మీ రాశి ప్రకారం.. ఏ సువాసన వెదజల్లే క్యాండిల్స్ ఎంచుకోవాలో తెలుసా..?
చాలా రకాల సువాసనలు వెదజల్లేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఆ క్యాండిల్స్ ని.. మన రాశి చక్రం ప్రకారం.. ఎలాంటి సువాసనలు వెదజల్లేవి ఎంచుకుంటే.. మన జీవితం మరింత ఆనందంగా మారుతుందో చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో చూసేద్దామా..
దీపావళి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దీపాలే. ఈ దీపాల వెలుగులు.. మన జీవితంలోనూ అంతే వెలుగులు నింపుతాయని అందరూ నమ్ముతుంటారు. అయితే.. ఈ రోజుల్లో ప్రమిదల్లో నూనె పోసి.. దీపాలు వెలిగించేవారు తగ్గిపోయారు.. మార్కెట్లో దొరికే క్యాండిల్స్ వాడేస్తున్నారు. వాటిల్లోనూ చాలా రకాల సువాసనలు వెదజల్లేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఆ క్యాండిల్స్ ని.. మన రాశి చక్రం ప్రకారం.. ఎలాంటి సువాసనలు వెదజల్లేవి ఎంచుకుంటే.. మన జీవితం మరింత ఆనందంగా మారుతుందో చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో చూసేద్దామా..
1.మేష రాశి..
ఈ రాశివారి అగ్నికి సంకేతం. వీరికి స్వంతంత్రంగా ఉండటానికి ఇష్టపడారు. బయట ప్రపంచానికి భయంకరంగా కనపడతారు. కానీ.. వీరు ఇతరులకు వెచ్చదనాన్ని పంచుతుంటారు. కాబట్టి.. ఈ రాశివారు దాల్చిన చెక్క, వెనీలా, బ్లాక్ టీ వంటి సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ ఎంచుకోవాలి. వీటిని ఈ దీపావలి రోజున ఇంట్లో వెలిగించుకోవడం మంచిది.
2.వృషభ రాశి..
ఈ రాశివారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. చాలా మొండిగా కూడా ఉంటారు. కాబట్టి.. వీరు ఈ దీపావళికి కుంకుమపువ్వు సువాసన వెదజల్లే.. క్యాండిల్స్ వెలిగించాలి. వారికి విజయం దక్కుతుంది.
3.మిథున రాశి..
మిథున రాశివారు సహజత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి.. వీరికి గులాబీ పువ్వు వాసన వెదజల్లే.. క్యాండిల్స్ ఎంచుకోవాలి. వీటిని ఎంచుకోవడం వల్ల వారిలో సృజనాత్మకత మరింత వెలుగులోకి వస్తుందట.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. అంతేకాకుండా అందరితోనూ నమ్మకంగా ఉంటారు. కాబట్టి.. వీరు నిమ్మకాయ,లావెండర్ సువాసన వెదజల్లే క్యాండిల్స్ ఎంచుుకోవాలి.
5.సింహ రాశి..
ఈ రాశివారు చాలా ధైర్యం గా ఉంటారు. వీరు అంటెన్షన్ సీకర్స్. అందరూ తమను గుర్తించాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు.. సిట్రస్ ఫ్రూట్స్, ట్రాపికల్ ఫ్రూట్స్ కాంబినేషన్ ఎంచుుకోవచ్చు.
6.కన్య రాశి..
కన్య రాశివారికి వ్యక్తిగత శుభ్రత కాస్త ఎక్కువ. తాము ఉండే అపార్ట్మెంట్ ని చాలా నీట్ గా ఉంచాలని అనుకుంటారు. వీరు.. మంచి సువాసన వెదజల్లే ఏ క్యాండిల్ అయినా ఎంచుకోవచ్చు.
7.తుల రాశి..
ఈ రాశివారు చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. ఈ రాశివారు కలబంద, జునిపెర్ నీరు మిశ్రమంగా ఉండే క్యాండిల్స్ ఎంచుకోవాలి. లేదంటే.. స్వచ్ఛమైన మట్టివాసన వెదజల్లే క్యాండిల్స్ కూడా ఎంచుకోవచ్చు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు కొంచెం తేడాగా ప్రవర్తిస్తారు. మీరు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. కానీ కొన్ని సార్లు చాలా ప్రేమగా కూడా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఆరెంజ్, నిమ్మ లాంటి ఫ్లేవర్స్ క్యాండిల్స్ ఎంచుకోవచ్చు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు చాలా ఆశావాది, న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు జాజికాయ, కొత్తిమీర, లవంగం, నారింజ కాంబినేషన్ లోని క్యాండిల్స్ ఎంచుకోవచ్చు.
10.మకర రాశి,.
ఈ రాశివారు చాలా ఎక్కువగా కష్టపడతారు. ఎక్కువగా పని చేస్తుంటారు. అయితే.. మొండిగా కూడా ఉంటారు. ఈ రాశివారు పెప్పర్, యూకలిప్టస్, లావెండర్ వంటి సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ ఎంచుకోవాలి.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు లిల్లీ, దాల్చిన చెక్క, వెనీలా వంటి సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ ఎంచుకోవాలి. వీటి సువాసనలు వీరిలో ధైర్యం నింపే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
12.మీన రాశి..
మీన రాశివారు చాలా శక్తివంతంగా ఉంటారు. వీరు కన్న కలలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. కాబట్టి.. ఈ రాశివారు.. ముత్యాల సువాసన కలిగే క్యాండిల్స్ ని ఎంచుకోవాలి.