ఇక్కడ పుట్టుమచ్చలున్నవారు బాగా డబ్బు సంపాదిస్తారు
పుట్టుమచ్చలు మన శరీరంలో చాలా భాగాల్లో ఉంటాయి. సముద్ర శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి శరీరంలో ఉన్న పుట్టుమచ్చలు ఒక వ్యక్తికి ఎన్నో విధాలుగా శుభ లేదా అశుభ సంకేతాలను ఇస్తాయి. శరీరంలోని ఏ భాగంలో ఉన్న పుట్టుమచ్చలు అదృష్టంగా పరిగణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
moles
మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక భాగంలో పుట్టుమచ్చలు ఉంటాయి. కొందరికైతే శరీరం నిండా పుట్టుమచ్చలు ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం.. ఈ పుట్టుమచ్చలు మనకు ఎన్నో సంకేతాలను ఇస్తాయి. అంటే కొన్ని భాగాల్లో ఉన్న పుట్టుమచ్చలు అశుభ సంకేతాలను ఇస్తే.. మరికొన్ని శుభంగా పరిగణించబడతాయి. మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను చూసి మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చంటారు జ్యోతిష్యులు. మరి శుభప్రదంగా భావించే పుట్టుమచ్చలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
moles
నుదిటిమీద పుట్టుమచ్చ
కొంతమందికి నుదిటి మీద పుట్టుమచ్చలు ఉంటాయి. ఒక వ్యక్తికి నుదిటి మీద లేదా నుదురు కుడి వైపున నల్ల పుట్టుమచ్చ ఉంటే ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు రావు. అంతేకాదు వీల్లు తమ జీవితంలో ఎంతో డబ్బును సంపాదిస్తారు.
డబ్బుకు కొదవఉండదు
నాభి పైన లేదా దాని చుట్టూ పుట్టుమచ్చ ఉంటే కూడా మంచిదే. ఇది ఆ వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తుందని సముద్ర శాస్త్రంలో నమ్ముతారు. ఈ భాగంలో పుట్టుమచ్చలున్న వారికి జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకు కొరత ఉండదు.
ఈ పుట్టుమచ్చ ఆనందం, శ్రేయస్సుకు సంకేతం
ముక్కుకు కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. ఇలాంటి వ్యక్తి తన జీవితంలో ఎన్నో ధన ప్రయోజనాలను పొందుతాడు. అలాగే ఈ వ్యక్తులను చాలా ఖరీదైనవారిగా భావిస్తారు. అలాగు ఒక వ్యక్తి కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే వారికి ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. వీరి జీవితంలో వీటికి లోటు ఉండదు.
ఈ పుట్టుమచ్చలు అదృష్టవంతులు
ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. అలాగే ఒక వ్యక్తి గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉంటే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యక్తులకు కూడా ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు.