Zodiac signs: అక్టోబర్ లో ఈ మూడు రాశుల దశ తిరిగిపోనుంది, ప్రమోషన్స్ గ్యారెంటీ..!
Zodiac signs: గ్రహాల కలయిక మూడు రాశుల వారికి శుభ ఫలితాలను అందించనున్నాయి. మరీ ముఖ్యంగా.. ఉద్యోగంలో బాగా కలిసొస్తుంది. ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయి.

Zodiac signs
జోతిష్యశాస్త్రంలో అక్టోబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో, అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఈ నెలలో ప్రేమ గ్రహం, జ్ఞాన గ్రహం అయిన శుక్రుడు,కుజుడు తమ స్థానాలను మారుస్తాయి. ఈ గ్రహాల కలయిక మూడు రాశుల వారికి శుభ ఫలితాలను అందించనున్నాయి. మరీ ముఖ్యంగా.. ఉద్యోగంలో బాగా కలిసొస్తుంది. ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. గజకేసరి యోగం, లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలను పొందుతారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
కర్కాటక రాశి...
కర్కాటక రాశికి ఈ అక్టోబర్ నెలలో బాగా కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి బాగా కలిసొస్తుంది. ఎక్కువ శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో శాంతి, ప్రశాంతత పెరుగుతాయి. శుక్రుని అనుగ్రహం కారణంగా.. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కష్టపడిన దానికి ప్రతి ఫలం దక్కుతుంది. రుణ సమస్యలు తీరిపోతాయి. వైవాహిక జీవితం ప్రశాంతంగా మారుతూ ఉంటుంది. వ్యాపారంలోనూ బాగా కలిసొస్తుంది. అదృష్టం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే కొద్దీ... ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడానికి.... గ్రహాల చెడు ప్రభావం తగ్గించుకోవడానికి.. శనివారం నవగ్రహ దోష పూజ చేయండి. ఏవైనా దోషాలు, సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.
2.కన్య రాశి....
అక్టోబర్ లో కన్య రాశివారికి ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా.. ఉద్యోగం చేసేవారికి బాగుంటుంది. ఉద్యోగంలో సమస్యలన్నీ తీరిపోతాయి. గతంలో మీరు తీసుకున్న అప్పులు తీరిపోతాయి. ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకొని ఉంటే....ఈ నెలలో తీర్చేస్తారు. వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయం బాగా కలిసొస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు రావచ్చు. ఉద్యోగం చేసే చోట మీ ఖ్యాతి పెరుగుతుంది. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థిక జీవితం గతం కంటే మెరుగుపడుతుంది. సొంత వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలు మారే వారికి బాగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవం, హోదా కూడా పెరుగుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.... అందులో విజయం సాధించగలరు.
3.ధనస్సు రాశి...
అక్టోబర్ నెల ధనుస్సు రాశి వారికి ఊహించిన విధంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే, దాని నుండి మీకు చాలా లాభం వస్తుంది. మీరు కార్యాలయంలో చేసిన పనికి మీకు చాలా ప్రశంసలు, పదోన్నతి , ఉన్నత స్థానం లభిస్తుంది. శత్రువులతో ఎలాంటి పోటీ ఉండదు. రాజకీయాల్లో ఉన్నవారు చాలా కీర్తిని పొందుతారు. మీ ఉన్నతాధికారుల ప్రశంసల కారణంగా మీరు విదేశాలలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఈ సమయంలో చిన్న వ్యాపారాలు చేసే ఈ రాశి వారికి కూడా చాలా లాభం వస్తుంది.