Monthly Horoscope: ఓ రాశివారికి ఈ నెల డబ్బే డబ్బు..!
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో చక్కటి ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార వ్యవహార ప్రారంభాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో వ్యాపార ధన సంబంధ వ్యవహారాలు సామాన్యం. చేపట్టిన పనులలో బాధిస్తున్న స్తబ్ధత కొంత తొలగును. ఈ మాసంలో మాతృ సంబంధ బంధు వర్గంలో ఒకరికి మంచిది కాదు. ద్వితీయ వారం ప్రారంభంలో భూ సంబంధ లేదా గృహ సంబంధ స్తిరాస్థి విషయాలలో లాభం ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలోని వారికి మంచి అనుకూల స్థితి. ఈ మాసంలో మీ జీతంలో పెరుగుదల కొరకు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నాలు చేయవచ్చు. మాస ద్వితియార్ధంలో వ్యాపార వర్గం వారికి ఆశించిన లాభాలు. ఈ మాసంలో 6,12,19 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో ఆర్ధిక పరమైన విషయాలలో కన్నా కీర్తి ప్రతిష్టల విషయంలో అధిక అనుకూలత ఉన్నది. కొంత శత్రు వృద్ధి కి అవకాశం ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో తగాదాల వలన లేదా కోర్టుకేసులు లేదా పోలిసుల జోక్యం వలన చికాకులు ఎదురగును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అవసరాలకు సరిపడు ధనాదాయం మాత్రం పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మిత్రుల తోడ్పాటు లభించి అభివృద్ధికర ఫలితాలు ఏర్పడతాయి. 18 వ తేది తదుపరి దూర ప్రాంత ప్రయానమూలు చేయుట వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుట లేదా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల వలన ధనం వ్యయం అగుట జరుగును. స్త్రీలు అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశములను నష్టపోవుదురు. చివరి వారంలో వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం, సంతాన ప్రయత్నాలు ఫలప్రదం అగుట, స్వతంత్ర విద్య వలన ధనం ఆర్జించువారికి సన్మానములు వంటి మంచి ఫలితాలు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. ధర్మ కార్యములకు , కుల సంబంధ కార్యక్రమాలకు ధనం వినియోగిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభములు ఉన్నవి. వ్యాపార రంగంలోని వారికి ముఖ్యంగా స్థిరాస్థి సంబంధ క్రయవిక్రయాలు, వ్యవసాయ సంబంధ వ్యాపారములు చేయువారికి చక్కటి లాభములు ఉన్నవి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం నష్టపరుచును. తృతీయ వారంలో పాత మిత్రులతో కలయిక వలన కాలం ఉత్సాహంగా గడచును. 21 వ తేదీ తదుపరి ఖర్చులు, శారీరక శ్రమ అధికం అగును. ఈ మాసంలో 24,25,26 తేదీలు అంత అనుకూలమైనవి కావు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో వ్యవహారములు అనుకూలంగా నడచును. ధనాదాయం సామాన్యం. వైద్య రంగంలో జీవించు వారు ఆశించిన విజయాలు పొందుదురు. మీ రంగాలలో చక్కటి గుర్తింపు ఏర్పడును. నూతన స్నేహ వర్గాలు ఏర్పడును. సామజిక సంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్టితులు ఎదురగును. ద్వితీయ తృతీయ వారాలలో చిన్నపాటి అనారోగ్య సమస్య చికాకు పరచును. విదేశీ జీవన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు, గృహ ఆరంభ సంబంధ ప్రయత్నాలు శుభకరం. నిరుద్యోగులకు మాత్రం ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో కుటుంబంలో మీ మాట మీద నమ్మకం పెరుగు సంఘటనలు జరుగును. కుటుంబ వ్యవహారములందు విజయం ప్రాప్తించును. ధనాదాయం బాగుండును. విద్యార్ధులకు కొద్దిపాటి నిరాశ ఎదురగును. పట్టుదల అవసరం. పెద్ద వయస్షు వారికి వెన్నుపూస లేదా మూత్ర సంబంధ సమస్యల వలన శస్త్ర చికిత్సకు దారి తీయవచ్చు. ఈ మాసం 11 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య కుటుంబ పరమైన వ్యయం అధికంగా ఏర్పడును. ప్రయాణాలు వ్యయప్రయాసలతో పూర్తీ చేయగలుగుతారు. తృతీయ వారం నుండి శ్రీ లలితా దేవిని ఆరాధన చేయుట ఆరోగ్య మరియు ఆర్ధిక విషయాలలో సమస్యలను తగ్గించును. నూతన వ్యాపార ఆరంభ విషయాలలో ఆటంకములు వున్నవి. చివరి వారంలో 24 నుండి 27 మధ్యకాలం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగచేయును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. నూతనంగా ప్రారంభించిన పనులలో అనవసర సమస్యలు ఎదురగును. మానసికంగా కూడా చికాకులు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో అధికమైన పని వలన ఒత్తిడులు. నిరుద్యోగ యువత ఆలోచనలలో అస్థిరిత - అభద్రతా భావం కొనసాగుతాయి. వేసుకున్న ప్రణాళికలలో ఆఖస్మిక మార్పులు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త మరియు సమయ పాలన అవసరం. కర్షక వర్గానికి శ్రమాధిక ఫలం లభించును. 22 వ తేదీ తదుపరి పరిస్థితులలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. పని ప్రదేశంలో మీ చురుకైన వ్యక్తిత్వం వలన చక్కటి గుర్తింపు పొందుతారు. ఈ మాసంలో 8,9,13,18 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ప్రారంభించిన నూతన వ్యవహారములు, ప్రయత్నములు సానుకూలంగా ముగియును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. గత కాలంలో ఆపివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యుగుల, విద్యార్ధుల కోరికలు నెరవేరును. అవసరానికి ఆశించిన ఆర్ధిక సర్దుబాటు జరుగును. కుటుంబంలో సంతోషకర సమయాలు ఏర్పడతాయి. 18 నుండి 22 వ తేదీ మధ్యకాలంలో చక్కటి వాహన సౌఖ్యం ఉన్నది. చివరి వారంలో స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడును. ఈ మాసంలో 4 నుండి 16 వ తేదీ మధ్య అన్నిరకముల ప్రయత్నాలు కలసివచ్చు సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో సంతాన సంబంద ఆనందం లభిస్తుంది. వ్యక్తిగత జీవనంలో చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం వలన విషయ పరిజ్ఞానం పెంచుకొంటారు. పుత్రికా సంతతి కలిగిన వారికి నూతన బాధ్యతలు ఏర్పడతాయి. చివరి వారంలో అధిక శారీరక శ్రమ ఎదురవుతుంది. పేర్కొనదగిన ఇతర ప్రధాన ఫలితాలు ఏమియూ ఈ మాసంలో లేవు. సాధారణ యోగంతో జీవనం కొనసాగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. గౌరవ ప్రధమైన జీవనం కొనసాగిస్తారు. నూతన ఆదాయ మార్గాల కొరకు ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం అనువైనది. ద్వితీయ వారంలో కుటుంబ పరమైన కారణముల వలన ఆఖస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయనములందు చికాకులు ఎదురవుతాయి. తృతీయ వారంలో ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మానసిక శ్రమ తగ్గుతుంది. ఈ మాసం చివరి వారంలో అనగా 22 నుండి 29 తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవన సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో చక్కటి ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార వ్యవహార ప్రారంభాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో ఎత్తైన ప్రాంతాలు లేదా కొండ మార్గాలలో సంచరించునపుడు జాగ్రత్తగా ఉండవలెను. విదేశే ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఎదురగును. ప్రభుత్వ ఉన్నత అధికారులకు చక్కటి కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి జీవనంలో నూతన మార్పులు సంభవిస్తాయి. ఆధునిక పరికరాలను సమకుర్చుకుంటారు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆశించిన సహకారం పొందగలుగుతారు. మీ కృతజ్ఞతా భావమును అనేక రకాలుగా తెలియచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మాసంలో చివరి వారంలో 23 నుండి 26 వ తేదీ వరకు తలపెట్టిన పనులు ఆటంకాలు ఎదుర్కొంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో అనుకూల పరిస్థితులు ఉన్నవి. ధనాదాయం బాగుండును. ధనార్జాన పెరగడం వలన ఆర్ధిక పరంగా ధైర్యం పెరుగుతుంది. తలపెట్టిన పనులు సజావుగా కొనసాగును. మానసిక అశాంతి తొలగును. కుటుంబంలో నూతన బంధుత్వాలు ఏర్పడి కుటుంబ బలాన్ని పెంచుతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. తగవుల రాజీ ప్రయత్నాలలో ప్రతిష్టంభన తొలగుతుంది. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ మాసంలో 21,22,23 తేదీలలో కాలం దుర్వినియోగం అవుతుంది. వృధా శ్రమ ఎదుర్కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో ఆశాజనకంగా ఉండును. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధ ఆదాయం, విదేశీ ప్రయాణాలకు అనువైన కాలం. వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు ఎదురగును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఆశించిన స్థాన చలనం పొందుతారు. నూతన బాద్యతలు లేదా పదవులు పొందుటకు సూచనలు ఉన్నవి. పనిచేయు ప్రదేశంలో శ్రమకు తగిన గుర్తింపు లభించును. నిర్మలమగు మీ దూరదృష్టి చక్కటి పేరు ప్రఖ్యాతలు కలిగినవారిగా చేస్తుంది. ఎదుటి వారి మనోభావాలు సులువుగా గ్రహించగలుగుతారు. నూతన వ్యక్తులను మిత్రులుగా చేసుకొనుటకు తీవ్రంగా అలోచించేదురు. ఈ మాసంలో 5.7,11,,27 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య