Venus transit: మరో మూడు రోజుల తర్వాత 3 రాశుల వారికి జాక్‌పాట్, శుక్రుడితో ధనవర్షం
సెప్టెంబర్ 25 నుంచి మూడు రాశుల (Zodiac signs) వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. ఆరోజు ఉదయం 5:16 గంటలకు శుక్రుడి సంచారం (Venus Transit) వల్ల ఒక శక్తివంతమైన యోగం అర్థకేంద్ర యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది.

శుక్రుడి సంచారం
శరన్నవరాత్రుల వేళ రాక్షస గురువు శుక్రుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు. దీని వల్ల సెప్టెంబర్ 25 ఉదయం 5:16కి, 45 డిగ్రీల కోణంలో అర్ధ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ సమయంలో శుక్రుడు సింహరాశిలో కేతువుతో ఉంటాడు. ఈ యోగం కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ యోగం వృషభ రాశికి ఎంతో మేలు చేస్తుంది. జీవితంలో వృషభ రాశి వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సంబంధాలు . ఆస్తి విషయాల్లో లాభాలు. ఉద్యోగార్థులకు శుభవార్తలు. గౌరవం, హోదా పెరుగుతాయి.
సింహ రాశి
ఈ యోగం సింహ రాశి వారికి ఎంతో శుభప్రదం. శుక్రుడు లగ్నంలో ఉండటం వల్ల వీరికి అన్ని రంగాల్లో విజయమే ఎదురొస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పోటీలోనై గెలుపు వీరిదే.
ధనూ రాశి
ధనుస్సు రాశి వారికి అర్ధ కేంద్ర యోగం అదృష్టాన్నిస్తుంది. ఆగిపోయిన అన్ని పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, విద్యకు మంచి సమయం. ప్రయాణాలు భవిష్యత్ పురోగతికి కొత్త మార్గాలను చూపుతాయి.