క్లిష్ట పరిస్థితులను ఏ రాశి పిల్లలు ఎలా తట్టుకుంటారో తెలుసా..?
చిన్న పిల్లలకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే..? వారు వాటిని ఎలా తట్టుకుంటారు..? జోతిష్య శాస్త్రం ప్రకారం.. క్లిష్ట పరస్థితుల్లో ఏ రాశి పిల్లలు ఎలా స్పందిస్తారో ఓసారి చూద్దాం..

పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఒక్కోసారి అనుకూల పరిస్థితులు ఉన్నా.. జీవితంలో ఒక్కసారైనా ప్రతికూల పరిస్థితి ఎదుర్కోక తప్పదు. అది ఎంతటి వారికైనా తప్పదు. అయితే... అలాంటి పరిస్థితులను ఎదుర్కొని నిలపడివారే.. జీవితంలో అనుకున్నది సాధించగలరు. పెద్ద వారి విషయంలో ఇలాంటివి చెబితే బాగుంటుంది. కానీ.. చిన్న పిల్లలకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే..? వారు వాటిని ఎలా తట్టుకుంటారు..? జోతిష్య శాస్త్రం ప్రకారం.. క్లిష్ట పరస్థితుల్లో ఏ రాశి పిల్లలు ఎలా స్పందిస్తారో ఓసారి చూద్దాం..
1.మేష రాశి..
మేష రాశి పిల్లల్లో కాస్త ధైర్యం ఎక్కువ అనే చెప్పాలి. ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైతే .. వాటి నుంచి దూరంగా పారిపోకుండా.. తమంతట తామే స్వయంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తూ ఉంటారు. అయితే.. వీరికి కాస్త కోపం ఎక్కువ. కొద్దిగా ట్రిగ్గర్ చేస్తే చాలు కోపంతో ఊగిపోతారు.
2.వృషభ రాశి..
వృషభ రాశి పిల్లలు ఏ విషయంలో అయినా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. అందుకే ఆ బెస్ట్ ఇవ్వడానికి కొంత సమయం ఎక్కువగానే తీసుకుంటారు. క్లిష్ట పరిస్థితి ఎదురైనా.. దానిని పరిష్కరించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా... మళ్లీ అలాంటి సమస్య రాకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. జీవితంలో నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండేలా చూసుకుంటారు. దాని కోసం మ్యూజిక్ పై ఎక్కువ దృష్టి పెడతారు.
3.మిథున రాశి..
మిథున రాశి పిల్లలు ఎక్కువగా అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు అన్నింట్లోనూ తమకు దురదృష్టం కలిగి ఉందని భయపడుతూ ఉంటారు. తమకు పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో ఎక్కువగా భయపడుతూ.. బాధ పడుతూ ఉంటారు. అన్నీ తమకు చెడు మాత్రమే జరుగుతందని బాధపడుతూ ఉ:టారు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి చెందిన పిల్లలు సహజంగానే నిరాశవాదులు. వీరు అవసరం లేకపోయినా.. తమ జీవితంలో నెగిటివిటీ గురించి ఆలోచిస్తారు. మామూలుగా వీరికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ. ఏదైనా సమస్య వస్తే.. ఇక వీరి గురించి చెప్పక్కర్లేదు. దీని నుంచి బయటపడాలంటే... శ్వాస మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు నెగిటివ్ ఆలోచనలు తగ్గే అవకాశం ఉంటుంది.
5.సింహ రాశి..
సింహ రాశి పిల్లల్లో కూడా ఎక్కువగా.. నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడూ వీరు నెగిటివ్ గానే ఆలోచిస్తారు. ఇక పరిస్థితి బాగోని సమంలోనూ వీరికి అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీరికి ఈ ఆలోచనలు తగ్గాలి అంటే.. ఏదైనా వెకేషన్ కి అప్పుడప్పుడు తీసుకువెళుతూ ఉండాలి.
6.కన్య రాశి..
కన్య రాశి పిల్లలు కాస్త తెలివిగా ఆలోచిస్తారు. ఏవైనా చెడు జరుగుతున్నా.. తమకు చెడు ఆలోచనలు కలిగినా... వాటిని తుడిచేందుకు ప్రయత్నిస్తారు. తమ మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలని వారు భావిస్తారు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారు.
7.తుల రాశి..
తుల రాశివారు తమకు ఎదురైన క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడటానికి ఎదురుచూస్తూ ఉంటారు. అది చిన్నదో.. పెద్దదో అని చూడరు. వచ్చిన సమస్య వచ్చినట్లే పోతుందని ఎదరుచూస్తూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలు వచ్చినా.. వాటిని వెంటనే తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి పాజిటివిటీ చాలా ఎక్కువ. ఏం జరిగినా.. అంతా తమ మంచి కకోసమే జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. తమ ఆలోచనలను ఆశచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
9. ధనస్సు రాశి..
ధనస్సు రాశి పిల్లలు అన్ని విషయంలోనూ చాలా నిగ్రహంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే మాత్రం వీరికి ఊపిరాడనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలా జరిగినప్పుడు వీరు... ఆ సమస్య నుంచి బయటపడటానికి అక్కడి నుంచి ఏదైనా వెకేషన్ కి వెళ్లడం లేదంటే.. తమకు సమస్య కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండటం లాంటివి చేస్తుంటారు.
10.మకర రాశి..
ఈ మకర రాశి పిల్లలకు చిన్నతనం నుంచే బాధ్యతలు చాలా ఎక్కువ. చాలా బాధ్యతగా ఉంటారు. కానీ.. ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైతే మాత్రం.. వెంటనే తన కుటుంబం దగ్గరకు వెళ్లిపోతారు. కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు.
11.కుంభ రాశి..
కుంభ రాశికి చెందిన పిల్లలు.. అంతా సవ్యంగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు. అలా కాకుండా ఏదైనా తేడా కొడితే మాత్రం చాలా నిరాశకు గురౌతుంటారు. అయితే... సమస్య ఎదురైతే మాత్రం.. వీరికి ఉన్న స్నేహితులు వీరికి అండగా నిలుస్తారు. వారి సహాయంతో... అన్ని సమస్యలను పరిష్కరించుకంుటారు.
12.మీన రాశి..
మీన రాశి పిల్లలు సహజంగానే చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అయినా.. వీరిని ఇబ్బంది పెట్టడం మాత్రం ఎవరి తరమూ కాదు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోయి.. ఆ సమస్య కి ఎంత దూరంగా ఉండాలో ఆలోచిస్తారు. ఆ తర్వాత.. దానిని మర్చిపోయి.. ఫ్రెష్ గా రోజును మళ్లీ ప్రారంభిస్తారు.