ఇంట్లో ఏ దిక్కున నలుపు రంగు వస్తువులు ఉంచాలో తెలుసా?
నలుపు రంగు అల్మారా, బ్లాక్ కలర్ టేబుల్ ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అయితే.. వాటిని పర్టిక్యులర్ గా ఒక దిక్కున మాత్రమే ఉంచాలట.
వాస్తు శాస్త్రంలో మన ఇంటికి సంబంధించిన చాలా విషయాలను వివరించారు. వాస్తు ప్రకారం.. ఇల్లు కట్టుకోగానే సరిపోదు. దానికి తగినట్లుగానే ఇంట్లోని వస్తువులు కూడా ఉంచుకోవాలట. ఏ దిక్కున ఏ వస్తువు ఉంచితే ఇంటికి మంచి జరుగుతుందో కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు శుభం జరుగుతుంది. దీనిలో భాగంగానే.. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నలుపు రంగు వస్తువులు ఉంచుకోకూడదట.
నలుపును ఎంత అశుభం అని చెప్పినా.. ఏదో ఒక వస్తు రూపంలో ఇంట్లో నలుపు వస్తువులు ఉంటాయి. నలుపు రంగు అల్మారా, బ్లాక్ కలర్ టేబుల్ ఇలా ఏదో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అయితే.. వాటిని పర్టిక్యులర్ గా ఒక దిక్కున మాత్రమే ఉంచాలట.
vastu tips
నలుపు రంగు తాళం, నలుపు చేతి గడియారం, నల్లటి సోఫా, నల్లటి కర్టెన్లు, నల్లటి గుడి, నల్లని పొయ్యి మొదలైనవి ఇంటికి ఉత్తరం వైపు ఉంచాలి.ఉత్తర దిశను కుబేరుడి దిక్కుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో ఉన్న ఏదైనా నల్లని వస్తువును ఉత్తర దిశలో ఉంచినట్లయితే, అది ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. సంపద మార్గాలు కూడా పెరుగుతాయి.
అలాగే, ఈ దిశలో ఉంచిన నలుపు వస్తువు నుంచి నెగిటివిటీ రాదు. రాహువు చెడు ప్రభావం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. రాహువు శుభ ఫలితాలను తెస్తుంది. నలుపు రంగు వస్తువులను ఉత్తర దిశలో ఉంచడం వలన భయం కూడా తొలగిపోతుంది. ప్రతికూల శక్తి బారిన పడకుండా కూడా రక్షించవచ్చు. ఉత్తర దిశ విజయాన్ని సూచిస్తుంది, అందుకే నలుపు రంగు వస్తువులను ఈ దిశలో ఉంచడం వల్ల విజయానికి ఆటంకం కలిగించే లోపాలు కూడా తొలగిపోతాయి.
నలుపు రంగు మంగళసూత్రాన్ని అంటే నల్లుపూసలను కూడా ఇంట్లో ఉత్తరం వైపు ఉంచితే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. పిల్లల వైపు నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితంలో మాధుర్యం ఉంటుంది. అత్తమామలతో మంచి సంబంధాలు ఉంటాయి. మీ పాత నల్లపూసలు డ్యామేజ్ వస్తే.. వాటిని మార్చకుండా.. ఇంట్లో ఎరుపురంగు వస్త్రంలో ఉంచి.. ఉత్తరం దిక్కున ఉంచుకుంటే... ఇంట్లో శుభాలు జరుగుతాయి.