MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • మాస ఫలాలు: ఓ రాశి వారికి ఈనెలలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

మాస ఫలాలు: ఓ రాశి వారికి ఈనెలలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల  అభివృద్ధి కార్యక్రమాల ఆలోచనలు చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల ఆదరణ పొందగలరు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారములు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తుంది.

9 Min read
Author : ramya Sridhar
Published : Feb 01 2023, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Vijaya Rama krishna

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

314
Zodiac Sign

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ ఆది గురు శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
వ్యాపారమునందు పెట్టుబడులకు తగ్గ ధన లాభం కలుగుతుంది. చేయు పని యందు ఆవేశం తగ్గించుకొని వ్యవహరించవలెను. ఋణ ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు వాహన సౌఖ్యం లభించును. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతాన అభివృద్ధి ఆనందం కలగజేస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు పెద్దవారి యొక్క పరిచయాలు పెంచుకుంటారు. ఉద్యోగం ప్రయత్నాలు చేయువారు కొద్దిపాటి అవాంతరాలు ఏర్పడిన ఉద్యోగ ప్రయత్నం ఫలించును. అభివృద్ధి కార్యక్రమాల ఆలోచనలు చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల ఆదరణ పొందగలరు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారములు క్రమక్రమంగా అభివృద్ధిలోకి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు తీరి ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. గతంలో ప్రారంభించి ఆగిపోయిన పనులు పూర్తి అగును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మాసాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.  వ్యాపారం నందు ధన నష్టం ఏర్ప ఏర్పడగలవు. మనసునందు భయాందోళనకు గురి అవుతారు.. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా స్తోత్రం మరియు గణపతి స్తోత్రము పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

414
Zodiac Sign

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ ఆది -గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తుగజాగ్రత్తలు తీసుకొనవలెను. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో ఆనందంగా గడుపుతారు.  గృహానికి సంబంధిత వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. మంచి వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నాలు ఫలించును. కుటుంబమునందు గొడవలు పేచీలు తీరి ప్రేమపూరిత వాతావరణం ఆప్యాయతలు పెరుగును. సంతానక మూలముగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి.  ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండండి. అకారణంగా కలహాలు ఏర్పడవచ్చు జాగ్రత్త అవసరము. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త వహించాలి. సంతానం గురించి ఎదురుచూసే వారికి శుభవార్త వింటారు. మాసాంతంలో వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. ప్రశాంతమైన జీవనం సాగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం విష్ణు సహస్రనామం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

514
Zodiac Sign

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 5-6-9
వృత్తి వ్యాపారం నందు అనుకోని ధనలాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. గృహమునందు దైవ  సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం లభించును. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం నందు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగమనందు అనుకూలమైన మార్పులు అధికారం వృద్ది కలుగును. ఆరోగ్య విషయంలో  తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. విద్యార్థులు పరీక్ష యందు ఉత్తీర్ణత సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  భూ గృహ క్రయవిక్రయాలు  వాయిదా వేయడం మంచిది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడను. రుణ శత్రువు బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అభివృద్ధి ఆలోచనలు ఫలిస్తాయి. ఈ మాసం ఈ రాశి వారు శివ స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టోత్తరం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

614
Zodiac Sign

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 1-2-4-7
గృహమునందు శుభకార్యాలు జరుగును.ఇంటా బయట గౌరవం తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగము నందు పై అధికారుల తోటి సఖ్యతగా ఉండవలెను.  కీలకమైన సమస్యలను దీర్ఘాలోచన చేసి తగు చర్యలు తీసుకోవాలి . కుటుంబం నందు అనుకోని కలహాలు ఏర్పడవచ్చు.  ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొత్త సమస్యలకు దారితీయును. పుత్రులు తోటి ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. మిత్రుల తోటి విరోధాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చును. సమాజము నందు ప్రజల యొక్క అభిమానాన్ని పొందుతారు. భూ గృహ నిర్మాణ విక్రయాలు కలిసి వస్తాయి. గృహానికి సంబంధిత ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆధార అభిమానాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడను. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి పెరుగును.  ఈరాశి వారికి అష్టమ శని ప్రారంభమైనది కావున శని స్తోత్రం శనికి తైలాభిషేకం చేయటం మంచిది ఈ మాసం ఈ రాశి వారు దుర్గా స్తోత్రం మరియు ఆదిత్య హృదయం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

714
Zodiac Sign

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-4-7
దీర్ఘకాలిక అనారోగ్యం వలన ఇబ్బందులుంటాయి. మీరు నమ్మిన వారి వలన దగా చేయాలని చూస్తారు. సమాజము నందు నిందారోపణలు కలుగును. తలపెట్టిన పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. శారీరక శ్రమ పెరిగి బలహీనత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారము నందు కష్టం ఎక్కువగా నుండును. గృహమునందు పెద్దవారితోటి భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. కోపతాపాలకు దూరంగా ఉండవలెను. వివాహ ప్రయత్నాలు కొద్దిగా కష్టపడిన  వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీలకమైన సమస్యలలో ధైర్యంగా ముందడుగు వేయండి పరిష్కార మార్గాలు దొరుకును. ఉద్యోగమనందు అనుకూలమైన మార్పులు రావచ్చును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. గణపతి స్తోత్రం మరియు ఆదిత్య హృదయం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

814
Zodiac Sign

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
అనుకూలమైన తేదీలు      ॥ 3-5-9
వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల వలన కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి ఏదో ఒక విధంగా ధనం చేకూరుతుంది. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ గౌరవ ప్రతిష్టలు లభించును. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. ఉద్యోగమునందు అధికారుల యొక్క స్నేహ సంబంధాలు బలపడతాయి అనుకూలమైన మార్పులు. కీలకమైన సమస్యలను బుద్ధిబలం తోటి పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును. పోయిన వస్తువులు లభించును. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. చేయపనలలో అభివృద్ధి కనబడుతుంది. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శివ స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

914
Zodiac Sign

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
గృహమునందు శుభకార్యాలు జరుగును. సమాజం నందు ఉన్నతమైన వారి తోటి స్నేహసంబంధాలు బలపడతాయి. నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించెను. రావలసిన పాత బాకీలు వసూలు అగును. బంధు మిత్ర సహాయ సహకారాలు లభించును. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగు వేయవలెను. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. ప్రయాణమునందు తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. కుటుంబ సభ్యుల తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. మనసునందు పలు విధాల ఆలోచనతోటి తికమకగా నుండును. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువుగా ఉంటాయి. విద్యార్థులు పట్టుదలతో చదివిన ఉత్తీర్ణత సాధిస్తారు. దూరపు బంధువుల వలన కొన్ని విషయాలలో ఇబ్బందులకు గురవుతారు. చేయ పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి వాదోపవాదములకు పవాదములకు కలహాలకు దూరంగా ఉండడం మంచిది. కీలకమైన సమస్యలలో పెద్దవారి యొక్క సలహాలు మేరకు ముందుకు వెళ్ళవలెను. మాసాంతంలో ఋణ బాధలు పెరుగును. చేయు వ్యవహారాలయందు ప్రతిబంధకాలు ఏర్పడగలవు. ఈమాసం ఈరాశి వారు ఆదిత్య హృదయం పారాయణం చేయండి శుభ ఫలితాలు 

1014
Zodiac Sign

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి బంధుమిత్రులతో చర్చలు జరుపుతారు. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు రావచ్చును. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. శారీరకంగా మానసికంగా బలపడతారు. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తారు. వ్యవసాయము నందు ధన లాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువులు కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలో పై చేయి సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. సమాజం నందు పెద్దల యొక్క ఆదరణ అభిమానములు పొందగలరు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైనది కావున శని స్తోత్రం శనికి తైలాభిషేకం చేయటం మంచిది ఈ మాసం ఈ రాశి వారు ఆదిత్య హృదయం చేయండి శుభ ఫలితాలు పొందండి.

1114
Zodiac Sign

Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9-12
వివాహాది శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. పూర్తి వ్యాపారాలు యందు ధన లాభం కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు అన్వేషణలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరును. కీలకమైన సమస్యలు పరిష్కారం కొరకు ధైర్యంగా ముందడుగు వేయండి. నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి అగును. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. బంధుమిత్ర లతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభించును. కొన్ని విషయాలలో పట్టుదల వదిలి వ్యవహరించవలెను. ఉద్యోగులకు అధికార వృద్ధి కలుగును. విందు వినోదాలలో పాల్గొంటారు. మాసాంతంలో ఇతరులతోటి కలహాలు ఏర్పడగలవు. ఖర్చు యందు ఆచితూచి వ్యవహరించవలెను. ఈ మాసం ఏ రాశి వారు దుర్గా స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

1214
Zodiac Sign

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
సమాజము నందు మీ మాటలతోటి అందరినీ
ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఆరోగ్యం చేకూరి ప్రశాంతి లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు ఆటంకాలు ఏర్పడను. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు. ఉద్యోగమునందు ఒత్తిడిలో ఉన్న అధికమించి ఉత్సాహంగా చేస్తారు. తలపెట్టిన పనులలో  ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తి చేస్తారు. కీలకమైన సమస్యలు తీరి ప్రశాంతత లభించును. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. గతంలో రావలసిన బాకీలు వసూలు అగును. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మాసాంతంలో అనవసరపు ఖర్చులు పెరుగును. నమ్మినవారు వలన అపకారాలు జరగవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది శనివారములు అలాగే శని తైలాభిషేకము చేయుట మంచిది.ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం మరియు శని స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

1314
Zodiac Sign

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
వివాహాది శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండను. తలపెట్టిన పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది. సమస్యల యందు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరుల యొక్క విషయంలో హామీలకు దూరంగా ఉండవలెను. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. చేయ పని యందు పనిముట్లు తో జాగ్రత్త అవసరం. చేయ వ్యవహారాల యందు కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించవలెను. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యం వలన ఇబ్బందులుంటాయి. వ్యాపారం నందు పెద్దల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టవలెను. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది కావున శనివారములు చేయుట మరియు శనికి తైలాభిషేకం చేయుట మంచిది ఈ రాశి వారు ఈమాసం శివ స్తోత్రం మరియు శని స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

1414
Zodiac Sign

Zodiac Sign


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 6-7-9
సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగుతుంది. గృహమునందు శుభ కార్యక్రమాలు జరుగును. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. శత్రువులపై విజయంసాధిస్తారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చుయందు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను ప్రయత్నించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. మాసాంతంలో గృహమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. శారీరక శ్రమ పెరిగి పెరుగుతుంది. ఇతరులతోటి కలహాలకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనది కావున శని స్తోత్రం శనికి తైలాభిషేకం చేయటం మంచిది ఈ రాశి వారు ఈ మాసం విష్ణు సహస్రనామం మరియు ఆదిత్య హృదయం పారాయణా చేయండి శుభ ఫలితాలు పొందండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Recommended image2
Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image3
Saturn Transit: వక్రగతిని వీడి మార్గంలోకి శని.. డిసెంబర్ 11 తర్వాత ఈ 6 రాశులకు అదృష్టం డబుల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved