Zodiac signs: ఈ రాశుల వారికి అప్పు ఇస్తే మీరు పేదవారైపోతారు జాగ్రత్త
కొంతమంది అప్పు తీసుకుంటారు. కానీ దాన్ని తిరిగి చెల్లించరు. దీనివల్ల అప్పు ఇచ్చినవాళ్లు ఇబ్బందులు పడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు (Zodiac Sign) అప్పును తిరిగి చెల్లించరు. ఎవరికి అప్పు ఇవ్వకూడదో తెలుసుకోండి.

మీన రాశి
మీన రాశి వారిని పాలించేది బృహస్పతి. ఈ రాశి అధికంగా ఊహాలోకంలో జీవిస్తారు. వీరికి మతిమరుపు ఎక్కువ. అవసరం కోసం అప్పు తీసుకుంటానీ కానీ తిరిగి చెల్లించడం మాత్రం మర్చిపోతారు. మీరు కావాలని చేయకపోయినా మతిమరుపుతో సమయానికి డబ్బును చెల్లించరు. వీరు తీసుకున్న అప్పులే కాదు, ఎవరికైనా తాము ఇచ్చిన డబ్బును కూడా మర్చిపోతారు.
ధనూ రాశి
ధనుస్సు రాశిని పాలించేది బృహస్పతి. ఈ రాశి వారు జీవితంలో చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు చేయాలన్న ఆసక్తి వీరికి ఉండదు. జీవితంపై అంచనాలు కూడా ఉండవు. వీరికి అజాగ్రత్త ఎక్కువ. అందుకే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలన్నది బాధ్యత అని కూడా భావించరు.
సింహ రాశి
సింహ రాశిని పాలించేది సూర్యుడు. ఈ రాశి వారు ఆకర్షణీయంగా, శక్తివంతంగా ఉంటారు. గొప్పల కోసం తెగ అప్పులు చేసి ఖర్చు చేస్తారు. కానీ తిరిగి ఇచ్చే ఆలోచన ఉండదు. చేతిలో డబ్బుంటే ఖర్చు చేసేదాకా నిద్రపోరు. అప్పు తీర్చడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి స్వేచ్ఛ ఎక్కువ. తాము ఏదైనా చేయగలమని భావిస్తారు. అప్పు చేయడం వీరికి ఇష్టం ఉండదు. కానీ అప్పు చేయాల్సి వస్తే, తిరిగి చెల్లించే మార్గాలు కూడా వెతికి ఉంచుకుంటారు. కానీ వీరి అధిపతి యురేనస్. అంటే వరుణ గ్రహం. ఇతని వల్ల బాధ్యతలు ఎక్కువై, తీసుకున్న అప్పు తీర్చడానికి చాలా కష్టపడతారు.
మేష రాశి
మేష రాశిని పాలించేది కుజుడు. వీరు ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఉత్సాహంతో ఉంటారు. పనులను వెంటనే పూర్తి చేయాలనుకుంటారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. ఎంత ఖర్చయినా పని పూర్తి చేయాలనే వీరి కోరిక అప్పులపాలయ్యేలా చేస్తుంది. వీరికి అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టం.