆర్థికంగా అనుకూలంగా ఉండును . నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలుగచేస్తుంది. సమాజము నందు మీ విలువకు తగ్గ గౌరవం లభిస్తుంది.
స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఎదురవగలవు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.
విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును.
(ఈ మాసం ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం మంచిది)
Sagittarius
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ-గురు -శుక్ర
రవి 17-1-24 వరకు అనుకూలంగా లేదు. మోసపోయే అవకాశం.ఈ పని చేసిన కలిసి రాక వృధా ప్రయాస మిగులుతాయి. ఆ తర్వాత సంసార సౌఖ్యం లభిస్తుంది.
కుజుడు ఈ మాసం అంతా కుజుడు అనుకూలమైన సంచారము కాదు జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు రాగలవు.
బుధుడు 11-1-24 వరకు అనుకూలంగా లేదు ఏ పని చేసినా కలిసి రాకపోవడం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండాలి 11 నుంచి అనుకూలమైన ఫలితాలు పొందగలరు.
సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం అంతా శుక్ర సంచారం బాగుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గును.సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. చేయు వ్యవహారం నందు విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సమాజంలో అరుదైన గౌరవం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలించును.
అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. దుష్ట కార్యాలకు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.
జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి శని వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చిరాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
(ఈ రాశి వారికి రవి బుధ కుజ గ్రహాలు సంచారం అనుకూలం లేదు. కావున సోమవారములు శివ అభిషేకం చేసుకొనుట మంచిది)
ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు -శుక్ర- మంగళవారం
రవి ఈ మాసం అంతా అనుకూలమైన సంచారము కాదు. శారీరక శ్రమ. మానసిక ఆందోళన పెరుగును. మిత్రులే శత్రులయ్యే అవకాశం.
కుజుడు ఈ మాసమంతా కుజ సంచారం అనుకూలంగా లేదు. ఉద్యోగాలు లో అధికారులు తో విభేదాలు తలెత్తవచ్చు. వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
బుధ గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు. భార్యతో మనస్పర్థలు. ఉద్యోగాలు లో కలహాలు.
శుక్రుడు 22-1-24 వరకు అనుకూలంగా లేదు తర్వాత శుక్రవారం తోటి కొద్దిగా వ్యవహారాలు చక్కబడును.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.ఇంటా బయటా అధికమైన ఒత్తిడిలు పెరుగుతాయి . నిత్యవసరాలకు కొంత ఋణములు చేయవలసి వస్తుంది. అకారణంగా బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. అకాల భోజనం. మనసునందు ఆందోళనగా ఉండటం. జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు రాగలవు.
మూల నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు లో సఖ్యతగా మెలగాలి. భూ సంబంధిత వ్యవహారాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
పూ.షా నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి గురువు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా గలవు. ఉద్యోగాల్లో ఉన్నతమైన అధికారం లభించను.
(ఈ రాశి వారికి నాలుగు గ్రహాల సంచారం బాగా లేదు. కావున సోమవారం ఈశ్వర ఆరాధన ప్రతిరోజు ఆదిత్య హృదయం మహాలక్ష్మి స్తోత్రం పారాయణ చేయడం మంచిది.)
Daily Aquarius Horoscope
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారాలు॥ ఆది -సోమ- శని
రవి సంచారం అనుకూలంగా లేదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. స్థాన చలనం తప్పదు.
కుజుడు ఈ మాసమంతా కుజ సంచారం అనుకూలం లేదు. భూ గృహ క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి.
బుధుడు 11-1-24 వరకు అనుకూలమైన సంచారం. ఈ సంచారం వలన బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందవచ్చు.11 తర్వాత కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు రాగలవు.
శుక్రుడు 22-1-24 వరకు అనుకూలమైన సంచారము. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.చేయి వ్యవహారం నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారము నందు ధనలాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగును. ఉద్యోగాలలో సహోద్యోగులు యొక్క ఆదరణ అభిమానం పొందగలరు.
శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు బంధు వర్గం తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.
ధనిష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన స్త్రీలు పరిచయాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర బంధువర్గంతో శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
(ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది)
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారాలు॥ శని- ఆది -సోమ
రవి 17-1-24 వరకు సంచారం అనుకూలం. ఆ తర్వాత ప్రతికూలం. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు రాగలవు. జీవిత భాగస్వామితో సఖ్యత గా ఉండవలెను.
కుజుడు ఈ మాసమంతా అనుకూలమైన సంచారం. ఉద్యోగాలలో అభివృద్ధి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ప్రయత్నించే పనులు పూర్తి కాగలవు.
బుధుడు సంచారం అనుకూలంగా ఉన్నది. సంతాన అభివృద్ధి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.
శుక్రుడు ఈ మాస మధ్య వరకు అనుకూలం కాదు. మాసం చివరలో అనుకూలమైన ఫలితాలు పొందగలరు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించును. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్త వింటారు.
శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఎదురవగలవు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.
పూ.భా నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును.
(ఈ మాసం ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్రం దుర్గా స్తోత్రం పారాయణ చేయడం మంచిది)
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు
(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు- శుక్ర -మంగళ
రవి ఈ మాసం సంచారం అనుకూలం. ఉద్యోగాలలో అభివృద్ధి పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలించును.
కుజుడు ఈ మాసం అనుకూలం కాదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.
బుధుడు ఈ మాసం మిశ్రమ ఫలితాలను పొందగలరు. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి శుభవార్త వింటారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
శుక్రుడు మాసం ప్రారంభం నుండి అనుకూలమైన సంచారం. మాసం చివరలో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. అన్నదమ్ములు తో అకారణంగా కలహాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఈ మాసం అనుకూలమైన వాతావరణం.కుటుంబ అభివృద్ధి కలుగుతుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.
ఉ.భా నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. దుష్ట కార్యాలకు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.
రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి శని వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చిరాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
(ఈ రాశి వారు ఈ మాసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కుజ స్తోత్రం పారాయణ చేయడం మంచిది)