Birth Date: ఈ తేదీలలో జన్మించిన అమ్మాయిలు మిస్టరీ గర్ల్స్.. ఎవ్వరికీ అర్థం కారు
Birth Date: సంఖ్యా శాస్త్రం అనేది ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని నిర్ణయిస్తుంది. అలా కొన్ని తేదీల్లో జన్మించిన అమ్మాయిలు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ తేదీల్లో జన్మించే వారికి ఎలాంటి బుద్ధులు ఉంటాయో తెలుసుకోండి.

మిస్టరీ గర్స్ల్ వీరంతా
న్యూమరాలజీని నమ్మేవారి సంఖ్య ఎక్కువ. ఒక వ్యక్తి జన్మించిన తేదీని బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు వారి లక్షణాలు స్వభావాలను కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొంతమంది అమ్మాయిల వ్యక్తిత్వం గురించి ఇచ్చాము. ప్రతి నెలలో కొన్ని తేదీలలో జన్మించే అమ్మాయిలు చాలా రహస్య జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ప్రతి విషయాన్ని రహస్యంగానే ఉంచుతారు. వీరు ఓపెన్ గా ఏదీ మాట్లాడరు. ప్రతిదీ మనసు లోతుల్లో దాచేస్తారు. స్వీయ నిర్ణయాలు తీసుకునేందుకే ఇష్టపడతారు. అలాంటివారు ఏ తేదీలలో జన్మిస్తారో తెలుసుకోండి.
ఈ తేదీలలో జన్మించిన వారు
ప్రతి నెలా 7,16,25వ తేదీలలో జన్మించిన అమ్మాయిల వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది. వీరి మూల సంఖ్య 7 అవుతుంది. అంటే వీరు జన్మించిన తేదీలోని అంకెలను కలిపితే వచ్చే అంకె రాడిక్స్ సంఖ్య లేదా మూల సంఖ్య అంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం నెలలో పైన చెప్పిన తేదీలలో జన్మించిన అమ్మాయిలు పై కేతు ప్రభావం అధికంగా ఉంటుంది. ఏడు అనేది కేతు గ్రహానికి సంబంధించిన సంఖ్య. అందుకే వీరు రహస్యంగా విషయాలను దాస్తారు. వీరి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి.
చాలా తెలివైన వారు కూడా
మూల సంఖ్య ఏడు కలిగిన అమ్మాయిలు చాలా తెలివైన వారుగా ఉంటారు. అలాగే చురుగ్గా కనిపిస్తారు. ఎంతో ధైర్యవంతులు కూడా. కష్టమైన పనులను కూడా ఎంతో సులువుగా చేసేస్తారు. వీరుప్రతిదాన్ని విభిన్న కోణం నుంచి చూస్తారు. సవాళ్లతో కూడిన పరిస్థితులను కూడా వీరు ప్రశాంతంగా దాటేస్తారు. మనసును అదుపులో ఉంచుకోవడంలో వీరిని మించిన వారు లేరు. వీరు తమ భావాలను అంత తేలికగా బయటపెట్టారు. అందుకే వీరిని అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పాలి.
కెరీర్ లో కష్టపడతారు
వీరు తమ కెరీర్ గురించి కూడా ఎంతో ఆలోచిస్తారు. కష్టపడి పని చేస్తారు. అంకిత భావంతో పరిపూర్ణంగా ఉండేందుకు ఇష్టపడతారు. కుటుంబం, సమాజంలో వీరికి గౌరవం ఎంతో పెరుగుతాయి. ఈ అమ్మాయిలు ఇతరులతో కలిసి ఉండేందుకు ఇష్టపడరు.
స్నేహితులు తక్కువ
ఏడు మూల సంఖ్య కలిగిన అమ్మాయిలకు స్నేహితులు చాలా తక్కువ. కానీ పూర్తి నిజాయితీగా తక్కువ మందితోనైనా స్నేహం చేస్తారు. సంబంధాలలో నమ్మకం వీరికి ముఖ్యం. తమకు ఇష్టమైన వారి కోసం ఎంత దూరానికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఎంతో నమ్మితే తప్ప తమ విషయాలను బయటపెట్టారు. అలాగే ఎదుటివారి విషయాలను తెలుసుకునేందుకు కూడా ఇష్టపడరు.