Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్య మాట వినరు..!
కొన్ని తేదీల్లో పుట్టిన వారికి తమకు పూర్తిగా అన్నీ తెలుసు అనే అహంకారం ఉంటుంది. అందుకే, వారు తమ భార్య చెప్పే విషయాన్ని వినాలని అస్సలు అనుకోరు. ఈ తేదీల్లో మీ బర్త్ డేట్ కూడా ఉందా? చెక్ చేసుకోండి..

భర్తల విషయంలో భార్యలు దాదాపు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటారు. ఎందుకంటే.. తమ పెళ్లి రోజు, పుట్టిన రోజు లాంటివి కూడా తమ భర్తకు గుర్తు ఉండవు అని చాలా మంది భార్యలు వాపోతూ ఉంటారు. కొన్ని వస్తువులు ఎక్కడ పెట్టాం అనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. ఇది కామన్ గా ఉండేదే. కానీ.. రెగ్యులర్ గా పురుషులు అందరికీ సెలెక్టివ్ హియరింగ్ ఉంటుందట. అంటే.. వారు భార్యలకు సంబంధించిన విషయాలు, భార్య చెప్పే విషయాలు వినరట. ఒకవేళ విన్నా.. వాటిని పెద్దగా పట్టించుకోరు. వాటిని ఫాలో అవ్వరట. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు భార్యలు చెప్పేది అస్సలు వినరట. మరి ఆ తేదీలేంటో చూద్దామా...
నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.తాము మాట్లాడే ప్రతిమాట చాలా విలువైనదిగా వారు భావిస్తూ ఉంటారు. అందుకే.. వీరు తాము చెప్పిందే అందరూ వినాలి అని అనుకుంటారు. అంతేకానీ.. ఎదుటివారు చెప్పేది మాత్రం అస్సలు వినరు. ముఖ్యంగా భార్యలు చెప్పేది అస్సలు వినరు. వారు చెప్పేది పెద్దగా ఉపయోగకరంగా ఉండదు అనే ఫీలింగ్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.మాకు అన్నీ తెలుసు అనే అహంకారం వీరిలో ఉంటుంది. అందుకే వినరు.
couple fight
నెంబర్ 5..
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన మంచి శ్రోతలు. ఎవరు ఏది చెప్పినా వింటారు. కానీ.. భార్య ఏదైనా చెబితే మాత్రం తమకు ఏదీ వినపడనట్లే నటిస్తారు. చెవులు వినపడని వారిలానే ప్రవర్తిస్తారు. భార్య కాకుండా వేరే వాళ్లు ఎవరైనా ఏదైనా చెబితే మాత్రం చెవులు మొత్తం అప్పగించి వింటారు.
నెంబర్ 9..
ఏ నెలలోనైనా 9వ, 18వ, 27వ తేదీలో పుట్టిన వారు ఎల్లప్పుడూ ఏదో ఒక హడావిడిలో ఉంటారు.ఎదుటివారు చెప్పేది ఏదీ సరిగా వినరు. ముఖ్యంగా
తమ భార్యలు చెప్పేది మాత్రం అస్సలు వినరు. పట్టుపట్టి భార్య ఏదైనా చెబితే.. విన్నట్లు తల ఊపుతారు కానీ.. వినరు.