ఈ వారం నాడు పుట్టినవారు చాలా స్పెషల్.. వీరి వ్యక్తిత్వానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన రోజు.. వారి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, ప్రవర్తనపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. శుక్రవారం పుట్టినవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరి అందం, వ్యక్తిత్వానికి ఎవ్వరైనా ఫిదా అయిపోతారు.

Birth Week Astrology
శుక్రవారం పుట్టినవారు శుక్రుడి పాలనలో ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్రుడు సౌందర్యం, ప్రేమ, కళ, సుఖం, సంపద, సంగీతం, సంస్కారం వంటి వాటికి కారకుడు. శుక్రవారం నాడు జన్మించిన వారిలో సహజమైన ఆకర్షణ, సున్నితత్వం, సౌందర్యాన్ని ఆస్వాదించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున పుట్టినవారు సాధారణంగా అందమైన వస్తువులను, కళాత్మకమైన విషయాలను, లగ్జరీ జీవితాన్ని ఇష్టపడతారు. వీరు అందరి దృష్టిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
అందరితో స్నేహంగా ఉంటారు
శుక్రవారం జన్మించిన వ్యక్తులు ప్రేమ, స్నేహం పట్ల నిబద్ధత కలిగి ఉంటారు. వీరు తమ జీవితంలో శాంతిని కోరుకుంటారు. ఎవరికీ బాధ కలిగించకుండా, అందరితో స్నేహంగా ఉండే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. రచన, సంగీతం, ఫ్యాషన్ లేదా సృజనాత్మక రంగాల్లో వీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. శుక్ర గ్రహం ప్రభావం వల్ల వీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు.
కుటుంబం పట్ల అపారమైన ప్రేమ
శుక్రవారం పుట్టినవారు కుటుంబం పట్ల అపారమైన ప్రేమ చూపిస్తారు. సంబంధాలలో వీరు నిజాయితీగా ఉంటారు. కానీ వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్. చిన్నచిన్న విషయాలను కూడా మనసుకి తీసుకుంటారు. ఎవరి నిరాకరణను, కఠినమైన మాటలను వీరు భరించలేరు. వీరు చుట్టుపక్కల వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ దానివల్లే కొన్నిసార్లు బాధపడతారు.
శుక్ర గ్రహ ప్రభావంతో..
శుక్ర గ్రహ ప్రభావంతో వీరికి సులభంగా ధన లాభం కలుగుతుంది. వీరు ఆర్థికంగా స్థిరత్వం కోరుకుంటారు. కానీ లగ్జరీ లైఫ్ కోసం కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ రోజు పుట్టిన వారు సాధారణంగా అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, తమ వ్యక్తిత్వం ద్వారా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు. ఎదుటి వ్యక్తిని వీరు ఇట్టే ఆకర్షిస్తారు. వీరికి సమాజంలో గౌరవం, పేరు సులభంగా దక్కుతాయి.
తాత్విక దృష్టితో..
శుక్రవారం పుట్టిన వ్యక్తులు జీవితాన్ని తాత్విక దృష్టితో చూస్తారు. వీరు మాటలకంటే భావాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరికి సౌందర్యం కేవలం బాహ్యంగా కాక, అంతర్గత విలువల్లోనూ కనిపిస్తుంది. సృజనాత్మకత, స్నేహపూర్వ స్వభావం, సానుభూతి వీరి ప్రధాన బలాలు. కానీ కొన్నిసార్లు ఈ శాంత స్వభావం వీరిని సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేస్తుంది.