12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలోకి గురువు.. ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం త్వరలో తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో రెట్టింపు లాభాలు రానున్నాయి. ఆ రాశులేంటో చూద్దామా..

గురు గ్రహ సంచారం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం అత్యంత శుభప్రదమైనది. జ్ఞానం, సంపద, గౌరవం, అదృష్టానికి అధిపతి గురువు. ఈ గ్రహం దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ అక్టోబర్ లో తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ఈ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వనుంది. ఆ రాశులేంటో వారికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
కర్కాటక రాశి
12 ఏళ్ల తర్వాత గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మంచి ఫలితాలుంటాయి. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. పూర్వీకుల ఆస్తి చేతికి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది.
తుల రాశి
తుల రాశి వారికి గురు సంచారం మంచి ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. సొంత వ్యాపారం చేసేవారికి రెట్టింపు లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలం. ఈ రాశివారికి దీపావళి తర్వాత ఊహించని ధనలాభం కలుగుతుంది. విలువైన బహుమతులు పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి గురు గ్రహ మార్పు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొన్ని ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఇల్లు, భూమి కొనే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి.