- Home
- Astrology
- Lord Shani: రెండేళ్ల వరకు శని దేవుని ఆశీస్సులు నిండుగా ఉండే ఐదు రాశులు ఇదిగో, వీరికి తిరుగే ఉండదు
Lord Shani: రెండేళ్ల వరకు శని దేవుని ఆశీస్సులు నిండుగా ఉండే ఐదు రాశులు ఇదిగో, వీరికి తిరుగే ఉండదు
శని దేవుడు మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. 2027 వరకు అదే రాశిలో ఉంటాడు. కాబట్టి ఐదు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. శని దేవుడి వల్ల వారి కోరుకున్న జీవితాన్ని పొందుతారు.

వృషభ రాశి
శని దేవుడు ప్రస్తుతం వృషభ రాశిలోని 11వ ఇంట్లో ప్రభావం చూపిస్తున్నాడు. 2027 వరకు అదే ఇంట్లోనే ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారాలలో కూడా లాభాలు రావచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం కూడా ప్రయోజనకరమే. మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంది.
కర్కాటక రాశి
ప్రస్తుతం శని దేవుడు కర్కాటక రాశిలోనే తొమ్మిదవ ఇంట్లో ప్రభావం చూపిస్తాడు. శని దేవుడు 2027 వరకు ఇక్కడే ఉంటాడు. కాబట్టి మీకు అదృష్టం దక్కుతుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా ఉంటాయి. విద్యారంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. గతంలో చెడిపోయిన పనులన్నీ నెరవేరయ్యే కాలం ఇది. తల్లిదండ్రులతో మీ బంధం మరింత మధురంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
శని వృశ్చిక రాశి ఐదవ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో వివాహ అవకాశాలు వృశ్చిక రాశికి వారికి అధికంగా ఉంటాయి. వారి ప్రేమ జీవితం కూడా మధురంగా ఉంటుంది. పిల్లల వల్ల వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. పూజా కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
తులా రాశి
శని దేవుడు ప్రస్తుతం ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. 2027 వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి ఆర్థిక లాభాలు దక్కుతాయి. మీకున్న అప్పులు తీరిపోయి ఆదాయం పెరుగుతుంది. ఈ కాలంలో పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగం వ్యాపారంలో కూడా మీరు స్థిరంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
మకర రాశి
శని దేవుడు ప్రస్తుతం మకర రాశిలో మూడవ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబం నుంచి మీకు ఎంతో మద్దతు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కాలంలో ప్రారంభించే పనులు విజయవంతం అవడం సులువు. అలాగే కొన్ని ప్రయాణాల ద్వారా కూడా లాభాలు పొందుతారు.