Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర మీన రాశి ఫలితాలు
శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన మీనరాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు మీనరాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఆదాయం:-11
వ్యయం:-5
రాజపూజ్యం:-2
అవమానం:-4
గురుడు 1-5-24 వరకు ధన స్థానంలో తామ్ర మూర్తి గా సంచరించి .తదుపరి సంవత్సరాంతం తృతీయ స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.
శని ఈ సంవత్సరమంతా వ్యయ స్థానంలో రజత మూర్తి గా సంచారం.
రాహువు ఈ సంవత్సరమంతా జన్మ రాశి లో తామ్ర మూర్తి గా సంచారం.
కేతువు ఈ సంవత్సరమంతా కళత్ర స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.
(ఈ రాశి వారికి ఏలినాటి శని)
మే నుంచి గురుడు తృతీయ రాశిలో సంచారం అనుకూలం కాదు.ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొన్ని రకాలు అడ్డంగులు వలన వ్యాపార వ్యవహారాలలో అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు రాగలవు.పనుల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. పనులు లో వ్యవహారాలలో అవాంతరాల ఏర్పడతాయి. మధ్యవర్తిత్వానికి మరియు హామీలు విషయంలో జాగ్రత్త అవసరం.ఆశించిన ఫలితాలు పొందడం కష్టతరం గా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు తగిన మార్గాలు అన్వేషణ చేయడం మంచిది.వైవాహిక జీవితంలో కూడా అన్యోన్యత తగ్గి గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణ చేసుకోవడం మంచిది.విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం. బంధువర్గము తో వ్యతిరేకతలు గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలత తక్కువ.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి సరైన ఆలోచన సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పు సహనంతో పనులు పూర్తి కాగలవు.ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
శని సంచారం వల్ల కుటుంబంలో గొడవలు చికాకులు గా ఉంటుంది.వాదనలకు వివాదాలకు దూరంగా వాదనలకు వివాదాలకు దూరంగా ఉండాలి.
రాహు కేతు సంచారం అనుకూలమైనది కాదు. ఈ సంచారం వలన ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.శారీరక పటుత్వం తగ్గుతుంది.అన్ని విషయాలు లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నించడం మంచిది.కొన్ని విషయాలు లో మోసపోవడం నష్టపోవడం జరుగును. అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభించును. ఖర్చులు నీళ్లవలె ఖర్చు అవును.ధనం నిలబడటం కష్టంగా ఉంటుంది.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు.
పూ.భాద్ర నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.
శని 3-10-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 04-12-24 నుంచి పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు జన్మతారలో సంచారం.
రాహువు 7-7-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం సంపత్తార లో సంచారం.
కేతువు 11-11-24 వరకు నైధనతార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సాధన తార లో సంచారం
ఉ.భాద్ర నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.
శని 3-10-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు పరమ మిత్ర తార లో సంచారం.
రాహువు 7-7-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం జన్మతారలో సంచారం.
కేతువు 11-11-24 వరకు సాధన తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం ప్రత్యక్తార లో సంచారం
రేవతి నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు క్షేమ తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి ప్రత్యక్తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి సాధనతార లో సంచారం.
శని 3-10-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు మిత్ర తార లో సంచారం.
రాహువు 7-7-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి సంవత్సరాంతం వరకు పరమ మిత్ర తార లో సంచారం
కేతువు 11-11-24 వరకు ప్రత్యక్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం క్షేమతార లో సంచారం
(ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని రాహు కేతు సంచారం అనుకూలంగా లేనందున. ప్రతి నెల మాస శివరాత్రి కి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ తరచు సుందరకాండ పారాయణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందగలరు.)
Image: Pexels
ఏప్రియల్
ఉద్యోగస్తులు పై అధికారులతో సఖ్యతగా మెలగాలి.అభివృద్ధి ప్రయత్నం కొనసాగిస్తారు.మాసం చివరలో అధికారుల నుంచి ఒత్తిడి లు ఎదుర్కొంటారు. ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొనుటకు తీవ్రంగా కృషి చేస్తారు.ఏ విషయంలోనైనా ఇచ్చి పుచ్చుకోవడం లో ఉత్సాహంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల గృహంలో జరిగే శుభకార్యాలలో కీలక పాత్ర పోషిస్తారు.ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి.దూర ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.
మే
అన్ని విషయాల్లోనూ దీర్ఘమైన ఆలోచన పెట్టు కొనుట మంచిది కాదు. వ్యాపార లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను. రావలసిన బాకీలు వసూలు కావడం ఆలస్యం అవును. అన్ని రంగాల వారికి ఈ మాసం ప్రతికూలంగా ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాలలో పని భారం ఒత్తిడి పెరిగి ఉత్సాహంగా ఉండలేక పోతారు. విద్యార్థులు ఊహాగానాలతో కాలాన్ని దుర్వినియోగం పరుచుట మంచిది కాదు.అనుకోని వ్యక్తులు తో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
జూన్
ఈ మాసం గ్రహ సంచారం సానుకూలంగా లేదు. ఇతరులతో వాదన విషయంలో తగ్గి ఉండవలెను.ఆర్థికపరమైన సర్ధుబాటు అంతంతమాత్రంగానే ఉండును.కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పొందలేక పోతారు.మధ్యవర్తిత్వం చేయు వ్యక్తి నుండి మోసానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం.ముఖ్యమైన విషయాలు లో ధైర్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది.స్థిరాస్తి విషయంలో విభేదాలు తలెత్తుతాయి.
జూలై
ఈనెల గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు ఇచ్చును.సాధ్యం కాని హామీలు ఇచ్చుట మంచిది కాదు.ఆర్థికపరమైన ఆటుపోట్లను సమర్థించుకుంటారు. ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగే అవకాశం ఉన్నది. సంఘంలో కొన్ని అపవాదం పడే అవకాశం. మాసాంతంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.విద్యార్థులు అనుకున్న విధంగా కళాశాల ప్రవేశాలు ఉంటాయి.ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మెప్పు పొందారు.వ్యాపార విషయాలు లో సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది.
ఆగస్టు
ఈ నెల గ్రహ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సందడిగా గడుపుతారు.నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు చేకూరుతాయి.ఆదాయం కొంత తగ్గినప్పటికీ అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.సమాజంలో అపనిందలు బారిన పడే అవకాశం ఉన్నది.ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం చేయుట మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సెప్టెంబర్
పూర్తి చేయవలసిన పనులు అతి కష్టం మీద అధిక శ్రమ తో పూర్తి చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉండటం వలన నూతన పెట్టుబడులు పెట్టలేక పోతారు.స్త్రీ మూలకంగా కలిసి వస్తుంది. చిక్కుల నుండి బయటపడతారు. చిన్నపాటి ఉపాధి అవకాశాలు ఏర్పరచుకుంటారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఊహించని ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధుమిత్ర వర్గం నుంచి మంచి చేకూరుతుంది.దైవ సంబంధిత కార్యక్రమాలు కు ప్రాధాన్యత ఇస్తారు.
అక్టోబర్
ఈనెల గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. శారీరక మానసిక ఇబ్బందులు ను అధిగమిస్తారు.ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి.డబ్బులు చెల్లించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.ఇతరుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగం సజావుగా ఉండును.రుణము కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన పరిచయస్తుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగే అవకాశం.
నవంబర్
మొదలుపెట్టిన పనులలో కొన్ని మాత్రమే పూర్తి చేయగలుగుతారు.నిరుద్యోగ స్తులకు కొంత కష్టంగా ఉంటుంది. కొంతవరకు మనసుకు నచ్చిన విధంగా ఉండగలుగుతారు. మీ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉన్నది.విందు వినోదాలు లో ఆనందంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాలు లో నిదానమే ప్రధానము గా సాగాలి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండాలి.ఇతరుల తీరు నచ్చకపోయినా సఖ్యత గానే మెలగాలి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
డిసెంబర్
పట్టుదలతో కార్యాలను సిద్ధింప చేసుకోగలుగుతారు.వ్యక్తిగతమైన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు వల్ల లాభాలు చేకూరుతాయి.పనుల యందు అలసత్వం పనికిరాదు.రాజకీయ నాయకుల నుంచి చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.మానసికంగా ఒత్తిడి బారిన పడకుండా చూసుకోవాలి. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉండదు.స్థిరాస్తి విషయంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి.
జనవరి
మీ యొక్క వ్యతిరేకులను సమర్థవంతంగా ఎదుర్కో గలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. భాగస్వామిక వ్యాపారాల విషయంలో పెట్టుబడులు అధికంగా పెడతారు. ఎక్కువ శ్రమ చూడగలిగితే నే ప్రయోజనం ఉంటుంది.కాలాతీతంగా ఆహారమును తీసుకోవలసి వస్తుంది.పాత బాకీలు చెల్లించ గలుగుతారు.అందమైన జీవితం కొనసాగుతూ ఉన్నా మధ్యలో చిన్నపాటి విరోధాలు రాగలవు.
ఫిబ్రవరి
సోదర మరియు స్నేహితులు అన్ని విషయాల్లోనూ మూల స్తంభాలు గా నిలబడతారు.వ్యాపారస్తులు అధిక ఆదాయాన్ని పొందుతారు.సృజనాత్మక శక్తి పెరుగుతుంది.అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు లభిస్తాయి.శుభకార్యాల నిమిత్తమై ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు.భాగస్వాముల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉన్నది. రాజకీయపరమైన వ్యవహారాలలో లబ్ధి పొందుతారు.నిరుద్యోగులకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.తీర్థయాత్రలు చేస్తారు.
మార్చి
నిరుద్యోగులకు అనుకూలమైన సమయం.అనవసరపు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగ వ్యాపారాల్లో కృషి చేయడం వల్ల వృద్ధి కనిపిస్తుంది. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.ఇతరులతో అనవసరపు వాదనలు కు దూరంగా ఉండాలి.ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.నూతన వస్తు వాహన కొనుగోలు విషయంలో ఆర్థికంగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఊహించిన సమస్యలు ఎదురవుతాయి.