ఏ రాశివారికి ఏ సమయంలో అసూయ కలుగుతుందో తెలుసా?
కొందరిలో ఈ అసూయ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కొందరిలో కాస్త తక్కువగా ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎక్కువ అసూయ ఉంటుందో... అది ఎప్పుడు బయటకు వస్తుందో ఓసారి చూద్దాం...

jealous
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా... అసూయ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే... కొందరిలో ఈ అసూయ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కొందరిలో కాస్త తక్కువగా ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎక్కువ అసూయ ఉంటుందో... అది ఎప్పుడు బయటకు వస్తుందో ఓసారి చూద్దాం...
1.మేష రాశి..
మేష రాశి ప్రేమ ఎక్కువ. తాము ప్రేమించిన వారిపట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకే ప్రేమించిన వారి విషయంలోనే వారు ఎక్కువగా అసూయ చూపిస్తారు. ప్రేమించిన వారు ఇతరులతో క్లోజ్ గా ఉంటే వీరు తట్టుకోలేరు.
2.వృషభ రాశి..
ఈ రాశివారికి అసూయ చాలా తొందరగా వస్తుంది. వీరికి ఓపిక చాలా తక్కువ. చిన్న విషయాలకే వీరు జెలస్ ఫీలౌతారు. అర్థంచేసుకునే మనస్తత్వం చాలా తక్కువ.
3.మిథున రాశి..
ఈ రాశివారు అన్నింటినీ పెద్దగా పట్టించుకోరు. ఏ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునేవారు కాదు. కాబట్టి... వీరికి తొందరగా జెలసీ వచ్చేది కాదు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి తొందరగా జెలసీ వచ్చేస్తుంది. కానీ.... వారు దానిని బయటకు కనిపించకుండా జాగ్రత్తపడతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని.. బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడతారు.
5.సింహ రాశి..
వీరికి ఏదైనా వస్తువు దొరకకపోతే... దానిని దక్కించుకోవాలనే కోరిక వీరికి చాలా ఎక్కువ. తమకు దక్కనిది ఎవరికైనా దక్కితే జెలసీ ఫీలౌతారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు తొందరగా జెలసీ ఫీలవ్వరు. ఎందుకంటే... వీరికి తమ బంధంపై నమ్మకం చాలా ఎక్కువ. కాబట్టి... వీరికి ఎలాంటి అనుమానం, అసూయ అనేవి రావు.
7.తుల రాశి..
తుల రాశి వారిలో జెలసీ అనేది చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఎందుకంటే.. వీరు ఎదుటివారిని తొందరగా అర్థం చేసుకుంటారు. కాబట్టి... ఎలాంటి సమస్యలు ఉండవు.
8.వృశ్చిక రాశి...
ఈ రాశివారు తొందరగా ఎవరినీ నమ్మరు. కాబట్టి... వీరికి తొందరగా అసూయ వచ్చేస్తుంది. తొందరగా వెంటనే జెలస్ ఫీలౌతారు. తమకు నచ్చినవారు వేరే ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి నమ్మకం చాలా ఎక్కువ. కాబట్టి... ఎవరి విషయంలోనూ వీరు తొందరగా జెలసీ ఫీలవ్వరు. ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉండవు.
10.మకర రాశి..
ఈ రాశివారికి అప్పుడప్పుడు జెలసీ అనేది వస్తుంది. కానీ... అది ఎవరిపైనా తొందరగా చూపించరు. మనసులోనే దాచుకుంటారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారు ఏ విషయాన్నైనా మనసుకు తీసుకోరు. తొందరగా ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకోరు. వీరికి అసూయ అనే భావన తొందరగా కలగదు.
12.మీన రాశి..
ఈ రాశివారికి చాలా తక్కువ సమయాల్లో అసూయ కలుగుతుంది. అంటే 50, 50 అని చెప్పొచ్చు. జెలసీ కాదు కానీ... వీరికి కోపం ఎక్కువగా వస్తుంది.