Astrology: మార్చిలో ఈ రాశుల వారికి చుక్కలే! శని ప్రభావం మామూలుగా ఉండదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు రాశులపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తాయి. శని ప్రభావంతో మార్చిలో కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవట. ఇంతకీ ఆ రాశులెంటో వారిపై శని ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుల వల్ల అన్ని రాశుల మీద ఎఫెక్ట్ పడుతుంది. మార్చి నెలలో కొన్ని రాశుల మీద శని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో వారు చాలామంది సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. శని ప్రభావం ఏ రాశులవారి మీద ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి
గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి మంచి జరుగుతుంది. మరికొన్ని రాశులవారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. మార్చిలో శని ప్రభావం కుంభరాశిపై ఉండటం వల్ల వారికి చెడు జరిగే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కుంభ రాశికి చెందిన వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మకర రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చిలో మకర రాశి వాళ్ళపై శని ప్రభావం ఉంటుంది. శని వల్ల వారి జీవితాల్లో ఒడుదుడుకులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారు కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వాళ్ళు శని ప్రభావానికి గురవుతారు. ఆరోగ్యం, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచీతూచీ అడుగు వేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వాళ్ళు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం వల్ల ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.